Farm Laws: జై కిసాన్.. ఏం చేస్తిరి.. ఏం పోరాటం చేస్తిరి.. అన్నదాత నీకు 'దేశం' సలాం

జై కిసాన్.. అన్నదాత ఇది నీ గెలుపు... నువ్వు చేసిన పోరాటం అనన్య సామాన్యం. నీ తెగువకు 'దేశం' చేస్తోంది.. సలాం

Continues below advertisement

కష్టాల సాగుబడిలో నిత్యమూ శిథిలమవుతున్నా... జనావళికి గుక్కెడు బువ్వను అందించడానికి.. రాత్రింబవళ్లు శ్రమించిన అన్నదాత చెమట బిందువల శ్రమశక్తికి... 'దేశం' చేస్తోంది సలాం..

Continues below advertisement

ఎండ, వాన లెక్కేలేదు.. రద్దు చేసేవరకు తగ్గేదే లేదు! ఇది నూతన సాగు చట్టాలపై ఉద్యమం సాగించిన తొలి రోజు రైతులు చేసిన నినాదం..

అప్పటి నుంచి ఇప్పటివరకు.. ఎండ, వాన, చలి.. ఇలా వాతావరణ మార్పులకు...

బారీకేడ్లు, అధికారాలు.. ఇలా దేనికీ తలొగ్గకుండా.. అనుకున్నది సాధించిన అన్నదాతకు 'దేశం' సలాం

నీ పోరాటానికి సలాం...

దాదాపు 8 నెలలుగా రైతుల ఉద్యమం సాగింది. నూతనంగా తెచ్చిన సాగు చట్టాలను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. కార్పొరేట్లకు లబ్ధి చేకూరేలా ఈ చట్టాలు ఉన్నాయని అన్నదాతలు ఆవేదన చెందారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చట్టాలను రద్దు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇప్పటికే రైతులకు- అన్నాదాతలకు మధ్య చాలా సార్లు చర్చ జరిగింది.

ప్రభుత్వం తెచ్చిన ఎలాంటి ప్రతిపాదనను రైతులు అంగీకరించలేదు. బేషరతుగా చట్టాలను రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వం దిగివచ్చేవరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఎండ, వాన, చలి ఇలా ఏది లెక్కచేయకుండా రైతులు ఆందోళన కొనసాగించారు. ఈ మొక్కవోని దీక్షే వారికి ఈ విజయం తెచ్చిపెట్టింది.

ఒకానొక సమయంలో చలికి ఎముకలు కొరుకుతోన్న చలించకక వారు చూపించిన తెగువకు యావత్ దేశం కంటనీరు పెట్టుకుంది. అయిన  ఇప్పటివరకు సర్కార్‌కు కనికరం కలగలేదు. అయితే ఎట్టకేలకు సాగు చట్టాలను రద్దు చేస్తున్నామని మోదీ నేడు ప్రకటించారు.

ముందే చేసి ఉంటే...

రైతుల పోరాటాన్ని కేంద్రం తక్కువ అంచనా వేసిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఎన్ని దఫా చర్చలు జరిపినా రైతులు తలొగ్గలేదు. ఈ పని కేంద్రం ముందే చేసి ఉంటే బాగుండేదని విశ్లేషకులు అంటున్నారు. రైతులు సాధించిన విజయం పట్ట దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ స్పందిస్తున్నాయి. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ, ఆప్ సహా పలు రాజకీయ పార్టీలు రైతు ఉద్యమానికి మొదటి నుంచి మద్దతు తెలిపాయి. నూతన సాగు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశాయి. ఎట్టకేలకు మోదీ సర్కార్ సాగు చట్టాలను రద్దు చేసింది.

అధికారం కంటే అన్నదాత తెగువే గొప్పదని ప్రతిపక్ష నేతలు ట్వీట్లు చేస్తున్నారు.

ముమ్మాటికీ ఇది మోదీ సర్కార్‌పై అన్నదాతల విజయంగా చెబుతున్నారు. ఇంతటి పోరాటాన్ని నడిపిన అన్నదాత నీకు 'దేశం' సలాం.

Also Read: Breaking News LIVE: ప్రధాని మోదీ సంచలన నిర్ణయం.. నూతన సాగు చట్టాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటన

Also Read: Rakesh Tikait: రాకేశ్ టికాయత్.. అలుపెరుగని యోధుడు.. అన్నదాతను నడిపించిన నాయకుడు!

Also Read: 3 Farm Laws Repealed: మోదీ తలవంచారా? ఇది ఎన్నికల వ్యూహమా? రైతుల విజయమా?

Continues below advertisement
Sponsored Links by Taboola