ఆర్ఎస్ 100 సినిమాతో తెలుగు సినిమాల్లోకి ప్రవేశించి కుర్రకారు గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.. హీరోయిన్ పాయల్ రాజ్ పుత్. విక్టరీ వెంకటేశ్ వంటి సీనియర్ నటులతోనే కాకుండా యువ హీరోలతో కూడా నటిస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ప్రేక్షకుల్లో క్రేజ్ కూడా పాయల్‌కు బాగానే ఉంది. కేవలం సినిమాలతోనే కాకుండా పాయల్ రాజ్ పుత్ వివిధ మార్గాల ద్వారానూ సంపాదిస్తున్నారు. షాప్ ఓపెనింగ్‌లు, ఇతర ఈవెంట్ల ఆఫర్ల విషయంలోనూ పాయల్ ముందుంటున్నారు. అయితే, తాజాగా ఆమెపై ఓ కేసు నమోదైంది.


Also Read: In Pics: ఇది సిద్దిపేటా? కశ్మీరా? హరీశ్ రావు ట్వీట్ చేసిన ఫోటోలకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు


హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ ఓ కేసులో ఇరుక్కున్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆమెపై పెద్దపల్లి జిల్లా పోలీసులు ఈ కేసు నమోదు చేశారు. గత నెల 11న పెద్దపల్లి పట్టణంలో ఓ షాపింగ్‌ మాల్‌ ప్రారంభోత్సవంలో పాయల్‌ రాజ్‌ పుత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమె మాస్కు ధరించకపోవడంతో పాటు కొవిడ్‌ నిబంధనలు పాటించలేదు. ఈ విషయాన్ని పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్‌ అనే వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేశారు. దీంతో జూనియర్‌ సివిల్‌ ఇన్‌చార్జి జడ్జి పార్థసారథి ఆదేశాల మేరకు పాయల్‌ రాజ్ పుత్‌పై కేసు నమోదు చేసినట్లు పెద్దపల్లి పోలీసులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన షాపు యజమానితో పాటు ఇంకొందరిపైనా కేసు నమోదు చేసినట్లు తెలిపారు. షాప్ ఓపెనింగ్ ఏమో కానీ ఈ ముద్దుగుమ్మకు లేనిపోని కష్టాలు వచ్చిపడ్డట్లయింది. ఈ హాట్ బ్యూటీపై ఇలా కేసు నమోదు అవ్వడంతో పాయల్ ఫ్యాన్స్ కొంచెం ఫీలయ్యారు.


Also Read: Lotus Pond Banjara Hills: లోటస్ పాండ్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు! పని తీరును మెచ్చుకున్న కేటీఆర్


అయితే, ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత మళ్లీ ఆ స్థాయి హిట్ పాయల్‌కు అందలేదు. వెంకటేష్ సరసన వెంకీ మామ, రవితేజకు జోడీగా డిస్కోరాజా వంటి సినిమాలు చేసినప్పటికీ ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోకపోవడంతో పాయల్‌కు కూడా మంచి పేరు రాలేదు. దీంతో ఆఫర్లు కూడా పర్లేదనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పాయ రాజ్ పుత్‌పై పోలీస్ కేసు నమోదైంది. ఆమెపై పెద్దపల్లి కోర్టులో ఫిర్యాదు నమోదైంది.


Also Read: Traffic Challan Telangana: పెండింగ్ చలానా ఉంటే పోలీసులు మన బండి సీజ్ చేయొచ్చా? హైకోర్టు క్లారిటీ


Also Read: TRS News: వాళ్లు చవటలు, దద్దమ్మలు.. సొల్లు పురాణం బంద్ చేయండి.. కిషన్ రెడ్డి వ్యాఖ్యలతో గులాబీ నేతలు ఫైర్


Also Read: Telugu Politics In Delhi : తెలుగు ప్రాంతీయ పార్టీలు బీజేపీ పక్షమేనా..? సోనియాతో భేటీకి ఎందుకు డుమ్మా ?