ఆగస్టు 22 ఆదివారం రాశిఫలాలు


మేషం


ఈ రోజు మీపై ఒత్తిడి పెరగవచ్చు. ఆఫీసులో ఇబ్బంది ఉంటుంది. ఎవరితోనైనా వివాదానికి అవకాశం ఉంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండండి. ఆదాయ స్థితి సాధారణంగా ఉంటుంది. కుటుంబ కార్యక్రమాల కారణంగా మీరు బయటకు వెళ్లాల్సి రావచ్చు. పూర్వీకుల ఆస్తి విషయాలలో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. కుటుంబంలో అసమ్మతి వాతావరణం ఉటుంది. పెద్దల సలహాలు తీసుకోండి.


వృషభం


వృషభరాశి వారికి ఈ రోజు బాగానే ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడతారు. కార్యాలయంలో ఎవరితోనైనా వివాదం ఉండొచ్చు. బంధువుల నుంచి కొన్ని ముఖ్యమైన సమాచారం అందుకోవచ్చు. విద్యార్థులు ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ పనులు ముందుకు సాగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆఫీసులో మరింత బాధ్యత పెరుగుతుంది.


మిథునం


కార్యాలయంలో అజాగ్రత్తగా ఉండకండి. తెలియని వ్యక్తుల నుంచి దూరంగా ఉండండి. సామాజిక సేవలో పాల్గొంటారు. స్నేహితుడిని కలుస్తారు. పై అధికారులతో విభేదాలు ఉండొచ్చు. కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అనువైన సమయం. ఎవ్వరికీ సలహాలు ఇవ్వొద్దు. ఆహారం విషయంలో నిర్లక్ష్యం వద్దు.


కర్కాటక రాశి


కుటుంబ సభ్యుల సహాయంతో మీరు ప్రయోజనం పొందుతారు. కొత్త వ్యక్తులతో సమావేశమవుతారు. చేపట్టిన పనులు ముందుకు సాగుతాయి. సోమరితనం వద్దు. పెద్దలు ఆశీస్సులు పొందుతారు. మానసికంగా మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి పనిచేయాలి. వైవాహిక జీవితంలో మధురానుభూతి ఉంటుంది. ఈరోజు ఖర్చు కొంచెం ఎక్కువే ఉంటుంది.


Also Read: శ్రీమహాలక్ష్మి, ద్రౌపది మొదలు యుగాలను దాటుకుని వచ్చిన పండుగ ఇది..


సింహం


సింహరాశి వారు ఈ రోజు శుభవార్త వింటారు. అపరిచితులకు సహాయం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. శత్రువులు ఆధిపత్యం చెలాయిస్తారు. కార్యాలయంలో పనిఒత్తిడి ఎక్కువ ఉంటుంది. ఎవరితోనైనా విభేదాలు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. మీ ఆలోచనా విధానం మారుతుంది. పిల్లలవైపు సమస్యలను అధిగమిస్తారు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి ఆందోళన చెందవద్దు.


కన్య


బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కారమయ్యే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. పని ఒత్తిడి తగ్గుతుంది. రోజంతా చాలా మందిని కలుస్తారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. విద్యార్థులు కష్టపడి పనిచేయాలి. అవసరమైన వారికి సహాయం చేస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. బయట పదార్థాలు తినొద్దు.


తులారాశి


మీ ప్రత్యర్థి కారణంగా మీరు గాయపడవచ్చు. రిస్క్ తీసుకోకండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. లాటరీ, మాదకద్రవ్య వ్యసనం, జూదం మొదలైన వాటికి దూరంగా ఉండండి. పని ప్రదేశంలో వాతావరణం చక్కగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించండి.


వృశ్చికరాశి


మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. రుణం మొత్తాన్ని తిరిగి చెల్లించగలుగుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. రహస్య విషాలను అందరి ముందు చర్చించవద్దు. నిర్ణయాలు తీసుకోవడంలో అసహనం చూపవద్దు. కుటుంబ సభ్యులతో సామరస్యం ఉంటుంది. తెలియని వ్యక్తులకు దూరంగా ఉండండి. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఈ రోజంతా సంతోషంగా ఉంటారు. పనిలో ప్రశంసలు అందుకుంటారు.


Also Read: రాఖీ పౌర్ణమి రోజు మరో విశిష్టత హయగ్రీయ జయంతి.. విద్యార్థులకు చాలా ముఖ్యమైన రోజు


ధనుస్సు


వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి. దినచర్య మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. పెండింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త వ్యక్తులతో సమావేశం అవుతారు. టెన్షన్ తగ్గుతుంది. శత్రువుపై ఆధిపత్యం చెలాయిస్తాడు. వ్యాపారస్తులకు అనుకూల సమయం.


మకరం


మకర రాశివారికి కొన్ని ఇబ్బందులు తప్పవు. విద్యార్థులు పోటీ పరీక్షల కోసం కష్టపడాల్సి ఉంటుంది. బంధువులు ఇంటికి రావచ్చు. కొన్ని విషయాలకు సంబంధించి జీవిత భాగస్వామితో విభేదాలు ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి.  స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. సహోద్యోగులతో విభేదాలు ఉండే అవకాశం.


కుంభం


మీ స్నేహితులను కలుస్తారు. వివాదాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆఫీసులో ఎక్కువ బాధ్యత కారణంగా మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. రుణం మొత్తాన్ని తిరిగి ఇచ్చే అవకాశం ఉంది. ఈ రోజు మీరు చాలా సానుకూలంగా ఉంటారు. అవసరమైన వారికి సహాయం చేయగలరు. ఏదైనా పని కోసం బయటకు వెళ్లాల్సి రావచ్చు.


మీనం


 మీ దినచర్యలో మార్పు ఉంటుంది. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ప్రయాణాలను వాయిదా వేయండి. పని పూర్తి చేయడానికి సోమరితనం వద్దు.  ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. శుభవార్త వింటారు. ఖర్చులు నియంత్రిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మతపరమైన పనుల్లో పాల్గొంటారు. పెద్దల ఆశీర్వచనాలు అందుకుంటారు.


 


Also Reda: చిరంజీవి, పీవీ సింధుతో రాధిక ఫొటో.. ఆమె ట్వీట్ చూసి నెటిజనులు ట్రోలింగ్, ఆ తప్పేంటో తెలుసా?


Also Read: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు


Also Read: ‘మా’ భవనానికి స్థలం చూశా.. నాగబాబు సవాల్‌కు విష్ణు జవాబ్ ఇదేనా? కన్నెందుకు కొట్టావంటూ ట్రోల్స్