పేదలకు హఠాత్తుగా ఏదైనా ఆపద వస్తే ఆస్పత్రికి తీసుకెళ్లడానికి అంబులెన్స్‌లకే వేలకు వేలు పెట్టాలి. అదీ కూడా పేరుకే అంబులెన్స్ ఉంటుంది కానీ అందులో లైఫ్ సేవింగ్ ఏర్పాట్లేమీ ఉండవు. కానీ అంబులెన్స్ లోనే ఐసీయూ యూనిట్, వెంటిలేటర్, ఆక్సిజన్ సహా ఇతర అన్నిరకాల సదుపాయాలు.. ఒకరకంగా చెప్పాలంటే ఐసీయూ తరహా ఏర్పాట్లు ఉన్న అంబులెన్స్  లభించడమే కష్టం. కేవలం కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రమే భారీ ఖర్చుతో ఇలాంటివి సమకూరుస్తాయి. మెరుగైన వైద్యం కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించాలంటే అందరికీ అది సాధ్యమయ్యే పని కాదు. పేదలకు అసలు సాధ్యం కాదు. 


Also Read : ఏపీ ఉద్యోగసంఘాల మధ్య చీలిక.. ప్రభుత్వంపై నమ్మకం ఉందంటున్న కొన్ని సంఘాలు !


కానీ పేదలకు అలాంటి ఐసీయూ సౌకర్యాలు ఉన్న అంబులెన్స్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది రెడ్ క్రాస్ సంస్థ. నెల్లూరు జిల్లాలో ఈ అడ్వాన్స్ డ్ కార్డియాక్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ సేవలు అందుబాటులో ఉన్నాయి. కేవలం 500 రూపాయల  నామ మాత్రపు రుసుముతో ఈ సదుపాయాలు అందజేస్తున్నారు. నిరుపేదలయితే పేదవారికి మరింత రాయితీ ఇస్తామని నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి చెబుతున్నారు.


Also Read : 2024 తరవాత పొలిటికల్ రిటైర్మెంట్ .. సోము వీర్రాజు నిర్ణయం !


నెల్లూరు రెడ్ క్రాస్ సంస్థ లాక్ డౌన్ సమయంలో కూడా నిరుపేదలకు అండగా నిలబడింది. కరోనా వల్ల ఇబ్బందులు పడుతూ ఆస్పత్రుల్లో బెడ్స్ దొరక్క అవస్థలు పడిన రోగులకోసం గతంలో ఆక్సిజన్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది. మొబైల్ కొవిడ్ వార్డుల పేరుతో బస్సుల్లో ప్రతి సీటుకి ఒక ఆక్సిజన్ సిలిండర్ ని అమర్చి ఆస్పత్రుల వద్ద ఉంచారు. కొవిడ్ తో మరణించినవారి దహన సంస్కారాల కోసం కూడా క్రిమేషన్ వ్యాన్ ని ఏర్పాటు చేశారు. 


Also Read : కర్నూలులో వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ .. 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం !


ఇప్పుడు అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో రూపొందిన అత్యాధునిక అంబులెన్స్ సేవలను కూడా అందుబాటులోకి తెచ్చింది రెడ్ క్రాస్ సంస్థ. అంబులెన్స్ కావలసిన  వారు  9647108108, 9493676146, 8639310160 ఫోన్ నెంబర్లలో సంప్రదించాలని కోరారు రెడ్ క్రాస్  నిర్వాహకులు.  ప్రతి అంబులెన్స్ లో ఒక డ్రైవర్, టెక్నీషియన్ అందుబాటులో ఉంటారు. అంబులెన్స్ లోనే ప్రథమ చికిత్స చేస్తారు .  పేదలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకుని అత్యవసర పరిస్థితుల్లో సాయం పొందాలని రెడ్ క్రాస్ వారు విజ్ఞప్తి చేస్తున్నారు. 


Also Read : అమరావతి రైతుల భోజన ఏర్పాట్లు చేస్తున్న పొలం దున్నేసిన దండగులు ! వైఎస్‌ఆర్‌సీపీ నేతల పనేనని ఆరోపణలు !


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి