నెల్లూరు జిల్లా సంగం వద్ద బీరాపేరు వాగులో గల్లంతయినవారి కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. గురువారం రాత్రి ప్రమాదం జరగ్గా అందులో ఐదుగురు గల్లంతయ్యారు. వారిలో ఒకరి మృతదేహాన్ని శనివారం ఉదయం వెలికి తీశారు.
తొలుత ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు.. గజ ఈతగాళ్ల సాయంతో శుక్రవారం మొత్తం ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు శుక్రవారం సాయంత్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. శనివారం ఉదయం కూడా ఆపరేషన్ కొనసాగించారు. ఈ క్రమంలో ఒక మృతదేహాన్ని కనుగొన్నారు. కర్రా పుల్లయ్య డెడ్ బాడీగా గుర్తించారు. వాగు లోతట్టు ప్రాంతం లోని చెట్ల లో ఇరుక్కుని ఉండగా మృతదేహాన్ని ఎన్డీఆర్ఎఫ్ టీమ్ బయటకు తెచ్చింది.
గురువారం రాత్రి నెల్లూరు జిల్లా సంగం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటో వాగులో పడింది. ఏడుగురిని స్థానికులు కాపాడారు. వారిలో ఓ చిన్నారి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది. 5 మంది ప్రయాణికులు వాగులో కొట్టుకుపోయారు. వారి కోసం విస్తృతంగా గాలించారు. ఆటోలో ఉన్న వారు ఆత్మకూరు నుంచి సంగం శివాలయంలో నిద్రచేయడానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
గల్లంతైన ఐదుగురి కోసం రెండురోజులుగా తీవ్రంగా గాలించారు. ఎన్డీఆర్ఎఫ్ రంగంలోకి దిగిన తర్వాత అతి కష్టమ్మీద ఓ మృతదేహాన్ని గుర్తించారు. ఇంకా నాలుగు మృతదేహాల కోసం గాలిస్తున్నారు.
Also Read: జగన్ హామీ నెరవేరలేదు.. పైగా జైలు పాలయింది..! టీటీడీ పారిశుద్ధ్య కార్మికులు రాధ దీన స్థితి...
Also Read: కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !
Also Read: ‘కిమ్’ కర్తవ్యం?.. ఉత్తర కొరియా నియంత భార్యకు ఇన్ని రూల్సా? పిల్లలను కనే విషయంలోనూ..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి