Maa Association: ‘మా’ భవనానికి స్థలం చూశా.. నాగబాబు సవాల్‌కు విష్ణు జవాబ్ ఇదేనా? కన్నెందుకు కొట్టావంటూ ట్రోల్స్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ రాజకీయాలు MAA శాశ్వత భవనం చుట్టూ తిరుగుతున్నాయ్. ఇలాంటి సమయంలో మంచు విష్ణు ట్వీట్టర్లో విడుదల చేసిన ఓ వీడియోపై చర్చ జరుగుతోంది

Continues below advertisement

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్.. మంచు విష్ణు సహా పలువురు మా సొంత భవంతి నిర్మాణంపైనే టార్గెట్ చేస్తూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు. అధ్యక్షుడిగా గెలిపించిన వెంటనే ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అయితే కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు శాశ్వత భవంతి నిర్మాణం కోసం తన సొంత డబ్బును వెచ్చిస్తానని, ఎవరూ రూపాయి కూడా పెట్టాల్సిన పనే లేదని ప్రకటించడం చర్చనీయమైంది. విష్ణు ఈ ప్రకటన చేసి చాలా రోజులు కావడం, ఆ తర్వాత దాని గురించి మాట్లాడకపోవడంతో ప్రతిజ్ఞను నెరవేరుస్తాడా లేదా అనే చర్చ జరిగింది. ఇలాంటి సమయంలో మంచు విష్ణు ట్విట్టర్లో పోస్ట్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Continues below advertisement

విష్ణు మాట్లాడుతూ- ‘‘MAA కుటుంబానికి శుభోదయం. మా అసోసియేషన్ శాశ్వత ఆఫీస్ ని కలిగి ఉండటం మనందరి కల. నేను వ్యక్తిగతంగా మూడు  స్థలాలను సందర్శించాను. ఆ విషయాన్ని అందరితో పంచుకోవాలనుకున్నాను. మనమంతా ఆ మూడింటి నుంచి బెస్ట్ స్థలాన్ని ఎంపిక చేసుకుందాం’’ అని ప్రకటించాడు. ఇంతకుముందు మెగా బ్రదర్ నాగబాబు విసిరిన సవాల్‌ను మంచు విష్ణు పక్కాగా స్వీకరించాడనే అనుకోవాలి. ప్రకాష్ రాజ్‌ను సమర్థిస్తూ మాట్లాడిన నాగబాబు.. మా సొంత భవంతికి మంచు విష్ణు డబ్బు ఇచ్చినా.. స్థలం ఎలా తెస్తాడో చెప్పాలని సవాల్ విసిరాడు. దానికి సమాధానంగానే విష్ణు ఇలా వీడియో రిలీజ్ చేశాడని టాక్.

మా భవనం కోసం ప్రకాష్ రాజ్ తెలంగాణ ప్రభుత్వాన్ని ఎకరం భూమి ఇవ్వాల్సిందిగా కోరతానని అన్నారు. అలాగే మంచు విష్ణు మా భవంతి నిర్మాణానికి అవసరమయ్యే మొత్తం డబ్బు తానే సమకూరుస్తానని ఎవరూ ఇవ్వాల్సిన పనే లేదని శపథం చేశారు. మరి మంచు విష్ణు వీడియోకి రియాక్షన్స్ ఎలా ఉంటాయో చూడాలి. అయితే, వీడియో చివర్లో విష్ణు కన్ను కొట్డంపై నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. 

Also Reda: చిరంజీవి, పీవీ సింధుతో రాధిక ఫొటో.. ఆమె ట్వీట్ చూసి నెటిజనులు ట్రోలింగ్, ఆ తప్పేంటో తెలుసా?

Also Read: బ్రేక్‌టైమ్‌లో గన్ ఎక్కుపెట్టిన పవర్ స్టార్.. ఆ విషయంపై క్లారిటీ ఇచ్చేశారు

Also Read: ఓటీటీలో బాబాయ్ అబ్బాయ్ వెంకీ - రానా సందడి... ఈసారి పూర్తి స్థాయిలో ప్లాన్!

Also Read:ఇప్పటి వరకు బన్నీతో గొడవ పడ్డ ఆ నటుడు ఇకపై చెర్రీతో ఫైట్‌కు రెడీ అవుతాడట!

Continues below advertisement
Sponsored Links by Taboola