News
News
X

Mukesh Ambani Visits Tirumala: శ్రీవారి సేవలో శ్రీమంతుడు- తిరుమలకు అంబానీ భారీ విరాళం!

Mukesh Ambani Visits Tirumala: రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

FOLLOW US: 

Mukesh Ambani Visits Tirumala: తిరుమల శ్రీవారిని ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం కాబోయే కోడలు రాధికతో కలసి శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేసారు.

దర్శనం తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ముకేశ్ అంబానీకి వేదాశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి శేష వస్త్రంతో సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆ తర్వాత ఆలయం వెలుపలో మీడియాతో అంబానీ మాట్లాడారు.

" శ్రీవారి ఆశీస్సులు పొందడం చాల సంతోషంగా ఉంది.  శ్రీవారి ఆలయంలో రోజు రోజుకు మెరుగైన సౌకర్యాల కల్పన జరుగుతుంది. శ్రీవారి ఆలయం భారత పౌరుల గర్వానికి చిహ్నం.                                                    "
-ముకేశ్ అంబానీ, రిలయన్స్ అధినేత

భారీ విరాళం

ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) రూ.1.5 కోట్లు విరాళంగా అందించారు అంబానీ. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. ఆ సమయంలో అంబానీతో పాటు ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితరులు ఉన్నారు. పాల్గొన్నారు.

గోశాలకు

అనంతరం శ్రీవారి ఆలయం నుంచి అంబానీ గోశాలకు వెళ్లారు. అక్కడ ఉన్న మహాలక్ష్మి ఏనుగుకు పళ్ళు అందించారు. మహాలక్ష్మి వద్ద ముకేశ్ అంబానీ ఆశీర్వాదం తీసుకున్నారు. అటు నుంచి శ్రీకృష్ణ అతిథి గృహానికి చేరుకున్నారు. అల్పాహారం స్వీకరించిన తర్వాత రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. ప్రత్యేక చార్టెడ్ విమానంలో ముంబయికి తిరుగు ప్రయాణం కానున్నారు. 

రద్దీగా

మరోవైపు తిరుమలలో‌ భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రతి శుక్రవారం ఆకాశ గంగ జలంతో శ్రీ వేంకటేశ్వర స్వామికి అభిషేకం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం 16-0 9-22 రోజున 65,634 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 31,419 మంది తలనీలాలు సమర్పించారు. రూ. 4 కోట్లు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు.

ఇక సర్వదర్శనం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండి పోవడంతో బయట ఎస్ఎంసీ జనరేటర్ వరకూ క్యూలైన్స్ లో వేచి ఉన్నారు. దీంతో స్వామి వారి సర్వ దర్శనానికి 20 గంటల సమయం‌ పడుతుంది.‌ ఇక ప్రత్యేక ప్రవేశ దర్శనంకు రెండు గంటల సమయం పడుతుంది. 

Also Read: AP Assembly Deputy Speaker: ఏపీ డిప్యూటీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల, ఆయనకే ఛాన్స్ !

Also Read: Chandrababu: టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తా - చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Published at : 16 Sep 2022 12:35 PM (IST) Tags: AP Temple Mukesh Ambani Visits Tirumala Mukesh Ambani Donates Rs 1.5 Crore To Tirumala

సంబంధిత కథనాలు

Delhi Meeting :

Delhi Meeting : "రాజధాని"కే నిధులడిన ఏపీ - లెక్కలు చెప్పమన్న కేంద్రం ! ఢిల్లీ మీటింగ్‌లో జరిగింది ఏమిటంటే ?

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

హైదరాబాద్‌ వాసులకు హెచ్చరిక- 6 గంటల వరకు బయటకు వెళ్లొద్దు: వాతావరణ శాఖ

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

ఏవండీ ఆవిడ వద్దు! నెల్లూరు టిక్‌టాక్‌ మ్యారేజ్‌లో అదిరిపోయే ట్విస్ట్‌

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

జగన్ పచ్చి బ్రాందీ తయారు చేయిస్తున్నారు- అధికారులు, లీడర్లు వంద కోట్లు సంపాదించారు: సోము వీర్రాజు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

Atchannaidu: రాష్ట్రం బొత్సా జాగీరు కాదు, ఉత్తరాంధ్ర మంత్రులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు

టాప్ స్టోరీస్

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

పద్దతి దాటితే కుల్లం కల్లం మాట్లాడతా, షర్మిల గురించి డెప్త్‌ విషయాలు చెప్తా: జగ్గారెడ్డి

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Satyadev Interview : చిరంజీవి స్థాయిని తగ్గించేలా నటించలేదు... వాళ్ళ డౌట్స్ వాళ్ళవి, నా కాన్ఫిడెన్స్ నాది - సత్యదేవ్ ఇంటర్వ్యూ

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

Ponniyin Selvan: 'పొన్నియిన్ సెల్వన్' సినిమాకి పూర్ బుకింగ్స్ - పాజిటివ్ టాక్ వస్తుందా?

India vs South Africa T20: మెగా టోర్నీకి ముందు ఆఖరి అవకాశం.. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్

India vs South Africa T20: మెగా టోర్నీకి ముందు ఆఖరి అవకాశం.. రేపటి నుంచి దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్