In Pics: ఇది సిద్దిపేటా? కశ్మీరా? హరీశ్ రావు ట్వీట్ చేసిన ఫోటోలకు ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
సిద్దిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న మంత్రి హరీశ్ రావు తన ప్రాంతం పట్ల ఎప్పుడూ శ్రద్ధ చూపుతుంటారు. తన నియోజకవర్గ అభివృద్ధికి ఎప్పుడూ పాటు పడుతుంటారు. ఈ క్రమంలో శుక్రవారం రెండు ఫోటోలను ట్వీట్ చేశారు. ఆ ఫోటోలను చూసి ఇది సిద్దిపేటా? కశ్మీరా? అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘వైబ్స్ ఆఫ్ సిద్దిపేట’ అంటూ రెండు ఫోటోలను ట్వీట్ చేశారు. అందులో ప్రకృతి దృశ్యం అత్యంత రమణీయంగా ఉంది. నిజంగా అది సిద్దిపేటేనా అనే ఆలోచన కలుగుతోంది. ఉద్యానవనాలు, పచ్చదనం పెంపుతో సిద్దిపేటలో ఇలాంటి చోటు కూడా ఉందనే ఉద్దేశంతో మంత్రి ట్వీట్ చేయగా.. నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
మరికొంత మంది మాత్రం విమర్శిస్తున్నారు. మంత్రి అంటే సిద్దిపేటకే కాదని.. తెలంగాణలోని మిగతా ప్రాంతాలు కూడా పట్టించుకోవాలని హితవు పలికారు. ‘‘హరీష్ రావు గారు.. తెలంగాణ ఇంకా అభివృద్ధి విషయంలో అసమానతలను గురిఅవుతూనే ఉంది. తెలంగాణ అంటే.. సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ మాత్రమే కాదు అని గుర్తుపెట్టుకోండి’’ అని దాసరి మహినాథ్ అనే ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు.