Ram Gopal Varma is playing with police: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనపై ఏపీలో నమోదైన కేసుల విషయంలో పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యేందుకు నిరాకరిస్తున్నారు. గతంలో నోటీసులు జారీ చేసినప్పుడు ఆయన విచారణకు హాజరు కాలేదు. వారం రోజుల సమయం కావాలని అడిగారు. ఇప్పుడు వారం తర్వాత మళ్లీ విచారణకు హాజరు కాలేదు. తన లాయర్ ద్వారా మరో రెండు వారాల సమయం కావాలని ఆ తర్వాత కూడా కుదిరిదే వర్చువల్ గా హాజరవుతారని పోలీసులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు ఆర్జీవీ. ఇది కూడా ఆయన లాయర్ ద్వారా పంపించారు. 

Continues below advertisement


ముందస్తు బెయిల్ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ


రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్‌పై విచారణ మంగళవారం జరగాల్సి ఉంది. అయితే ఈ లోపే ఆయన విచారణకు సహకరించడం మానేశారు. పోలీసుల నోటీసులకు పదే పదే స్పందించకపోవడంతో విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు చెప్పే అవకాశం ఉంది. దీని వల్ల ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు సన్నగిల్లుతాయని లాయర్లు చెబుతున్నారు. అయితే ఆర్జీవీ మాత్రం ఏపీ పోలీసుల్ని తేలికగా తీసుకుని డుమ్మా కొడుతున్నారు.     


Also Read: తమిళనాడులో రామ్‌గోపాల్ వర్మ? అరెస్టు భయంతోనే పారిపోయారా?


విచారణకు సహకరించడం లేదని పోలీసులు కోర్టుకు చెప్పే అవకాశం 


శని, ఆదివారం తాను కోయంబత్తూరులో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు ఆర్జీవీ. తర్వాత ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారు. హైదరాబాద్‌లోని  ఇంటికి వచ్చిన పోలీసులకు ఆయన సిబ్బంది  ఆయన హైదరాబాద్‌లో లేరని చెబుతున్నారు. కానీ ఆయన హైదరాబాద్‌లోనే ఉన్నట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. కోయంబత్తూరు పోలీసుల సాయం అక్కడ ఉన్నాడేమో ఆరా తీశారు. కానీ ఆయన హైదరాబాద్ వెళ్లిపోయినట్లుగా సమాచారం అందుకున్నట్లుగా తెలుస్తోంది. ఆయనతో పాటు ఆయన సన్నిహితులుక చెందిన ఫామ్ హౌస్‌లు, ఇళ్లపై ఏపీ పోలీసులు నిఘా పెట్టారు. 


Also Read: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌- బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌


విచారణకు హాజరైతే ధర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారన్న భయంలో  ఆర్జీవీ 


పోలీసుల విచారణకు హాజరైతే అరెస్టు చేసే అవకాశాలు తక్కువగా ఉండేవని ఇప్పుడు అనవసరంగా డుమ్మా కొట్టడం వల్ల ఎక్కడ ఉన్నా అరెస్టు చేసే అవకాశాలు ఉంటాయని పలువురు లాయర్లు చెబుతున్నారు. రేపు కోర్టులో కూడా ఈ విషయాన్ని ఆర్జీవీ డిఫెండ్ చేసుకోలేరని అంటున్నారు. మొదటి సారి గడువు అడిగితే పోలీసులు ఇచ్చారు. అయితే ఆ గడువుకు హాజరు కాకుండా ఇంకా గడువు కావాలని కోరడం.. పోలీసుల్ని తక్కువ చేయడమేనని అంటున్నారు. ఆర్జీవీకి ఎలాంటి సలహాలు ఎవరు ఇస్తున్నారో కానీ.. థర్డ్ డిగ్రీ భయంతోనే ఆర్జీవీ పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు నిరాకిరస్తున్నారు.