MBBS student Dies in Philippines | హైదరాబాద్: విదేశాలలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన మరో తెలుగు విద్యార్థి చనిపోవడం కలకలం రేపుతోంది. ఫిలిప్పీన్స్ లో ఎంబీబీఎస్ చదువుకుంటున్న సంగారెడ్డి జిల్లాకు చెందిన చింత స్నిగ్ధ అమనునాస్పద స్థితిలో మృతిచెందారు. అయితే పుట్టినరోజు నాడే స్నిగ్ధ చనిపోవడంతో ఆమె మృతిపై కుటుంబసభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 


ఉన్నత చదువుల కోసం వెళ్తే పుట్టినరోజే విషాదం


సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు మండలంలోని ఇంద్రేశం గ్రామానికి చెందిన చింత స్నిగ్ధ ఫిలిప్పీన్స్‌లో ఎంబీబీఎస్ చేస్తున్నారు. మనీలాలోని పెర్ఫెక్చువల్ హెల్త్ యూనివర్సిటీలో మెడిసిన్ రెండో సంవత్సరం చదువుతున్నారు. ఆమె పుట్టినరోజున విష్ చేద్దామని ఫ్రెండ్స్ ఆమె గదికి వెళ్లారు. కానీ అప్పటికే స్నగ్ధ అనుమానాస్పద స్థిలో చనిపోయి కనిపించారు. తమ కూతురు చనిపోయిందని తెల్లవారు జామున 3 గంటల సమయంలో సమాచారం రావడంతో విద్యార్థిని స్నిగ్ధ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆమె తండ్రి చింత అమృతరావు మెదక్ పట్టణం విద్యుత్ శాఖలో డీఈగా విధులు నిర్వహిస్తున్నారు.


కాగా, ఉన్నత చదువుల కొరకు విదేశాలకు వెళ్లిన కుమార్తె ఆకస్మిక మరణాన్ని కుటుంబం జీర్ణించుకోలేకపోతోంది. అది కూడా పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాల్సిన కుమార్తె ఇక ప్రాణాలతో లేదని తెలియడంతో వాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు. కుమార్తె స్నిగ్ధ మృతదేహాన్ని స్వస్థలానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేయాలని ఫిలప్పీన్స్ అధికారులతో మాట్లాడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని అమృత్‌రావు కోరారు. 



Also Read: Hyderabad Crime News: ఓటర్ ఐడీ కోసం ప్రత్యేమైన యాప్‌- హైదరాబాద్‌లో నకిలీ సర్టిఫికేట్‌ తయారీ ముఠా అరెస్టు 


అంతలోనే ఎలా చనిపోయింది.. కన్నీళ్లు పెట్టిస్తున్న తల్లి మాటలు


స్నిగ్ధ చనిపోయిందని స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. వీడియో కాల్ చేసి స్నిగ్ధ డెడ్ బాడీ చూపించి విషయం చెప్పారు. రెండు రోజుల కిందట స్నిగ్ధ తనతో మాట్లాడిందని, కానీ అంతలోనే ఏం జరిగిందో తెలియదని తోటి విద్యార్థినులు చెప్పారు. రెస్టారెంట్ కు వెళ్లి తిన్నదా, మెస్ కు చివరిసారిగా ఎప్పుడు వెళ్లిందని బాధితురాలి తల్లి అడిగారు. ఇప్పుడు బయట ఉన్నాం, కనుక్కుని చెప్తామన్నారు. నిన్నటివరకూ బాగున్న పిల్ల అంతలోనే ఎందుకు ఉరి వేసుకుందని స్నిగ్ధ తల్లి వారిని వాకబు చేశారు. స్నిగ్ధ తల్లి ఒక్కసారి లేచి నాతో మాట్లాడూ తల్లీ.. నీకోసం మీ అమ్మ, నాన్న, తమ్ముడు ఉన్నారు. నీకు మేం తక్కువ చేశాం బేఠా. నువ్వు అడిగినవన్నీ నీకు ఇప్పించాం. నీకు ఏ సమస్య వచ్చిందో చెబితే మేం చూసుకునేవాళ్లం కదా. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నావు తల్లీ. మా జీవితం వ్యర్థం చేసి వెళ్లిపోయావు అంటూ కూతురి డెబ్ బాడీని చూసి విద్యార్థిని స్నిగ్ధ తల్లి ఆ వీడియో కాల్‌లో కన్నీటి పర్యంతమయ్యారు.


 నా బిడ్డను ఒంటరిని చేశారు. అక్కడ ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. నిన్ను ఇలా చూస్తామనుకోలేదమ్మా. మాకు నువ్వుంటే చాలమ్మా. నిన్ను ఈ స్థితిలో ఎలా చూడగలం. నువ్వు బాగా చదువుతావని ఎంతమంది నిన్ను మెచ్చుకునేవాళ్లు బిడ్డా. ఇప్పటివరకూ నిన్ను ఎంత ముద్దుగా కాపాడుతున్నాం తల్లీ. నీ నుంచి ఫోన్ రాకపోతే కంగారుపడేవాళ్లం. కానీ నేను చాలా మంచిగా ఉన్నానమ్మా. నువ్వు టెన్షన్ పడవద్దు అని చెబుతుండేదానివి అంటూ స్నిగ్ధ తల్లి కుమార్తె మృతదేహాన్ని చూస్తూ మాట్లాడిన వీడియో చూస్తే ఎవరికైనా కన్నీళ్లు ఆగవు.