కాంగ్రెస్ పార్టీ అంటే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఆ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అంటే.. నేతలు గ్రూపు కట్టడం..  ఒకరిపై ఒకరు కుట్రలు చేసుకోవడం. ఇలాంటి పరిస్థితుల్లో అందులో ఉన్న నేతలందరూ ఏదో ఓ  గ్రూపులో ఉండాలి. ఏ గ్రూపులో లేకపోతే అసలు పార్టీలో లేనట్లే.  కానీ ఏ గ్రూపు కాకుండా అజాతశత్రువుగా ఉండి రాజకీయ ప్రాధాన్యం దక్కించుకున్న ఒకే ఒక్క నేత కొణిజేటి రోశయ్య. 


Also Read : వైఎస్‌ను కాంగ్రెస్‌ నుంచి బహిష్కరించాలన్న రోశయ్య..ఆ వైఎస్‌కే ఆత్మబంధువు ఎలా అయ్యారు !?


ఐదుగురు ముఖ్యమంత్రుల దగ్గర మంత్రిగా, ఆ తరువాత ముఖ్యమంత్రిగా , గవర్నర్ గా అనేక పదవులు చేపట్టిన ఆయన సుదీర్గ రాజకీయ ప్రస్థానంలో అనితర సాధ్యుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆర్ధిక శాఖ అంటే నాకు అత్యంత ఇష్టమైన సబ్జెక్టు అని ప్రకటించుకున్న ఆయన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా 15 సార్లు బడ్జేట్ ప్రవేశపెట్టిన నేతగా గుర్తింపు పొందారు, ఈ క్రమంలో వరుసుగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశ పెట్టిన నేతగా కూడా రికార్డు సృష్టించారు. అధికారంలో ఉన్నప్పుడు ఆ దర్పం చూపడం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దిగాలు పడటం ఎరుగని నేతగా గుర్తింపు పొందిన వ్యక్తి .   


Also Read : మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !


హోం మంత్రి అయినా ఆర్ధిక మంత్రి అయినా రెవెన్యూ శాఖా మంత్రి అయినా సరే ఆయన నిర్ణయాలను కాదనేవారు ఉండరు. ఆయన ఒక సూచన చేస్తే దాన్ని కచ్చితంగా అమలు చెయ్యాల్సిందే. ఆయన ఒక్క మాట చెప్తే పార్టీలో అయినా, ఏ ప్రభుత్వంలో అయినా, ఏ సిఎం ఉన్నా సరే, ఎలాంటి మంత్రి అయినా సరే పని జరగాల్సిందే. ఆయనను ఇబ్బంది పెట్టిన నాయకుడు లేరు, ఆయన ఇబ్బంది పెట్టిన నాయకుడు లేరు. ఉమ్మడి ఏపీలో ఆయన సాధించిన విజయాలు ఇప్పటి వరకు ఏ ఆర్ధిక మంత్రి కూడా సాధించలేదు. 


Also Read : తరలిపోయిన ఉమ్మడి రాష్ట్ర దిగ్గజ నేత.. మాజీ సీఎం రోశయ్య కన్నుమూత !


1978 నుండి ఎం. చెన్నా రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర రవాణా మరియు రోడ్లు మరియు భవనాల మంత్రి, 1980 నుండి టి. అంజయ్య ఆధ్వర్యంలో రవాణా, గృహనిర్మాణ మంత్రి. 1982 నుండి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో హోంమంత్రి, 1989 నుండి ఎం. చెన్నా రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర ఆర్థిక, రవాణా, విద్యుత్ మంత్రిగా పని చేశారు. 1990 డిసెంబర్ నుండి నేదురుమల్లి జనార్థనారెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆర్థిక, వైద్య, ఆరోగ్య, విద్య, విద్యుత్ శాఖలను నిర్వహించారు. ఆ తర్వాత 1992 అక్టోబర్ నుండి విజయ భాస్కర రెడ్డి కేబినెట్‌లో అవే శాఖలు నిర్వహించారు. 2004 నుండి వైయస్ రాజశేఖరరెడ్డి మంత్రివర్గంలో ఆర్థిక, ప్రణాళిక మరియు శాసన వ్యవహారాల మంత్రిగా చేశారు. 


Also Read: Konijeti Rosaiah Death: మాజీ గవర్నర్‌ రోశయ్య కన్నుమూత.. ప్రముఖుల సంతాపం


కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది అంటే ఆయన పదవికి ఏ డోకా ఉండదు. 1968, 1974, 1980, 2009లో ఎమ్మెల్సీ గా ఎన్నికయ్యారు.  1989 , 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు.  1998 లో నరసరావు పేట నుంచి ఎంపీగా గెలిచారు. వైఎస్ అకాల మరణంతో ఆయనకు క్లిష్ట పరిస్థితుల్లో సిఎం గా ఎన్నికయ్యే పరిస్థితి వచ్చింది. ఆయన సిఎం అనగానే అప్పటి కాంగ్రెస్ నాయకులు ఎవరూ కూడా ఆయనను కాదనలేదు. జేసి దివాకర్ రెడ్డి లాంటి సీనియర్ నేతలు ఉన్నా సరే ఆయనను వద్దని ఎవరూ చెప్పలేదు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి