50 ఏళ్లుగా నిత్యం వెలుగుతున్న అమర్‌ జవాన్‌ జ్యోతి ఇక కనబడదు. ఇండియా గేట్‌ వద్ద ఉన్న ఈ జ్యోతిలోని కొంత భాగాన్ని అక్కడికి 400 మీటర్ల దూరంలో ఉన్న 'జాతీయ యుద్ధ స్మారకం' వద్ద ఉండే జ్యోతితో కలిపివేయనున్నారు. ఈ రెండు జ్యోతులు నిత్యం వెలిగేలా చూడటం కష్టమవుతున్న నేపథ్యంలో వీటిని కలపాని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అమర్‌ జవాన్‌ జ్యోతిని ఆర్పివేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతమంది.. దేశ భక్తి, త్యాగనిరతిని ఎప్పటికీ అర్ధం చేసుకోలేరు. మన సైనికుల కోసం అమర్‌ జవాన్‌ జ్యోతిని మేం మళ్లీ వెలిగిస్తామని హమీ ఇచ్చారు.  


 






Also Read: యూపీ ఎన్నికల్లో విక్రమార్కుడు.. 74 ఏళ్లలో 94వ సారి పోటీ.. సెంచరీ కొట్టే వరకు తగ్గేదేలే!


అమర్‌ జవాన్‌ జ్యోతిని ఆర్పివేస్తున్నారని ఎక్కువగా ప్రచారం జరగడంపై కేంద్ర ప్రభుత్వం స్పందించంది.ఆ జ్యోతిని ఆర్పేయడం లేదని, దాని జాతీయ యుద్ధ స్మారక చిహ్నంలో కలుపుతున్నామని .. అది ఆర్పివేయడం కాదని చెబుతోంది. 1971లో భారత్‌-పాక్‌ యుద్ధంలో అమరులైన భారతీయ సైనికుల జ్ఞాపకార్థం ఇండియా గేట్‌ వద్ద ఈ స్మారకాన్ని నిరించారు. 1972 జనవరి 26న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అమర్‌ జవాన్‌ జ్యోతిని వెలిగించారు. 


Also Read: Pramod Gupta Joins BJP: యూపీలో భాజపా దెబ్బకు దెబ్బ.. నిన్న కోడలు, నేడు తోడల్లుడు.. ఎస్పీకి వరుస షాక్‌లు!


ఆ తర్వాత దేశ రాజధానిలో రూ.176కోట్లతో 40 ఎకరాల్లో జాతీయ యుద్ధ స్మారకాన్ని నిర్మించారు. అక్కడ విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన 25,942 మంది సైనికుల పేర్లను సువర్ణాక్షరాలతో గ్రానైట్‌ ఫలకాలపై లిఖించారు. 2019 ఫిబ్రవరి 25న ప్రధాని మోడీ దీన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత నుంచి ఇండియా గేట్‌ వద్ద జరిగే అన్ని సైనిక కార్యక్రమాలను జాతీయ యుద్ధ స్మారకం వద్దకు మార్చారు. 


Also Read: UP Cong Candidate List: యూపీలో కాంగ్రెస్ 'మహిళా' అస్త్రం.. రెండో జాబితాలో 16 మందికి చోటు




జాతీయ యుద్ధ స్మారకం, అమర జవాన్ జ్యోతి రెండూ నాలుగు వందల మీటర్ల దూరంలోనే ఉంటాయి. ఈ కారణంగా అమర్ జవాన్ జ్యోతిని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఉండే జ్యోతిలో విలీనం చేయనున్నారు. వీలీనం అయినా ఆర్పివేయడం అయినా ...  ఇక అక్కడే ఒక్క జ్యోతిమాత్రమే ఉంటుంది. అమర జవాన్ జ్యోతి కనిపించదు. 






ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి