సోషల్ మీడియాలోని జనాలు మామూలోళ్లు కాదు. ఎక్కడ ఏ చిన్న తప్పు చేసినా ఇట్టే కనిపెట్టేస్తారు. ఆ తప్పును వేలెత్తిచూపుతారు. ఇక సెలెబ్రిటీల విషయంలో అయితే నెటిజన్లు మరింత స్పీడుగా ఉంటారు. వాళ్లు ఓ ఉద్దేశంతో ట్వీట్స్ చేసినా అందులో తప్పులు వెతికి మరీ ఏకిపారేస్తుంటారు. సీనియర్ హీరోయిన్ రాధికను ఇప్పుడిలాంటి పరిస్థితే ఎదురైంది.


టోక్యో ఒలింపిక్స్‌లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు కాంస్య పతకం గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. మహిళల సింగిల్స్‌లో భాగంగా చైనాకి చెందిన హి బింగ్జియావోతోకాంస్య పతక పోరులో తలపడిన పీవీ సింధు 21-13, 21-15 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలుపొందిన పీవీ సింధు.. వరుసగా రెండు ఒలింపిక్స్‌లో పతకం సాధించిన షట్లర్‌గా రికార్డ్ నెలకొల్పింది. రెండు సార్లు ఒలింపిక్ ప‌త‌కం సాధించిన తెలుగు అమ్మాయిని ప‌లువురు ప్ర‌ముఖులు సత్కరిస్తూ వ‌స్తున్నారు. తాజాగా చిరంజీవి .. పీవీ సింధుని సత్క‌రించ‌గా ఈ వేడుక‌లో రాధిక‌, సుహాసినితో పాటు ప‌లువురు ప్ర‌ముఖులు పాల్గొన్నారు. పీవీ సింధు, చిరంజీవితో క‌లిసి దిగిన ఫొటోల‌ని త‌న ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన రాధిక...మిత్రుడు చిరంజీవి  సింధును స‌త్క‌రించే వేడుక‌లో పాల్గొన‌డం గొప్ప అనుభూతిని పంచిందని ట్వీట్ చేసింది.




అయితే రాధిక ట్వీట్‌లో చిన్న త‌ప్పిదం దొర్ల‌డంతో ఆమెపై విమ‌ర్శ‌లు చేశారు నెటిజ‌న్స్. ‘పసిడి పతకం గెలుచుకోవడం ఎంత గొప్ప అనుభూతి! దేశం కోసం పోరాడి పతకం సాధించింది’ అంటూ రాధిక తన ట్వీట్ లో పేర్కొన్నారు. అంతేకాదు, ఒలింపిక్ గోల్డ్ అంటూ హ్యాష్ ట్యాగ్ కూడా పెట్టారు. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తడంతో  మ‌ళ్లీ ట్వీట్ చేసింది రాధిక. ఆ కాంస్య పతకమే బంగారు పతకం కంటే గొప్పది.. పీవీ సింధులోని ఆ ఫీలింగ్స్, ఆమె సంతోషమే అది తెలియజేస్తోంది అని ట్రోలర్లకు సమాధానం ఇచ్చింది. ఏదేమైనా  రాధిక, సింధు, చిరు ఫొటో సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది.


Also Read: ట్రిపుల్‌ ఆర్‌ విడుదల వాయిదా? రాజమౌళి పెట్టబోయే ప్రెస్‌మీట్‌ అందుకేనా?


Also Read: ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!


Also Read: భీమ్లానాయక్ జోష్ తగ్గకముందే ‘హరి హర వీరమల్లు’ రిలీజ్.. 3 నెలల గ్యాప్‌లోనే వస్తోన్న పవన్ కళ్యాణ్


Also Read: పవన్ కళ్యాణ్ సేఫ్ జర్నీ.. రిమేక్ సినిమాలే బెటర్ అనుకుంటున్న పవర్ స్టార్?