Breaking News Live Telugu Updates:వెలిగొండ వ్యర్థాలపై రగడ- ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ అక్రమాలకు తెర తీస్తోందని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళి లెటర్ రాశారు. వెలుగొండ సొరంగం తవ్వకం మట్టిని శ్రీశైలంలోకి తరలించడంపై ఫిర్యాదు చేశారు. ఆ ప్రక్రియను ఆపాలని తన ఫిర్యాదులో మురళి పేర్కొన్నారు.
ప్రకాశం జిల్లా దొర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రెండో విడత పనుల్లో భాగంగా కార్మికులను సొరంగం లోపలికి పంపిస్తోంది. ఈ సొరంగం తవ్వేటప్పుడు వచ్చే వ్యర్థాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదానికి దారి తీస్తున్నాయి. సొరంగం తవ్వగా వచ్చే వ్యర్థాలను కొల్లంవాగు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డంప్ చేస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఆ వ్యర్థాలను రాత్రి వేళల్లో సైలెంట్‌గా లాంచీల్లో తీసుకెళ్లి నదిలో కలిపేస్తోందని తెలంగాణ చేస్తున్న ఆరోపణ.
ఇలాంటి చర్యల వల్లే శ్రీశైలం తన సామర్థ్యాన్ని కోల్పోతుందని వివరించింది తెలంగాణ. కొన్ని ఏళ్ల నుంచి శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం 308.6 టీఎంసీలు అయితే.. ఇప్పుడు అది 215 టీఎంసీలకు పడిపోయిందని లేఖలో పేరొంది. వ్యర్థాలు నదిలో కలిసిన కారణంగా సుమారు వందల టీఎంసీల వరకు నష్టపోతున్నామని తెలిపారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న చర్యలు కూడా శ్రీశైలం నిల్వ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ. అలాంటి పరిస్థితి రాకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని రిక్వస్ట్ చేసింది తెలంగాణ. సరైన గైడెన్స్ ఇచ్చి శ్రీశైలం జలాశయాన్ని కాపాడాలని కోరింది. నదిలో వ్యర్థాలను డంప్ చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేసింది.
డ్రైవర్ హత్య కేసులో అరెస్టైన వైసీపీ మాజీ లీడర్ అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ 9కి వాయిదా పడింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
- సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్
- నాతవరం మండలంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్
- నాతవరం మండలం పెద గొలుగొండ పేట గ్రామంలో ఆసరా పథకం మంజూరు చేయలేదని విన్నవించుకున్న మహిళలు
- ఎమ్మెల్యే తో విన్నవించుకునే సమయంలో MLAను ప్రశ్నించిన గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు
- దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే గణేష్
- మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై విమర్శలు
- ఈ దశలో ఘర్షణ వాతావరణం.. దీంతో జనాలను చెదరగొట్టిన పోలీసులు
Kothagudem: కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇది రహదారి పక్కనే పడిపోవడంతో ప్రజలు, స్థానికులు ఒక్కసారిగా గుమిగూడారు. చేపల లోడు మొత్తం కింద పడిపోవడంతో నిమిషాల్లో సరకు మొత్తాన్ని ఖాళీ చేశారు. కింద పడ్డ చేపలను ఎత్తుకుపోయారు.
- నాంపల్లి లో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటీ నాయకులు
- టీపీసీసీ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి అధ్వర్యంలో మెరుపు ముట్టడి
- మెట్టు సాయి కుమార్ తో పాటు నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
- గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలింపు
‘‘తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ గా మార్చారు. మద్యం వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగాయి. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం షాపులు పెరిగాయి. మైనర్ పిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. దీనివల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయి.’’ అని మెట్టు సాయి కుమార్, పీసీసీ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ అన్నారు.
- బాపట్లలో రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
- బాపట్ల అమ్మాయి, కర్లపాలెం మండలం చింతల పాలెం గ్రామం అబ్బాయి
- అమ్మాయిని ఖననం చేసిన బంధువులు
- అబ్బాయిని ఖననం చేయడానికి సిద్ధమైన మృతుడు తల్లిదండ్రులు
- మృతుడి ఇంటికి చేరుకున్న కర్లపాలెం పోలీసులు
- సంఘటన ప్రదేశమైన బాపట్ల రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుంటున్న రైల్వేపోలీసులు, బాపట్ల పట్టణ పోలీసులు
- ఎమ్మెల్యే రఘునందన్ రావు పై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు..
- రఘునందన్ పై ఫిర్యాదు చేసిన కారం కొమ్మిరెడ్డి
- మైనర్ బాలిక ఫోటోలు వీడియోలు రిలీజ్ చేయడంపై ఫిర్యాదు
- దర్యాప్తు జరుపుతున్న అబిడ్స్ పోలీసులు
- నిన్న రఘునందన్ పై సెంట్రల్ జోన్ డీసీపీకి ఫిర్యాదు చేసిన కొమ్మిరెడ్డి
- కోమిరెడ్డి ఫిర్యాదు మేరకు రఘునందన్ ను నిందితుడిగా చేర్చిన పోలీసులు
- రఘునందన్ పై 228(a) కింద కేస్ నమోదు చేసిన అబిడ్స్ పోలీసులు..
- ఇప్పటికే వీడియోలు వైరల్ చేసిన ఒక యువకుడ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం విఐపి విరామ సమయంలో ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ రామ్మోహన్ రావు, గజల్ శ్రీనివాస్ లు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసారు. ఆలయం వెలుపల ఎమ్మెల్సీ రామ్మోహన రావు మీడియాతో మాట్లాడుతూ.. జగన్ పాలన., అప్పుల భారం నుంచి రాష్ట్రానికి విముక్తి కలగాలని కోరుకున్నట్లు తెలిపారు. రోజుకో అత్యాచారం, హత్యలు జరుతున్నాయి.. వాటి నుంచి కూడా విముక్తి కలగాలని ప్రార్ధించానని అన్నారు..
సీఎం జగన్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ మంగళవారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి.. 10.40కల్లా గుంటూరు చుట్టుగుంట సెంటర్‌లోని సభావేదికకు చేరుకుంటారు. డాక్టర్ వైఎస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా అందజేసిన ట్రాక్టర్లను, హర్వెస్టర్లను జెండా ఊపి ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పల్నాడు జిల్లా కొండవీడుకు చేరుకుని జిందాల్ ప్లాంటు సమీపంలో ఏర్పాటు చేసిన ‘జగనన్న హరిత నగరాలు’ నమూనాను ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత జిందాల్ వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్ పైలాన్‌ను ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.05 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకుంటారు.
Background
ఏపీ ప్రజలకు శుభవార్త. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీర ప్రాంతాలన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో మరో మూడు రోజులు ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఏపీలో కోస్తాంధ్రలో 2 నుంచి 4 డిగ్రీల వరకు కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమలో వేడి గాలులు వీచడంతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నైరుతి రుతుపవనాల రాకతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి సైతం ఈ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు వడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వెదర్ మ్యాన్ సైతం హెచ్చరించారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఈ ప్రాంతాల్లో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా, మరోవైపు ఎండలు, ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు.
తెలంగాణలో వడగాల్పులు, వర్షాలు..
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉదయయం చల్లని గాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
- - - - - - - - - Advertisement - - - - - - - - -