విజయవాడలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు చిన్నారులతో వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఏడాది క్రితం కరోనా మహమ్మారితో భర్త చనిపోయాడు. భర్తను కోల్పోయిన దుఃఖంలో ఉన్న ఆమెకు అండగా నిలవాల్సిన అత్తింటి వాళ్లు వేధింపులకు గురిచేశారు. ఆ బాధలు భరించలేక జీవితంపై విరక్తి చెందిన మహిళ ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. 


Also Read: Vijayawada Crime News: విజయవాడలో సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి...తలకు బలమైన గాయం... ప్రేమికుడి పాత్రపై పోలీసులు ఆరా


కరోనా భర్త మృతి


విజయవాడలోని ప్రసాదంపాడులో నివాసం ఉంటున్న మహిళ ఇద్దరు పిల్లలతో  కలిసి ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కరోనాతో భర్తను కోల్పోయిన కోడలికి తోడుగా ఉండాల్సిన అత్తింటివారు  వేధింపులకు గురి చేయడంతోనే వివాహిత ఆత్మహత్య చేసుకుందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు.  ఈ ఘటనపై సమాచారం అందుకున్న పటమట పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


Also Read: Hyderabad: సెల్ఫీ తీసుకుంటూ లైవ్‌లో ఉరేసుకున్న వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులు షాక్!


Also Read: Hyderabad Fraud: మేనమామ, మేనల్లుళ్ల బొగ్గు బిజినెస్.. చిల్లిగవ్వ లేకపోయినా లక్షల్లో పెట్టుబడులు, చివరికి..


 


విజయవాడలో మరో ఘోరం


సామాజిక మాధ్యమాల్లో మహిళలపై వేధింపులు ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఘటనే విజయవాడలో వెలుగు చూసింది. బిహార్‌కు చెందిన రోహిత్‌ కుమార్‌ అనే యువకుడు విజయవాడలో నివాసం ఉంటున్నాడు. స్నేహం పేరుతో ఓ యువతితో పరిచయం ఏర్పరుచుకున్నాడు. యువతితో సాన్నిహిత్యం పెంచుకున్న ఆమెకు సంబంధించిన నగ్న చిత్రాలు సేకరించాడు. 


ఇద్దరు యువకులు అరెస్ట్


కొద్ది రోజులుగా రోహిత్‌ తీరు నచ్చని యువతి అతనిని దూరం పెట్టింది. దీంతో రోహిత్‌, కృష్ణ లంకకు చెందిన గణేష్‌తో కలిసి యువతిని వేధించడం మొదలు పెట్టాడు. యువతి పేరుతో ఓ నకిలీ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌ను క్రియేట్ చేశాడు. అనంతరం ఆ అకౌంట్‌లో యువతికి చెందిన నగ్న ఫొటోలు పోస్ట్‌ చేయడం మొదలుపెట్టాడు. విషయం తెలుసుకున్న యువతి సైబర్‌ పోలీసులను ఆశ్రయించింది. వెంటనే రంగంలోకి దిగిన సైబర్ పోలీసులు ఇద్దరు యువకులను అరెస్ట్‌ చేశారు. 


 


Also Read: Viral Video: ఛీ.. పాడు.. పానీపూరీలో ఏం కలిపాడో చూడండి.. అసహ్యించుకుంటారు!


Also Read: Punganur: స్కూటీపై ఇద్దరు అమ్మాయిలు దర్జాగా వచ్చి ఏం ఎత్తుకెళ్లారో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది... నవ్వు కూడా ఆగదు