Venkaiah Naidu visits HAL: యుద్ధవిమానంలో ఉపరాష్ట్రపతి వెంకయ్య.. బెంగళూరులో హెచ్‌ఏఎల్ సందర్శన వేళ ఇంట్రస్టింగ్ పిక్స్
బెంగళూరులోని హెచ్.ఏ.ఎల్. కాంప్లెక్స్‌ను ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సందర్శించారు. అక్కడ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్, ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీకి చెందిన శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లతో మాట్లాడారు
Download ABP Live App and Watch All Latest Videos
View In Appరాబోయే కాలంలో భారతదేశాన్ని వైమానిక మరియు రక్షణ రంగాల్లో శక్తికేంద్రంగా తీర్చిదిద్దడంలో దేశీయ ఉత్పత్తులు కీలకపాత్ర పోషించనున్నాయని ఉపరాష్ట్రపతి వెంకయ్య ఆశాభావం వ్యక్తం చేశారు.
భారతదేశం అతిపెద్ద రక్షణ రంగ ఎగుమతిదారుగా ఎదగాలనేదే తమ ఆకాంక్షని తెలిపిన ఉపరాష్ట్రపతి. రక్షణ సాంకేతికతలో స్వయం ఆధారిత దేశంగా భారత్‌ను నిలబెట్టేందుకు అత్యాధునిక సాంకేతికతను అభివృద్ధి చేయాలని శాస్త్రవేత్తలకు పిలుపునిచ్చారు.
ఆత్మనిర్భరతను సాధించటంతోపాటు ఆధునిక సైనిక సాంకేతిక పరికరాల ఎగుమతుల కేంద్రంగా ఎదగాలని దిశానిర్దేశం చేశారు వెంకయ్య. అత్యాధునిక క్షిపణులు, ఉపగ్రహాలు మరియు అంతరిక్ష వాహనాలను తయారు చేయగల భారతదేశ సామర్థ్యం గురించి ప్రస్తావించారు.
భారతదేశం మొన్నటి వరకూ ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతి దేశంగా ఉందని, ప్రస్తుతం ఈ పరిస్థితి క్రమంగా మారుతోందని, భవిష్యత్‌లో క్లిష్టమైన సాంకేతికతల స్వదేశీ అభివృద్ధిని వేగవంతం చేయడం ద్వారా ఈ పరిస్థితిని మార్చాలని పిలుపునిచ్చారు ఉపరాష్ట్రపతి.
దేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ళు ప్రస్తావించిన ఉపరాష్ట్రపతి.. భద్రతాదళాల ధైర్యం, నైపుణ్యాలను ప్రశంసించారు. భద్రతా సవాళ్ళు గట్టిగా తిప్పికొట్టడానికి పూర్తి సన్నద్ధంగా ఉండేలా నైపుణ్యాలు పెంచాల్సిన అవసరం ఉందని సూచించారు.
మంచి ఫలితాల కోసం రక్షణ రంగ ప్రాజెక్టుల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు వెంకయ్య.
రక్షణ రంగానికి ఎఫ్.డి.ఐ. పరిమితి పెంపు, ఉత్తరప్రదేశ్- తమిళనాడుల్లో రెండు రక్షణ కారిడార్‌ల ఏర్పాటు నిర్ణయం దేశ రక్షణ రంగానికి గొప్ప అవకాశమన్నారు ఉపరాష్ట్రపతి.
4ప్లస్ తరం విమానాలు భారత వైమానికదళ అవసరాలను తీర్చేందుకు ఇదో శక్తివంతమైన వేదికని ఉపరాష్ట్రపతి విశ్వాసం వ్యక్తం చేశారు.
స్వదేశీ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన తేలికపాటి హెలికాఫ్టర్, ధ్రువ్, తేలికపాటి కంబాట్ హెలికాఫ్టర్, తేలికపాటి యుటిలిటీ హెలికాఫ్టర్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఎల్.సి.ఏ. ఎం.కె-2, అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, ట్విన్ ఇంజిన్ డెక్ బేస్డ్ ఫైటర్ వంటి శక్తివంతమైన విమానాల రూపకల్పన పట్ల విశ్వాసం వ్యక్తం చేశారు ఉపరాష్ట్రపతి. యుద్ధవిమానాల అవసరాల కోసం ఇకపై భారతదేశం విదేశీ సాంకేతికత మీద ఆధారపడాల్సిన అవసరం ఏమాత్రం లేదని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్, హెచ్.ఏ.ఎల్. ఛైర్మన్ ఆర్. మాధవన్, సంచాలకులు అలోక్ వర్మ సహా పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.