విజయవాడలో సీఏ విద్యార్థిని అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. గుణదల గంగిరెద్దులదిబ్బలోని ఓ ఇంట్లో చార్టెడ్‌ అకౌంటెంట్‌ చెరుకూరి సింధు విగతజీవిగా పడిఉన్నారు. ఆమె తలకు బలమైన గాయం ఉంది. దీంతో మాచవరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ కుమార్తే సింధుది హత్యేనని యువతి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఆమె స్నేహితుడు ప్రసేన్‌ ఈ హత్యచేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 


ప్రేమ పెళ్లికి పెద్దలు నో


విజయవాడలో చార్టెడ్ అకౌంటెంట్ మృతి అనుమానాలకు తావిస్తోంది. మాచవరం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం కృష్ణా జిల్లా తిరువూరు మండలం రాజుగూడెం గ్రామానికి చెందిన చెరుకూరి సింధు (29) గుణదల గంగిరెద్దుల దిబ్బలో ఉంటున్నారు. చార్టెడ్ అకౌంటెంట్ చదువుతూ స్థానికంగా ఓ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తోంది. ప్రసేన్‌ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారి స్నేహం ప్రేమగా మారింది. కానీ ప్రసేన్‌ కుటుంబ సభ్యులు వీరి ప్రేమ వివాహానికి అంగీకరించలేదు. 


Also Read: Suryapet Crime News: యువతిపై చిన్నాన్న అత్యాచారం... సోదరుడు కూడా లైంగిక వేధింపులు... తట్టుకోలేక ఆత్మహత్య


ఉరి వేసుకుని ఆత్మహత్య!


సింధు తల్లిదండ్రులు కూడా ఈ వివాహాన్ని వ్యతిరేకించడంతో ఇరు కుటుంబాల మధ్య విబేధాలు ఏర్పడ్డాయి. కొన్ని కారణాల వల్ల సింధు, ప్రసేన్‌ మధ్య కూడా మనస్పర్థలు వచ్చాయి.  దీంతో ఆమె గుణదల ప్రాంతానికి వచ్చి ఒంటరిగా ఉంటోంది. కుటుంబ సభ్యులు, ప్రేమించిన వ్యక్తి దూరం కావడంతో ఆమె మానసిక క్షోభకు గురై ఆత్మహత్యకు పాల్పడిందా అని పోలీసులు భావిస్తున్నారు. జీవితంపై విరక్తి చెంది తాను ఉంటున్న గదిలోనే ఫ్యానుకు చీరతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడిందని ప్రాథమికంగా అంచనా వేస్తు్న్నారు. కానీ సింధు తలకు బలమైన గాయం ఉండడంతో అనుమానాలకు తావిస్తున్నాయి. గత రెండు రోజులుగా సింధు ఉన్న గది తలుపులు మూసి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సింధు తల్లిదండ్రులు కుమార్తె విగత జీవిగా పడిఉండడాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. 


Also Read: Watch: జేఎన్టీయూకే గెస్ట్‌హౌస్‌లో కొత్త జంట శోభనం.. పూలపాన్పుతో ముస్తాబు, వీడియోలు వైరల్


 

ప్రసేనే హత్య చేశాడు!


తమ కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికి వ్యక్తి కాదని ప్రేమ పేరుతో మోసం చేసిన ప్రసేనే తన కుమార్తెను హత్య చేశాడని సింధు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు సింధు తండ్రి వెంకటేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింధు మృతదేహాన్ని పోలీసులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ కేసులో ఇంకా చిక్కుముడులు ఉన్నాయి. సింధు ఫ్యానుకి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటే ఉరికి వేలాడకుండా నేలపై ఎలా పడిఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే సింధు తలభాగం నుంచి రక్తం కారడంతో ప్రసేన్‌ హత్యచేసి ఉంటాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేపట్టారు.  


 


Also Read: Ramya Murder Case: రమ్య హత్య కేసు.. 24న ఏపీకి రానున్న జాతీయ ఎస్సీ కమిషన్ బృందం..