AP Minister Vasamsetti Subhash: ఏపీ అంటే అమరావతి, పోలవరం అని.. పోలవరాన్ని 2027 నాటికల్లా పూర్తిచేయాలని దృడ సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. అసలు చిత్తశుద్ధి లేని పార్టీ వైఎస్సాఆర్‌సీపీ అని,  2014-19 లో  74 శాతం  పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడం జరిగిందని, అయితే వైసీసీ పాలనలో గడచిన అయిదేళ్ల కాలంలో పోలవరం ప్రాజెక్టు పూర్తిగా నాశనమయ్యిందన్నారు.  అయిదేళ్ల కాలంలో 3.8శాతం చేయించారు.. ఏ పని చేయకపోగా డయాఫ్రం వాల్‌ను పూర్తిగా నాశనం చేశారన్నారు. అది పుణర్మించాలంటే సుమారు రూ.1000 కోట్లు అవుతుందని, పోలవరం మీద వాళ్లు ఎలా మాట్లాడగలుగుతారన్నారు.  


అమరావతిపైనా కూడా వాళ్లకు మాట్లాడే అర్హత లేదన్నారు. రాష్ట్రానికి రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితుల్లో గడచిన అయిదేళ్లు బ్రతికామన్నారు. కూటమి ప్రభుత్వంలో చిత్తశుద్ధితో అమరావతి అభివృద్ధి జరుగుతుందన్నారు. 2014`19లో పూర్తి చిత్తశుద్ధితో అమరావతిని తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసిందన్నారు. ఇప్పుడు కూడా సుమారు రూప.15 వేల కోట్లుతో కేంద్రం ఆమోదింపచేసేలా చేసి శరవేగంతో ముందుకు వెళ్లడం చూస్తున్నారన్నారు..


 బొచ్చుపీకలేమన్నాడు.. 11 వెంట్రుకలు మిగిల్చారు..


అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్‌ రెడ్డి ఎప్పుడూ తన వెంట్రుకలు పీకలేరని,  బొచ్చుపీకలేరని అంటూ వచ్చారని, ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అన్ని వెంట్రుకలు పీకి కేవలం 11 ఎంట్రుకలు మిగిల్చారని మంత్రి సుభాష్‌ ఎద్దేవా చేశారు. కనీసం అసెబ్లీకు రావడానికి కూడా జడిసే పరిస్థితిని జగన్‌ చూస్తున్నారని, ప్రతిపక్షం అనేది ప్రజలు ఇస్తారని, 11 సీట్లు ఇచ్చినప్పుడే ఆయన పూర్తిగా వైఫల్యం అయ్యారని, గత ప్రభుత్వంలో 23 సీట్లు వచ్చాయని, అయిదుగురు ఆరుగురిని తీసివేస్తే ప్రతిపక్షహోదా పోతుందని అంటూ వచ్చారని, ఆదిశగా కూడా ప్రయత్నించారన్నారు. కుట్రలు, కుతంత్రాలు చేసి ఈరోజు ప్రతిపక్ష హోదా కోసం పోకిరీ సినిమాలోలాగా బాబ్బాబు బాబ్బాబు అంటూ బ్రతిమాలుతున్నాడన్నారు. ప్రతిపక్ష హోదా అనే సాకుతో అసెంబ్లీకు రావడం లేదన్నారు. ఇక వైసీపీ గురించి మాట్లాడుకోవడం వృధా అన్నారు.



విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు...


ఏపీను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజనరీ ఉన్న నాయకుడని, ఆయన పూర్తిగా ఆర్ధీకాభివృద్ధిపైనే దృష్టిశారించారన్నారు. స్మాల్‌స్కేల్‌ ఇండస్ట్రీలను ప్రోత్సహించే విధంగా నిరుద్యోగ సమస్య కేవలం ఉద్యోగాల ద్వారానే కాకుండా తెలివైన వారి ద్వారా  చిన్నతరహా పరిశ్రమలు పెట్టించాలని ఆయన ఆకాంక్షస్తున్నారన్నారు. రాష్ట్రంలో సుమారు 84 వేల కోట్లు రూపాయల పెట్టుబడులను ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారని మంత్రి సుభాష్‌ తెలిపారు. 


వైసీపీ ప్రభుత్వం అంతా అవినీతిమయం..


వైసీపీ ప్రభుత్వ హాయంలో అంతా కూడా అవినీతి మయం వేళ్లూనుకుందని మంత్రి సుభాష్‌ తెలిపారు. ఉదాహరణకు కార్మికశాఖలో నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో 2022`23 సంవత్సరానికి గాను 42 మెడికల్‌ క్యాంపులు పెట్టారు.. ఒక పేటపై అంత ప్రేమ ఏంటో అర్ధం కావడం లేదన్నారు. అన్ని రకాల మెడిసిన్‌ ఇచ్చినట్లు రికార్డుల్లో చూపించారన్నారు. బీమా విషయంలోనూ చినిపోయిన కార్యకర్తల మీద చిల్లర ఏరుకున్నారని ఆరోపించారు. సుమారు 3053 మంది బీమా దరఖాస్తు చేయగా 955 మందికి ఇచ్చారని, మిగిలిన వారంతా అడ్రస్‌ నాట్‌ఫౌండ్‌ అని వచ్చిందని, తప్పుడు నివేదికలుఇచ్చి సుమారు 113 కోట్లు కు వారికి నచ్చిన మూడు ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రీమియంలు అప్పగించారన్నారు. 3053 మందికి రూ. 178 కోట్లు ఇవ్వాల్సి వస్తే వారు ఇచ్చింది కేవలం 43 కోట్లు ఇచ్చారని తెలిపారు. అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చన్నారు.  


త్వరలోనే మాజీ మంత్రిని లోపలేస్తారు..


వైసీపీ ప్రభుత్వంలో అంతా అవినీతి మయమేనని, అగ్రిగోల్డ్‌ భూములకోసం పెద్ద కబుర్లు చెప్పిన మాజీ మంత్రి జోగి రమేష్‌ అగ్రిగోల్డ్‌ భూములే దోచేశాడని ఆరోపించారు.. అవినీతికి పాల్పడిన ఏ ఒక్క నాయకుడిని వదలబోమని మంత్రి సుభాష్‌ తెలిపారు. అతి త్వరలోనే అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి లోనకు వెళ్లనున్నాడని వెల్ల‌డించారు.


స్పీకర్‌ను క్షమాపణ కోరా...


అసెంబ్లీకు ఆలస్యంగా వస్తున్నారని స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ వివరణ ఇచ్చారు.. అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు చెప్పాల్సిన సమాధానానికి సంబందించి సమాచారం కోసం మూడు నిమిషాల అలస్యం అయ్యిందని, దీనికి స్పీకర్‌కు క్షమాపణ చెప్పడం జరిగిందని, అయితే నేను కొత్తకాబట్టి సరిదిద్దుకుంటాని స్పీకర్‌కు చెప్పానని మంత్రి తెలిపారు. 


సీఐ తప్పుడు మాట్లాడాడు.. అందుకే వీఆర్‌లోకి..
బాద్యతాయుతమైన పోలీసుశాఖలో ఉద్యోగంలో ఉండి ఓ కులం గురించి గొప్పగా మాట్లాడడం మంచిది కాదని, అన్ని కులాలను, మతాలను ఒకేలా చూడాలని అయితే రామచంద్రపురం సీఐ వేదికపై నుంచి ఒక కులం గురించి మాట్లాడడం సరికాదన్నారు. పోలీసు శాఖలో ఉన్న పరిమితులను మించి మాట్లాడినందుకే వీఆర్‌లోకి పంపారన్నారు. ఎవరి నియోజకవర్గాల్లో వారు అధికారులను నియమించుకోవడం జరిగిందని, అయితే వారి ప్రవర్తనను బట్టి కొనసాగడం లేదా అన్నది ఆధారపడి ఉంటుందన్నారు. సీఐ తప్పుగా మాట్లాడాడు కాబట్టి వీఆర్‌లోకి పంపించడం జరిగిందన్నారు.


Also Read: Road Accident: అనంతపురం రోడ్డు ప్రమాదంలో 8కి చేరిన మృతుల సంఖ్య, అక్కడ అధిక ప్రమాదాలకు కారణాలు ఇవే


చేసిన అవినీతి బట్టి జైలుకు వెళ్తారు..


జగన్‌ను జైలుకు పంపాలన్న ఆలోచన కూటమి ప్రభుత్వానికి లేదని, వారు చేసిన అవినీతిని బట్టే వెళ్తారాన్నరు. చేసిన పనులే జగన్‌కు మెడకు చుట్టుకుంటాయని అంతే కానీ ఓ చట్రం వేసి ఆ చట్రంలో ఇరికించింది కాదన్నారు మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.. జగన్మోహన్‌ రెడ్డి రాజకీయంగా పెద్ద గొయ్యితీసుకుని దాంట్లోకి దూకారని  వైసీపీది పూర్తిగా సూసైడ్‌ వంటిదేనన్నారు. పాలన అనేది ఒక మీట నొక్కితే చాలు అనేలా నవరత్నాలు అనే మానసిక పుత్రిక ద్వారా దేశనాయకుడు కావాలని చూశాడన్నారు. ఎస్సీ, బీసీలకు కార్పోరేషన్లు తీసేశాడని, ఎస్సీ సబ్‌ప్లాన్‌లు, బీసీ సబ్‌ప్లానులు తీసేశాడని, ఆర్దీకంగా వెనుకబాటులో ఉన్న వారిని జీవితాలను మార్చేవిధంగా చేశాడని అందుకే సరైన గుణపాఠం నేర్పారన్నారు. అదేవిధంగా కార్మికశాఖలో భవన నిర్మాణ కార్మికులకు సంబందించి 1214 జీవో తెచ్చి పథకాలన్నీ నిలిపివేశారని, ఇలా అంతా తన్నితేనే 11 సీట్లకు పరిమితమయ్యారని మంత్రి అన్నారు..


అంబేడ్కర్‌ వల్లనే ఇంతటివాడినయ్యా...


అంబేడ్కర్‌ ప్రసాదించిన రాజ్యాంగం వల్లనే తాను ఈ స్థాయిలోఉన్నానని, అయితే అంబేడ్కర్‌ను ఏమాత్రం విస్మరించేవాడిని కానన్నారు. శెట్టిబలిజ వనసమారాధన కార్యక్రమ పాంప్లెట్‌లో అంబేడ్కర్‌ పేరు లేకుండా కోనసీమజిల్లా అని పెట్టారన్న విమర్శలపై ఆయన సమాధానమిచ్చారు. కమిటీ ద్వారా వేసిన పాంప్లెట్‌లో అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా అని ఉందన్నారు. మేము అన్నం తీనేవాళ్లమేనని, అమ్మపాలు తాగు రొమ్ము గుద్దేవారుము కాదని, అన్ని వర్గాలను, కులాలను గౌరవిస్తూ ముందుకు సాగుతామన్నారు.