Ram Gopal Varma News: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ(Ram Gopal Varma)ను సోషల్ మీడియా పోస్టులు వెంటాడుతున్నాయి. వ్యూహాం(Vyuham) సినిమాలు తీసేటెప్పుడు చేసిన కామెంట్స్ ఇప్పుడు ఆయన్ని ఇరకాటంలో పెట్టాయి. ఒంగోలులో రామ్‌గోపాల్‌ వర్మపై నమోదు అయిన కేసులో ఇప్పటికే రెండుసార్లు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రెండుసార్లు కూడా విచారణకు ఆర్జీవీ డుమ్మాకొట్టారు. దీంతో నేరుగా ఇంటిలోనే విచారణ చేసేందుకు ఒంగోలు పోలీసులు ఆయన ఇంటికి వెళ్లారు. 


డెన్‌లో విచారిస్తారా అరెస్టు చేస్తారా?


హైదరాబాద్‌లో ఉన్న ఆర్జీవీ ఇంటికి ఒంగోలు పోలీసులు వెళ్లారు. ఆయన్ని విచారించాలని చూస్తున్నారు. విచారణకు సహకరించకుంటే అదుపులోకి తీసుకోవాలని కూడా చూస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు విచారణకు హాజరుకానందు వల్ల ఆయన్ని అదుపులోకి తీసుకొని విచారించే అవకాశాలు లేకపోలేదని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 


వెంటాడుతున్న నాటి పోస్టులు 


వ్యూహం సినిమా తీసిన రామ్‌గోపాల్ వర్క.... ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా టీడీపీ అధినతే చంద్రబాబు, జనసేన చీఫ్‌ పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై ప్రకాశం జిల్లా మద్దిపాడు మండల టీడీపీ లీడర్‌ రామలింగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఒంగోలు రూరల్ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. దీనిపై విచారణకు హాజరుకావాలని పోలీసులు రెండుసార్లు నోటీసులు ఇచ్చారు. రెండు రోజులు కూడా ఆయన హాజరుకాకుండా వేర్వేరు కారణాలు చెప్పారు. 



 హైకోర్టులో లభించని ఊరట  


ఈ కేసుల్లో రక్షణ కల్పించాలని ఆయన కోర్టును కూడా ఆశ్రయించారు. కానీ అక్కడ ఎలాంటి ఊరట లభించలేదు. దీంతో పై కోర్టుకు వెళ్లేందుకు యత్నిస్తున్నట్టు సమాచారం. అయితే ఇంతలో రామ్‌గోపాల్‌ వర్మ ఇచ్చిన నాలుగు రోజుల గడువు ముగియడంతో పోలీసులు ఆయన ఇంటిని చుట్టుముట్టారు. నేడు విచారణ చేయడమా లేకుంటే అరెస్టు చేయడమా అనేది తేల్చనున్నారు. 


Also Read: తన గొయ్యి తానే తీసుకున్న జగన్‌- బొచ్చుపీకలేమన్నాడు, 11 వెంట్రుకలు మిగిల్చాం: మంత్రి సుభాష్‌


నిన్నటితో ముగిసిన గడువు 


ఆర్జీవీని అరెస్టు చేస్తారా లేదంటే అక్కడే ప్రశ్నిస్తారా అనేది మాత్రం తెలియడం లేదు. భారీగా పోలీసులు ఆర్జీవీ డెన్‌ను చుట్టుముట్టడంతో అరెస్టు ఖాయమనే వార్తలు గుప్పుమంటున్నాయి. పోలీసులు వెళ్లే సమయానికి ఆర్జీవీ ఇంట్లో లేరని చెబుతున్నారు. సిబ్బంది మాత్రమే ఉన్నారి అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో మాత్రం బయటకు రావడం లేదు. 


డిజిటల్ విచారణకు సిద్ధమే: ఆర్జీవీ అడ్వకేట్‌


పోలీసులు ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చామని ఆర్జీవీ అడ్వకేట్ అంటున్నారు. షూటింగ్స్‌లో బిజిగా ఉన్నందున పోలీసులకు మరికొంత సమయం అడిగామని తెలిపారు. లేదంటా డిజిటల్ విచారణకు హాజరు అయ్యేందుకు సిద్ధమని కూడా చెప్పినట్టు పేర్కొన్నారు. మరోవైపు ముందస్తు బెయిల్, కేసుల క్వాష్ పిటిషన్‌లు న్యాయస్థానాల్లో విచారణలో ఉన్నాయని వివరించారు. ఇంతలో పోలీసులు నేరుగా ఇంటికి రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. 


Also Read: 'జనసేన నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు' - టెక్కలి పోలీసులను ఆశ్రయించిన దివ్వెల మాధురి