Breaking News Live Telugu Updates: సీఎం అధ్యక్షతన ఏపీ కేబినెట్‌ భేటీ ప్రారంభం, ఆమోదం తెలిపే అంశాలివే

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 24 Jun 2022 05:14 PM
ఆర్‌జీవీ ట్వీట్

ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముపై ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ (ఆర్‌జీవీ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ ఫైర్ అయింది. రాష్ట్రపతి అభ్యర్థిపై ఆర్‌జీవీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించింది.


 

మోదీకి క్లీన్ చిట్

గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని నరేంద్ర మోదీ సహా 64 మందికి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది.

AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవీ..

  • వైద్యఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం

  • ఈనెల 27న అమ్మఒడి పథకానికి నిధులు విడుదల

  • మరో 4 సంక్షేమ పథకాలు పెట్టేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్

  • 35 సంస్థలకు భూకేటాయింపులకు ఏపీ కేబినెట్ ఆమోదం

Secunderabad Riots: ఆవుల సుబ్బారావు విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అల్లర్ల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. తన అనుచరులతో కలిసి విధ్వంసానికి సుబ్బారావు స్కెచ్ వేసినట్లుగా పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఆవుల సుబ్బారావు అనుచరులు శివ, మల్లారెడ్డి, రెడ్డప్ప, హరి అనే అనుచరులు ఈ అల్లర్లకు సాయపడ్డారు. నరేష్ అనే వ్యక్తి ఆందోళన కారులకు భోజనాలు అందేలా చూసుకున్నాడు. ఇతను ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. విద్యార్థులను రెచ్చగొట్టి ఉసిగొల్పేలా వాట్సప్ గ్రూపుల్లో ఆదేశాలు ఇచ్చినట్లు పోలీసు విచారణలో వెల్లడైంది. జూన్ 16నే సుబ్బారావు హైదరాబాద్‌కు చేరుకొని, తన అనుచరులతో మంతనాలు జరిపాడు. విధ్వంసానికి ప్లాన్ చేసినట్లుగా పోలీసులు తేల్చారు.

షిండే శిబిరంలోకి పెరుగుతున్న వలసలు 

మహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం పతనం అంచుకు చేరుకోగా, అటు షిండేక్యాంప్‌లో అంతకంతకూ బలం పెరుగుతోంది. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా ఆయన శిబిరంలోకి వెళ్లిపోతున్నారు. ఇటు శివసేన మాత్రం తమను తాము మహాశక్తిగా అభివర్ణిస్తూ ఎదురు దాడికి దిగుతున్నాయి. కానీ మె

AP Cabinet Meet Starts: సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం

AP Cabinet Meet: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అధ్యక్షతన సచివాలయంలో ఏపీ మంత్రి వర్గం సమావేశం అయింది. ఈ సమావేశంలో మంత్రి వర్గం పలు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. మొత్తం 42 అంశాలపై కేబినెట్‌ భేటీలో చర్చించనున్నారు. దీనిలో భాగంగా మూడో విడత ‘జగనన్న అమ్మ ఒడి’ పథకం నిధుల విడుదలకు కేబినెట్‌ ఆమోదం తెలపనుంది.

Kakinada NCC Camp: 40 మంది విద్యార్థులకు కరోనా లక్షణాలు

  • కాకినాడ SKR ఉన్నత పాఠశాలలో ఉన్న 40 మంది ఎన్.సి.సి  స్టూడెంట్స్ లో కరోనా లక్షణాలు

  • 40 మందికి కోవిడ్ టెస్ట్ లు చేయించి ఐసోలేషన్ లో ఉంచిన యూనిట్ కమాండింగ్ అధికారి

  • మొత్తం ఎన్.సి.సి క్యాంపులో ఉన్న 317 మంది విద్యార్థులు

  • ఈ నెల 18 నుంచి ప్రారంభం అయిన ఎన్ సీ సీ క్యాంప్

  • 40 మంది విద్యార్థుల రిజల్ట్స్ వచ్చాక ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి క్యాంపు కొనసాగింపుపై నిర్ణయం

Revanth Reddy: నేడు చంచల్ గూడ జైలుకు రేవంత్ రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నేడు చంచ‌ల్ గూడ జైలుకు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి కేసులో అరెస్టయిన అభ్యర్థులతో ఆయ‌న ములాఖ‌త్ అవ‌నున్నారు. ఈ సందర్భంగా రేవంత్ అభ్యర్థులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకోనున్నారు. జైలులో ఉన్న అభ్యర్థుల కోసం న్యాయ‌వాదుల‌ను కూడా నియ‌మించ‌నున్నట్లు కాంగ్రెస్ నాయ‌కులు వెల్లడించారు. అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా ఈ నెల 27వ తేదీన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తు హాజ‌రుకావాల‌ని, కేంద్రం తీసుకొచ్చిన అగ్నిప‌థ్‌ను తీవ్రస్థాయిలో వ్యతిరేకించాల‌ని పిల‌పునిచ్చారు.

AP Cabinet Meet: కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ

  • ఇవాళ ఉదయం 11 గంటలకు ఏపీ క్యాబినెట్ భేటీ.

  • కీలక నిర్ణయాలకు ఆమోదం తెలపనున్న మంత్రివర్గం.

  • దేవాదాయ భూముల ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా చట్ట సవరణకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

  • పంచాయతీరాజ్ చట్టంలో సవరణలకు ఆమోదం తెలపనున్న మంత్రిమండలి.

  • ఉమ్మడి జిల్లాల జెడ్పి చైర్మన్లను పదవీకాలం పూర్తయ్యేవరకూ కొత్త జిల్లాలకు కొనసాగించేలా చట్ట సవరణకు ఆమోదం.

  • ఈ నెల 27న అమ్మఒడి పధకం నిధులు విడుదలకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

  • 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్న ప్రభుత్వం.

  • 35 సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలపనున్న ప్రభుత్వం.

  • వివిధ సంస్థలకు 112 ఎకరాలు కేటాయింపు.

  • అదానీ గ్రీన్‌ ఎనర్జీ చేపట్టనున్న 3,700 మెగావాట్ల పంప్‌డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

  •  పులివెందులలో పంక్చుయేట్‌ వరల్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.50 కోట్లతో పెట్టనున్న గార్మెంట్స్‌ తయారీ పరిశ్రమకు ఆమోదం తెలపనున్న క్యాబినెట్.

  • కృష్ణాజిల్లా మల్లవెల్లి ఫుడ్‌పార్కులో రూ.150 కోట్లతో అవిసా ఫుడ్స్‌ ప్రయివేట్‌లిమిటెడ్‌  పెట్టనున్న రొయ్యల ప్రాససింగ్‌ పరిశ్రమకు 
    ఆమోదం తెలపనున్న మంత్రిమండలి.

  • కొప్పర్తిని టెక్స్‌టైల్‌ రీజియన్‌ అపారెల్‌ పార్క్‌గా తీర్చిదిద్దేందుకు ఆమోదం తెలిపనున్న క్యాబినెట్.

Background

Weather Latest News: ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణలో నైరుతి, పశ్చిమ గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు రాబోయే 3 రోజులు ఆంధ్రప్రదేశ్ లో వర్షాలు పడనున్నాయని అంచనా వేసింది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో ఇలా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చాలా భాగాల్లో ప్రస్తుతం ఆకాశం మేఘావృతమై ఉంది. అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక కురిసే అవకాశం ఉంటుంది. ఈరోజు, రేపు భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. అలాగే నేడు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


దక్షిణ కోస్తాంధ్రలో..
ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంటుంది. నేడు రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది.


రాయలసీమలో..
ఈరోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు రోజూ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు ఉరుములు, మెరుపులు రెండు చోట్ల సంభవించే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటనలో తెలిపారు.


Telangana Weather News: తెలంగాణ వాతావరణం ఇలా
తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు చాలా జిల్లాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కొమురం భీం, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ సహా మిగతా అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ విభాగం వెబ్ సైట్‌లో వెల్లడించారు.


హైదరాబాద్, పరిసర ప్రాంతాల వాతావరణం
‘‘ఆకాశం మేఘాలు పట్టి ఉంటుంది. హైదరాబాద్ నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు మరియు 24 డిగ్రీల వరకూ ఉండే అవకాశం ఉంది. పశ్చిమ దిశ ఉపరితల గాలులు, గాలివేగం గంటకు 8 నుంచి 12 గంటల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీల సెల్సియస్, కనిష్ఠ ఉష్ణోగ్రత 23.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.