ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు విషయంలో ఓ మార్షల్ భద్రతా నిబంధనలను ఉల్లంఘించడం కలకలం రేపింది. చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగు పెడుతున్న సమయంలో  సభలో మార్షల్‌గా వ్యవహరించిన వ్యక్తి రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీయడం ప్రారంభించారు. ఈ విషయాన్ని చంద్రబాబు భద్రతా సిబ్బంది గుర్తించి వెంటనే ఆ మార్షల్‌ను అదుపులోకి తీసుకున్నారు. చంద్రబాబుకు జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉంటుంది. మార్షల్ ఎందుకు రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నార్నదానిపై  చంద్రబాబు సెక్యూరిటీ ఆ మార్షల్‌ను ప్రశ్నిస్తున్న సమయంలో హుటాహుటిన చీఫ్ మార్షల్ వచ్చి చంద్రబాబుకు క్షమాపమ చెప్పారు. 


Also Read : రాజధానిపై కాదు ప్రభుత్వ నిర్ణయ చట్టబద్దతపై విచారణ ... హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు


రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్న మార్షల్‌ను విడిపించుకుని వెళ్లారు. మార్షల్స్ వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సభలోనూ ప్రస్తావించారు. ఇలా ఫోటోలు తీసిన అంశం స్పీకర్ అనుమతితోనే జరిగిందా అని టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే స్పీకర్ తమ్మినేని సీతారాం తనకు సమాచారం లేదని.. అలా ఫోటోలు, వీడియోలు తీసిన విషయం తనకు తెలియదన్నారు. ఏం జరిగిందో తెలుసుకుని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 


Also Read:  దర్యాప్తు అలా కాదు.. ఇలా చేయండి..! వివేకా హత్య కేసులో సీబీఐ డైరక్టర్‌కు అరెస్టయిన నిందితుడి లేఖ !


చంద్రబాబు భద్రత విషయంలో తమకు అనుమానాలున్నాయని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉద్దేశంతో మార్షల్ రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీస్తున్నారో విచారణ చేయించాలని కోరుతున్నారు. సాధారణంగా మార్షల్స్ విధులు వేరుగా ఉంటాయి. అందరూ ప్రజాప్రతినిధులే వస్తారు కాబట్టి వారి భద్రతా కోణంలోనూ వారి విధులను చాలా స్ట్రిక్ట్‌గా నిర్వచిస్తారు. 


Also Read : చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వర్ష బీభత్సం... వరద ముంపులో తిరుపతి... జనజీవనం అస్తవ్యస్థం


అందుకే ఏకంగా జడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న ఓ ప్రతిపక్ష నేత దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించడం  కలకలం రేపుతోంది. అలా  తీస్తున్నప్పుడు పట్టుకున్నది జడ్ ప్లస్ సెక్యూరిటీ సిబ్బంది కావడంతో వారు తమ సెక్యూరిటీ రివ్యూలో భాగంగా దీన్ని తమ పై అధికారులకు తెలియచేసే అవకాశం ఉంది. 


Also Read : సంబరాలే కాదు సమీక్ష కూడా చేసుకోవాలి.. వైఎస్ఆర్‌సీపీకి సంకేతాలిస్తున్న ఫలితాలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి