ఏపీ, ఒడిషా రాష్ట్రాల మధ్య ఉన్న కీలకమైన సమస్యలను పరిష్కరించుకునేందుకు చీఫ్ సెక్రటరీలతో కమిటీ వేయాలని ముఖ్యమంత్రులు జగన్, నవీన్ పట్నాయక్ నిర్ణయించారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి  భువనేశ్వర్ వెళ్లి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్‌తో సమావేశం అయ్యారు. దాదాపుగా గంట సేపు జరిగిన సమావేశంలో నేరడి బ్యారేజీ, జంఝావతి ప్రాజెక్ట్, కొఠియా గ్రామాల సమస్యలపై చర్చించారు. ముఖ్యమంత్రులు ఇద్దరూ పరస్పర సంప్రదింపులు ఉండేలా చీఫ్ సెక్రటరీలతో కమిటీ ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారం చేసుకోవాలని నిర్ణయించారు. 




Also Read : ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు... ఈ నెల 18 నుంచి సభాపర్వం


ఒడిశా సచివాలయంలో జరిగిన భేటీలో ఒడిశా అభ్యంతరాలతో అనేక దశాబ్దాలుగా అపరిష్కృతంగా మిగిలిపోయిన సమస్యలపై ప్రధానంగా చర్చించారు. వంశధార నదిపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం ఒడిషాతో ముడిపడి ఉంది. ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు వంశధార నదీ జలాలను సమానంగా పంచుతూ 2017 సెప్టెంబర్‌ 13న ట్రి బ్యునల్‌ తీర్పు ఇచ్చింది.  నేరడి బ్యారేజీలో ముంపునకు గురయ్యే 108 ఎకరాల భూమిని ఒడిశా ప్రభుత్వం సేకరించి ఏపీ ప్రభుత్వానికి అప్పగించాలని, ఇందుకు ఏపీ ప్ర భుత్వం నష్టపరిహారం ఇవ్వాలని ట్రిబ్యునల్‌  ఆదేశించింది.  బ్యారేజీ నిర్మాణానికి అయ్యే వ్యయాన్ని ఆయకట్టు ప్రాతిపదికన దామాషా పద్ధతిలో ఇరు రాష్ట్రాలు భరించాలని సూంచింది. అయినప్పటికీ ఈ భారం భరించేందుకు ఒడిశా ప్రభుత్వం సిద్ధంగా లేదు. ఈ అంశంపై ఎక్కువగా జగన్ చర్చించారు. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !


  
రెండు రాష్ట్రాల మధ్య ఇటీవలి కాలంలో కొఠియా గ్రామాల సమస్య అంతకంతకూ పెరుగుతోంది. దీన్ని పరిష్కరించుకునేందుకు జగన్ ప్రయత్నాలు చేశారు. సీఎస్‌లలకమిటీతో త్వరలోనే ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నారు. భువనేశ్వర్ వెళ్లే ముందు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి కుమార్తె వివాహ రిసెప్షన్‌కు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. నూతన వధూవరులను జగన్‌ ఆశీర్వదించారు.


Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


భువనేశ్వర్ పర్యటనలో సీఎం వైఎస్‌ జగన్‌తో పాటు సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, ఇరిగేషన్ ప్రిన్సిపాల్ సెక్రెటరీ శ్యామలరావు, రెవెన్యూ ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉషా రాణి భేటీలో పాల్గొన్నారు.


Also Read : హోరాహోరీగా ఏపీలో మినీ స్థానిక సమరం ! తాజా పరిస్థితి ఇదే..


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి