Stock Market News Updates Today 25 Nov: శనివారం, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో  మహాయుతి అద్భుత విజయం సాధించడంతో ఈ రోజు (సోమవారం, 25 నవంబర్‌ 2024) దేశీయ స్టాక్‌మార్కెట్‌లో మహా ఉత్సాహం నెలకొంది. BSE సెన్సెక్స్ దాదాపు 1300 పాయింట్లు పెరిగి ఇంట్రాడేలో గరిష్టంగా 80,452 స్థాయికి చేరింది. NSE నిఫ్టీ 400 పాయింట్లు జంప్‌ చేసి 24,330 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.


ఈ రోజు మార్కెట్ ఇలా ప్రారంభమైంది..


గత సెషన్‌లో (శుక్రవారం) 79,117 దగ్గర క్లోజ్‌ అయిన BSE సెన్సెక్స్‌, ఈ రోజు 1076.36 పాయింట్లు లేదా 1.36 శాతం పెరిగి 80,193 దగ్గర (BSE Sensex Opening Today) ఓపెన్‌ అయింది. శుక్రవారం 23,907 దగ్గర ఆగిన NSE నిఫ్టీ, ఈ రోజు 346.30 పాయింట్లు లేదా 1.45 శాతం జంప్‌తో 24,253.55 వద్ద (NSE Nifty Opening Today) ప్రారంభమైంది. 


ప్రధాన సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీతో పాటు సెక్టోరియల్‌ ఇండెక్స్‌ బ్యాంక్ నిఫ్టీ కూడా పూర్తి పచ్చదనంతో ట్రేడవుతోంది. బ్యాంక్, ఐటీ సహా దాదాపు అన్ని రంగాలలో బూమ్‌లో ఉన్నాయి. PSU బ్యాంక్‌ ఇండెక్స్‌ గరిష్టంగా 3.50 శాతం పెరిగింది. ఆయిల్‌ అండ్‌ గ్యాస్ సూచీ 3.15 శాతం బలంగా ఉంది. రియాల్టీ ఇండెక్స్‌ 2.81 శాతం లాభపడింది. నిఫ్టీలోని అన్ని రంగాల సూచీలు హైరేంజ్‌లో ట్రేడవుతున్నాయి.


స్టాక్ మార్కెట్‌లో బ్యాంక్ నిఫ్టీ మార్కెట్ హీరో అవుతుంది
బ్యాంక్ నిఫ్టీ ఈ రోజు విపరీతమైన ఊపుతో ట్రేడింగ్ ప్రారంభించింది. ఓపెనింగ్‌ టైమ్‌లో 1027.55 పాయింట్లు లేదా 2.01 శాతం పెరుగుదలతో 52,162 స్థాయి వద్దకు చేరింది. బ్యాంక్ నిఫ్టీలోని మొత్తం 12 స్టాక్స్‌ లాభాల్లో ట్రేడవుతున్నాయి.


ఉదయం 9.30 సమయానికి...
మార్కెట్ ప్రారంభమైన 15 నిమిషాలకు, ఉదయం 9.30 గంటల సమయానికి, సెన్సెక్స్ 1280 పాయింట్లు లేదా 1.62 శాతం జంప్‌తో 80,397 వద్దకు చేరుకుంది. అదే సమయానికి నిఫ్టీ 409.35 పాయింట్లు లేదా 1.71 శాతం లాభంతో 24,316 వద్ద ట్రేడవుతోంది.


సెన్సెక్స్ షేర్ల పరిస్థితి
సెన్సెక్స్ 30 స్టాక్స్‌లో 28 షేర్లు అప్‌ట్రెండ్‌లో ఆధిపత్యం కనబరుస్తుంటే, కేవలం 2 స్టాక్‌లు మాత్రమే క్షీణతలో ఉన్నాయి. ఎల్ అండ్ టీ, ఎం అండ్ ఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు అత్యధికంగా లాభపడ్డాయి. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు డౌన్‌సైడ్‌లో కొనసాగుతున్నాయి. 


బీఎస్ఈ మార్కెట్ క్యాప్
బీఎస్ఈలో నమోదైన అన్ని కంపెనీల ఉమ్మడి మార్కెట్ విలువ  (market capitalization of indian stock market) రూ. 440 లక్షల కోట్లు దాటింది. ఉదయం 9.30 సమయానికి, దీనిలో 3351 షేర్లు ట్రేడ్ అవుతున్నాయి. వాటిలో 2,853 షేర్లు గ్రీన్‌ జోన్‌లో, 444 షేర్లు రెడ్‌ జోన్‌లో ఉన్నాయి. 104 షేర్లలో ఎలాంటి మార్పు లేదు.


ఉదయం 10.50 గంటలకు, BSE సెన్సెక్స్ 1,238.49 పాయింట్లు లేదా 1.57% పెరిగి 80,355.60 వద్ద ట్రేడవుతోంది. అదే సమయానికి NSE నిఫ్టీ 403.35 పాయింట్లు లేదా 1.69% పెరిగి 24,310.60 దగ్గర ట్రేడవుతోంది.


Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్‌ ఫండ్లు, స్టాక్‌ మార్కెట్‌, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్‌, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్‌ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్‌ ఫండ్‌, స్టాక్‌, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.


మరో ఆసక్తికర కథనం: ఏకంగా రూ.1000 తగ్గిన పసిడి - ఏపీ, తెలంగాణలో ఈ రోజు బంగారం, వెండి ధరలు ఇవీ