Pawan Kalyan gives Rs 1 lakh cheque to Farmer Mallikharjuna Raos Wife at Janampeta: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జనసేన పార్టీ కౌలు రైతు భరోసా యాత్ర శనివారం ఉదయం ప్రారంభమైంది. జనసేన రెండో విడత రైతు భరోసా యాత్రలో భాగంగా దెందులూరు నియోజకవర్గం జానంపేట గ్రామంలో పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కౌలు రైతు నెరుసు మల్లికార్జునరావు కుటుంబాన్ని పరామర్శించారు. సాగు నష్టాలు, ఆర్థిక ఇబ్బందులతో  మల్లికార్జునరావు ఆత్మహత్య చేసుకోగా, ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ తొలి చెక్కు అందచేశారు. 


నేడు మొత్తం 40 రైతు కుటుంబాలకు ఆర్థికసాయం.. 
మల్లికార్జున రావు  భార్య శివదుర్గను ఓదార్చిన పవన్ కళ్యాణ్... జనసేన పార్టీ తరఫున లక్ష రూపాయల ఆర్ధిక సాయం అందించారు. ఈ సాయంతోపాటు ఇద్దరు ఆడ బిడ్డల భవిష్యత్తుకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నేడు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 40 మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పరామర్శించనున్నారు. ఆ రైతుల కుటుంబానికి లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందచేస్తారు. జనసేన రెండో విడత కౌలు రైతు భరోసా యాత్ర (JanaSena Rythu Bharosa Yatra) కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు నాగబాబు, జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పార్టీ నాయకులు ఘంటసాల వెంకట లక్ష్మీ, బొమ్మిడి నాయకర్ తదితరులు పాల్గొన్నారు.






జనసేనానికి ఘన స్వాగతం.. 
అంతకుముందు పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా హైదరాబాద్ నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గన్నవరం  విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన పశ్చిమ గోదావరి జిల్లాకు చేరుకోగా.. పవన్ కళ్యాణ్‌కు పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏలూరు శివారులో ఉన్న కలపర్రు టోల్ గేట్ వద్దకు వేల సంఖ్యలో తరలివచ్చిన జనసైనికులు, అభిమానులు జయ జయ ధ్వానాల నడుమ భారీ గజమాలతో పవన్ కళ్యాణ్‌ను సత్కరించారు.






Also Read: Jagan Vijayasai Reddy: సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డికి గ్యాప్ నిజమేనా? వైఎస్సార్‌సీపీ అధినేతకు ఆ ముగ్గురే ముఖ్యమా!


Also Read: Pawan Kalyan : పోలీసులను రాజకీయ కక్షలకు కాకుండా ప్రజా రక్షణకు వినియోగించండి, విజయవాడ ఘటనపై స్పందించిన పవన్ కల్యాణ్