ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సమావేశంలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. పీఆర్సీ జీవోలను వెనక్కి తగ్గేదే లే అని మంత్రి వర్గం నిర్ణయించింది. ఉద్యోగుల పీఆర్సీ జీవోలను ఆమోదించింది.  పదవీ విరమణ వయసు 62 ఏళ్లకు పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది. కరోనా కట్టడిపై సుదీర్ఘంగా చర్చించింది. ఒమిక్రాన్‌ కట్టడికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీ జీవోలు అమలు చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు, కరోనాతో మరణించిన ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  


Also Read: ఏపీ సర్కార్‌కు మరో ఝలక్.. ఇక ఆ ఉద్యోగులు కూడా రంగంలోకి.. ఈ నెల జీతాలు రానట్లే..!


ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ


ఉద్యోగులతో సంప్రదింపులకు కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్‌, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ సమీర్ శర్మలను కమిటీలో సభ్యులుగా నియమించింది.  ఉద్యోగులకు వాస్తవ పరిస్థితులు వివరించి, అపోహలు తొలగించేందుకు ఈ కమిటీని కేబినెట్ ఏర్పాటు చేసింది. 


Also Read: ఫిబ్రవరి 7 లేదా 8 నుంచి నిరవధిక సమ్మె.. ఏపీ ఉద్యోగ సంఘాల నిర్ణయం !


కిదాంబి శ్రీకాంత్ అకాడమీకి భూకేటాయింపు  


ఉద్యోగులకు 20 శాతం రిబేట్‌, పెన్షనర్లకు 5 శాతం ప్లాట్లు కేటాయింపునకు కేబినెట్ అంగీకరించింది. ఈబీసీ నేస్తం పథకానికి ఆమోదం తెలిపింది. అగ్రవర్ణాల పేద మహిళలకు రూ. 45 వేలు ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించింది.  ఏటా 15 వేలు చొప్పున 45 ఏళ్ల నుండి 60 ఏళ్ల మధ్య పేద మహిళలకు ఆర్థికసాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. వారానికి నాలుగు సర్వీసులు నడిచేలా ఇండిగో సంస్థతో ఒప్పందానికి మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ఏడాది పాటు ఈ ఒప్పందం అమలు చేసేందుకు రూ.20 కోట్లు చెల్లించేలా కేబినెట్ ఆమోదం తెలిపింది. మహిళా శిశు సంక్షేమ శాఖలో అమలు చేస్తున్న ఐసీడీఎస్ ప్రాజెక్టులో పౌష్టికాహారం బాలామృతం, పాలు సరఫరాను గుజరాత్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్‌కు అప్పగిస్తున్నట్లు కేబినెట్ ప్రకటించింది. జగనన్న స్మార్ట్‌ టౌన్‌ షిప్‌లలో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయింపునకు ఆమోదం తెలిపింది. కిదాంబి శ్రీకాంత్‌ స్పోర్ట్స్‌ అకాడమీకి తిరుపతిలో ఐదెకరాల భూమి, విశాఖలో అదాని డేటా సెంటర్‌కు భూ కేటాయింపు, వన్‌ డిస్ట్రిక్ట్‌-వన్‌ మెడికల్‌ కాలేజీ ప్రతిపాదనకు కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 


Also Read: మెప్పు కోసం విప్పుకొని తిరుగుతావా రాజా, ఏ1 చేతిలో తన్నులు తినకుండా చూస్కో..’ ట్విటర్‌లో వైసీపీ ఎంపీల రచ్చ


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి