Lotus Pond Banjara Hills: లోటస్ పాండ్‌ను ఇలా ఎప్పుడూ చూసుండరు! పని తీరును మెచ్చుకున్న కేటీఆర్
బంజారాహిల్స్‌లోని లోటస్ పాండ్ రూపురేఖలను మొత్తం జీహెచ్ఎంసీ మార్చేసింది. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఈ లోటస్ పాండ్‌ను జీహెచ్ఎంసీ సిబ్బంది సుందరంగా తీర్చిదిద్దారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవాటర్ ప్యూరిఫికేషన్ కోసం ఏరేటర్లు, సందర్శకులను ఆకట్టుకునేలా నీటి మధ్యలో ఐ ల్యాండ్స్ (ఫ్లోటింగ్ ఐ ల్యాండ్స్) ఏర్పాటు చేశారు. చుట్టూ వాకింగ్ ట్రాక్‌ను కూడా నిర్మించారు.
సుందర వనంగా మారిన ఈ లోటస్ పాండ్ చుట్టూ సందర్శకులు కూర్చొనేలా బెంచీలు కూడా ఏర్పాటు చేశారు. వివిధ కళాకృతుల్లో విద్యుత్ దీపాలను అమర్చారు. ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఈ లోటస్ పాండ్ కొలను అభివృద్ధి ఫొటోలను జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ ట్విటర్లో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు.
దీనిపై స్పందించిన కేటీఆర్.. జీహెచ్ఎంసీ అధికారుల పని తీరును మెచ్చుకున్నారు. ‘‘గ్రేట్ జాబ్.. ఇలాంటివి మరిన్ని అభివృద్ధి చేయాలి’’ అని కేటీఆర్ రీట్వీట్ చేశారు.