పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గెడ్డం శ్రీను అనే యువకుడి అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. ముమ్మాటికీ హత్యేనని ఈ విషయాన్ని కోర్టు కూడా ధృవీకరించి హత్యకేసుగా నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసిందని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. ఆ కేసు విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన డిఎస్పీ, ఎస్ఐలను సస్పెండ్ చేయడంతో పాటు సాక్ష్యాలు తారు మారు చేసేందుకు ప్రయత్నించిన వారిపై కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ ప్రకారం కేసులు పెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. 


Also Read: పీఆర్సీ జీవోలకు కేబినెట్ ఆమోదం... ఉద్యోగులను బుజ్జగించేందుకు కమిటీ... మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయాలు


మెడికల్ కళాశాల డీన్ మృతదేహాన్ని బయటికి తీసి రీ పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు. గెడ్డం శ్రీను రీ పోస్టుమార్టంతో పాటు కేసు పునర్విచారణకు సంబంధించిన అన్ని విషయాలను వీడియోగ్రఫీ కూడా తీయాలని హర్షకుమార్ కోరారు. గ్రామాల్లో పెత్తందారీ, పోలీసు వ్యవస్థలు కలిస్తే దళితులకు ఎంత నష్టం జరుగుతుందన్నది ఈ హత్య కేసు ద్వారా వెల్లడైందన్నారు. కోర్టు చెబితే తప్ప పోలీసులు సెక్షన్లు మార్చి ఆరుగురు నిందితులపై కేసులు నమోదు చేయడానికి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. 


Also Read: సమ్మెకు ఉద్యోగులుసై.. చర్చలకు రావాలంటున్న ప్రభుత్వం ! పీఆర్సీ వివాదం ఏ మలుపు తిరగనుంది ?


 కౌలు రైతులు కొమ్మరాజు ముత్యాలు, కొమ్మరాజు సత్యనారాయణ తాము కూలికి పిలిస్తే వెళ్లలేదన్న కారణంగా అతడిని ఇష్టమొచ్చినట్టుగా కొట్టి చంపేసి పురుగుల మందు తాగినట్టుగా పొలం గట్టున పడేశారని హర్షకుమార్ ఆరోపించారు. రిటైర్డ్ ఎఎస్ఐ అతడి శరీరంపై ఉన్న రక్తపు గాయాలను కడిగేసిన తరువాత పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొవ్వూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారని ఆరోపించారు. ఆత్మహత్య చేసుకుంటే శరీరంపై దుస్తులు లేకుండా ఉంటారా అని నిలదీశారు. దీనిపై ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేయడంతో పాటు కోర్టులో కేసు కూడా దాఖలైందని వివరించారు. 


Also Read:  ‘నిన్ను పెళ్లి చేసుకోను.. ఇంకొకరితో కానివ్వను.. కాదని చేసుకుంటే..’ హైదరాబాద్‌లో సైకో లవర్ హల్‌చల్


హైకోర్టు ఆదేశాలతో హత్య కేసుగా నమోదు చేశారని ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అనేక కేసులు మరుగున పడుతున్నాయన్నారు.కోర్టులు కల్పించుకుంటే తప్ప బాధితులకు న్యాయం జరిగే పరిస్థితి రాష్ట్రంలో లేదని విమర్శించారు. వ్యవస్థ, పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడే దళిత, బడుగు, బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రజలందరూ గ్రహించాలన్నారు. ఇసుక లారీలను రాత్రి సమయంలో గుట్టుచప్పుడు కాకుండా తరలించుకోవడానికి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 



ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి