తిరుమలలో పని చేస్తున్న ఎఫ్.ఎం.ఎస్ కార్మికులు రాధ సహా  మిగతా కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ప్రత్యేకంగా రాధ పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే వరద ప్రాంతాల పరిశీలనకు సీఎం జగన్ తిరుపతికి వెళ్లినప్పుడు ఆమెను పిలిపించుకుని మాట్లాడారు. తల మీద చేయి పెట్టి 24 గంటల్లో సమస్య పరిష్కారం అవుతుందని హామీ ఇచ్చారు. అయితే 24 గంటల్లో సమస్య పరిష్కారం కాకపోగా వారంలో ఆమెను.. మిగతా కార్మికుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఆమె సీఎం జగన్‌ను శాపనార్థాలు పెట్టారు. చెల్లెమ్మా అంటూ గొంతు కోశారని కన్నీరు పెట్టుకున్నారు.


Also Read : ఆర్సీ ప్రకటించినా ఉద్యమం ఆగదు... సీపీఎస్ రద్దు చేయకుండా ప్రత్యామ్నాయాలు వద్దు...


24 గంటల్లో సమస్య పరిష్కరిస్తామన్న సీఎం జగన్ - వారంలో అరెస్ట్ చేసిన పోలీసులు!


ప్రపంచంలో అతిపెద్ద ఆధ్యాత్మిక క్షేత్రంమైన టీటీడీ దశాబ్దాలుగా రెగ్యులర్ ఉద్యోగస్తులతో పాటు కాంట్రాక్టు ఉద్యోగస్తులు విధులు నిర్వర్తిస్తున్నారు.. రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగులే కాకుండా టిటిడి అవుట్ సోర్సింగ్ సంస్థల ద్వారా వేలాది మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.. ఇలా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ప్రధానంగా పారిశుద్ధ్య కార్మికులు తమ సేవలను ఎన్నో ఏళ్లుగా భక్తులకు సేవలందిస్తూ వస్తున్నారు. ఇప్పటిదాకా మూడు అవుట్ సోర్సింగ్ సంస్థలు టీటీడీకి నిర్ణీతకాలం ఒప్పందం మేరకు హ్యూమన్ రిసోర్స్ అందిస్తున్నాయి. అయితే 2019 సంవత్సరంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. అప్పటి దాకా టీటీడీలో అవుట్ సోర్సింగ్ ద్వారా సేవలందిస్తున్న మూడు ప్రైవేటు సంస్థలలో రెండు సంస్థల ఒప్పందం టీటీడీ పొడిగించలేదు. దీంతో వాటిలోని కార్మికులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. దీంతో వారు ఆందోళనబాట పట్టారు. వారినే ఎఫ్.ఎం.ఎస్ కార్మికులంటున్నారు. వారిలో ఒకరే రాధ.


Also Read:  ఇక కొత్త లేఅవుట్లు వేస్తే 5% స్థలం ఇవ్వాల్సిందే.. లేదా ఇలా చేయొచ్చు, ప్రభుత్వం సంచలన నిర్ణయం


పాదయాత్రలో ఇచ్చిన హామీలే అమలు చేయాలని కోరుతున్న పారిశుద్ధ్య కార్మికులు !


2018 సంవత్సరంలో ప్రతిపక్ష నేత హోదాలో తిరుపతికి వచ్చిన ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులను తాము అధికారంలోకి రాగానే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీని నమ్మి రాధ అనే కార్మికురాలు తన చేతిపై జగన్ బొమ్మను పచ్చ బొట్టు వేయించుకున్నారు. జగన్ సీఎం అయ్యే వరకూ కాళ్లకు చెప్పులేసుకోనని ప్రతిజ్ఞ చేశారు. సీఎం అయిన తర్వాతే వేసుకున్నారు.  సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్న తర్వాత తమ ఉద్యోగాలురెగ్యులరైజ్ చేస్తారని ఎదురు చూస్తున్నారు. అయితే ఆమెతో పాటు ఇతర కార్మికులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వారిని అసలు తొలగించాలని నిర్ణయించింది. 


Also Read:  కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం


సీఎం జగన్‌పై తీవ్ర విమర్శలు చేసిన పారిశుద్ధ్య కార్మికురాలు రాధ !


టీటీడీ అవుట్ సోర్సింగ్ కార్మికులు ఉద్యమ బాట పట్టారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనం ముందు దీక్షలు కొనసాగిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీ ప్రకారం తమను రెగ్యులర్ చేయాలని టైం స్కేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు కార్మికులు.  సీఎం జగన్ కార్మికురాలు రాధకి చేసిన ప్రమాణం నేరవేర్చలేదు.  టిటిడి‌ కాంట్రాక్టు కార్మికులు మాత్రం తమ ప్రాణాలు అర్పిస్తామే కానీ విధులు వెళ్ళేది‌ లేదని మొండిగా దీక్ష చేస్తున్నారు. కార్మికులు రాలేని యడల టిటిడి ఆరోగ్య విభాగం నూతన కార్మికులను ద్వారా టిటిడిలో‌ పారిశుధ్య పనులు నిర్వర్తించాలని అదనపు ఈవో హుకుం జారీ చేశారు. ఈ క్రమంలో వారిని అడ్డుకుంటారేమోనన్న ఉద్దేశంతో రాధ సహా అందర్నీ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆమె సీఎంపై తీవ్ర విమర్శలు చేయడం కలకలం రేపుతోంది. 


Also Read: మాస్క్ లేని వారిని రానిస్తే వ్యాపార సంస్థల మూసివేత..ఏపీ ప్రభుత్వ కొత్త కోవిడ్ రూల్స్ !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి