Margadarsi Case :  మార్గదర్శి చిట్ ఫండ్స్ లో  చిట్లు వేసి నష్టపోయానని అన్నపూర్ణదేవి అనే  మహిళ ఫిర్యాదు చేయడంతో సీఐడీ పోలీసులు కేసు నమోదు చేశారు. అన్నపూర్ణాదేవితో  పాటు సీఐడీ అధికారులు అమరావతిలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి వివరాలు చెప్పారు. 


మార్గదర్శి లో 8 ఏళ్లుగా చిట్ వేసి నష్టపోయా : అన్నపూర్ణదేవి
 
మార్గదర్శిలో ఎనిమిదేళ్లుగా చిట్‌లు వేసి వేధింపులు ఎదుర్కొన్నానని.. వారసత్వంగా సంక్రమించిన ఆస్తుల్ని సైతం అమ్మేసుకున్నానని..  మార్గదర్శిపై అన్నపూర్ణాదేవి అనే మహిళ ఫిర్యాదు చేశాు.  ఫ్రౌల్టీ ఫామ్‌ వ్యాపారం చేస్తూ సేవింగ్స్ కోసం మార్గదర్శిలో చిట్‌ వేశాను. మొదట్లో.. బాగానే ఇచ్చారని తెలిపారు.  తర్వాత ఒత్తిడి చేసి ఒక చిట్‌ నుంచి రెండు.. రెండు నుంచి నాలుగు.. నాలుగు నుంచి ఎనిమిది.. ఇలా 90 చిట్‌ల వేయించుకున్నారన్నారు. ఆ ఆర్థిక భారాన్నంతా తన మీద వేశారని ారోపించారు. వేసిన చిట్‌ డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు.  17 చిట్స్‌లో నన్ను డిఫాల్ట్‌ చేశారన్నారు. మాకు గ్యారంటీ ఇచ్చిన వారిని వేధించారన్నారు.  ఇన్ని చిట్‌లు వేస్తే.. మాకు చివరగా వచ్చింది రూ.210 మాత్రమేనన్నారు. అందుకే కేసు పెట్టానని ఆమె తెలిపారు. 


ఏపీలో కరెంట్ తీగలపై బట్టలారేస్తున్నారు, తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి వ్యంగ్యాస్త్రాలు


కేసు నమోదు చేసిన సీఐడీ అధికారులు


అన్నపూర్ణ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు  సీఐడీ ఏడీజీ మీడియాకు తెలిపారు. ఇలాంటి బాధితులు చాలా మంది ఉన్నారన్నారు.  మార్గదర్శి పెద్ద స్కాం అని, చాలా నిబంధనలు అతిక్రమించిందని తెలిపారు. మార్గదర్శి మోసాలపై ప్రజలకు నిజాలు తెలియాలని అన్నారు. కోట్ల రూపాయలు కట్టిన బాధితులకు మార్గదర్శి నుంచి వేలల్లో మాత్రమే ముట్టిందన్నారు.  మార్గదర్శి మోసాలపై ఐటీ, ఈడీలకు సమాచారమిచ్చామని ఏడీజీ సంజయ్‌ తెలిపారు. కోటికి పైగా చిట్స్‌ వేసిన బాధితులు 800 మందికి పైగా ఉన్నారని అన్నారు. మార్గదర్సిలో చిట్స్ కడుతున్నట్లు దాదాపు 3 వేల మందికి తెలియనే తెలియదు. వంద మంది ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌ను గుర్తించి విచారించాం. ఘోస్ట్ సబ్ స్క్రైబర్స్‌కు తెలియకుండా వారి ఆధార్, ఇతర వివరాలని మార్గదర్సి వాడుకుంటోంది. ఒక్కో కంపెనీ 20,30, 50 చిట్లు ఎలా వెయ్యగలిగిందని సీఐడీ సంజయ్ తెలిపారు. 


లగడపాటి రాజగోపాల్ కూడా రాజకీయాల్లోకి - ఈ సారి సీరియస్‌గానే ఆలోచిస్తున్నారా ?


అన్ని  రూల్స్ పాటిస్తున్నామని చెబుతూ  మోసాలు :  సీఐడీ              


అన్ని రూల్స్‌ పాటిస్తున్నామని చెబుతూ మోసం చేస్తున్నారని ఏడీజీ సంజయ్ ఆరోపించారు.  ఆక్షన్‌ జరపకుండా నెలలపాటు పొడిగిస్తున్నారని..   40 శాతం చిట్‌ గ్రూపుల్లో చందాదారులే లేరని ఆరోపించారు.  కంపెనీనే సొంతంగా చిట్స్‌ను తీసుకుంటుందన్నారు.  చెక్‌ ప్రిపేర్‌ అయినా లెడ్జర్‌లో వివరాలు పొందుపరచడం లేదు. చందాదారులను బెదిరిస్తూ చిట్‌ అమౌంట్‌ ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శఇంచారు.  గోస్ట్‌ సబ్‌ స్క్రైబర్స్‌ పేరుతో కంపెనీనే డబ్బులు తీసుకుంటుందని తెలిపారు.  కొందరు చిట్‌ వేయకున్నా వారి పేరుతో చిట్స్‌ నడుస్తున్నాయని సంజయ్ తెలిపారు.    సీఐడీ విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.