Maritime Exercise: దక్షిణ చైనా సముద్రంలో INS రణవిజయ్ అద్భుత విన్యాసాలు
ABP Desam | 18 Aug 2021 07:57 PM (IST)
1
వియత్నాం నౌకాదళంతో సంయుక్త విన్యాసాల కోసం తూర్పు నౌకాదళం నుంచి మరో రెండు నౌకలు దక్షిణ చైనా సముద్రంలోకి ప్రవేశించాయి.
2
INS రణవిజయ్, INS కోరాలు ద్వైపాక్షిక సముద్ర విన్యాసాలను నిర్వహించేందుకు అక్కడికి చేరుకున్నాయి.
3
వియత్నాం నేవీ యుద్ధ నౌక లేధాయ్ కూడా ఈ విన్యాసాలలో పాల్గొంది.
4
నౌక నుంచి నౌక మీదకు హెలికాప్టర్లు వాలడం, ఫిరంగులు, టాంకర్ల వినియోగంతోపాటు యుద్ధ విమానాలతో సమన్వయం చేసుకుని విన్యాసాలు నిర్వహించారు.
5
రెండు దేశాల మధ్య రక్షణ రంగంలో ఈ ఏడాది జూన్ లో కుదిరిన ఒప్పందంలో భారత నౌకలు తరుచుగా వియత్నాం పోర్టులను సందర్శించాలని నిర్ణయించారు.