విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను సవాలు చేస్తూ సీబీఐ మాజీ జేడీ.. లక్ష్మీనారాయణ ఏపీ హైకోర్టులో వాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఏపీ ప్రభుత్వాన్ని అఫిడవిడ్ దాఖలు చేయమని ఆదేశించింది. ఈ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం తరఫున ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాల వళవన్అఫిడవిట్ వేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ దేశంలో సముద్ర తీరంలో ఉన్న మొదటి ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ అని అఫిడవిట్ లో తెలిపారు. రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థ అని పేర్కొన్నారు. 20 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తుందని తెలిపారు. విశాఖ ఉక్కు పరిశ్రమ కోసం 32 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొన్నారు.
Also Read: Watch: 10 ఏళ్ల నుంచి మంత్రి హరీశ్ రావుకు తొలి రాఖీ కట్టేది ఈమెనే..
7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను పునరాలోచించాలని ఏపీ సీఎం జగన్ ఈ ఏడాది ఫిబ్రవరి 6న ప్రధాని మోదీకి లేఖ రాశారని అఫిడవిట్ తో తెలిపారు. ప్రస్తుతం విశాఖ ఉక్కు పరిశ్రమకు 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం ఉందని, ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు బ్యాంకుల నుంచి రుణాలు కూడా తీసుకుందని పేర్కొన్నారు. పరిశ్రమకు సొంతంగా గనులు లేకపోవడంతో ఉక్కు ఉత్పత్తికి అధిక ఖర్చు అవుతుందని తెలిపారు. దీని వల్లే లాభాలపై ప్రభావం పడుతుందన్నారు. ప్లాంట్‌ను పూర్వస్థితికి తెచ్చేందుకు అవకాశాలను అన్వేషించాలని, పెట్టుబడుల ఉపసంహరణపై పునరాలోచన చేయాలని సూచించారు. కేంద్ర పెట్రోలియం సహజవాయువు, ఉక్కుశాఖ మంత్రికి సీఎం జగన్ ఫిబ్రవరి 26 న లేఖ రాశారని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలిపింది.
Also Read: Karimnagar: ఒకే కాన్పులో అక్కకు నలుగురు, చెల్లికి ముగ్గురు.. మరో అవాక్కయ్యే ట్విస్ట్ కూడా..
గనులు కేటాయిస్తే లాభాలు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ పార్లమెంట్ వేదికగా విశాఖ స్టీల్ ప్లాంట్ పెట్టుబడుల ఉపసంహరణకు మార్చి 8న ప్రకటన చేశారు. మార్చి 9న ప్రధానికి సీఎం జగన్ మరోలేఖ రాశారని ప్రభుత్వం అఫిపడవిట్‌లో పేర్కొంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో ఈ ఏడాది మే 20న తీర్మానం కూడా చేసినట్లు పేర్కొన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమకు ఇనుప ఖనిజం గనులను కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గి నెలకు రూ.200 కోట్లు లాభాల్ని ఆర్జించగలుగుతుందని అఫిడవిట్‌లో పేర్కొంది.