ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అనిశ్చితికి మారుపేరైన జట్లలో పంజాబ్ ఒకటి. గత ఏడాది కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఫ్రాంచైజీ పేరును పంజాబ్ కింగ్స్‌గా మార్చారు. కేవలం ఓపెనర్లు, వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ మాత్రమే రాణించడంతో పోరాటం తప్ప విజయాలు మాత్రం తక్కువగా అందుకుంటోంది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ సీజన్ 14 రెండో ఎడిషన్ ప్రారంభం కానుంది. అయితే పంజాబ్ కింగ్స్ జట్టుకు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి.
కరోనా కేసులు రావడంతో మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్ 2021ను యూఏఈ వేదికగా నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానున్న మిగతా మ్యాచ్‌లకు చెన్నై సూపర్ కింగ్స్ ఇదివరకే యూఏఈకి చేరుకోగా, నేడు గత ఏడాది రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ అక్కడ అడుగు పెడుతుంది. పంజాబ్ జట్టు ఈసారైనా కప్పు కొడుతుందా అని ప్రతి సీజన్లో పంజాబ్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఆస్ట్రేలియా క్రికెటర్లు సీజన్ మిగతా మ్యాచ్‌ల నుంచి తప్పుకుంటున్నారు. ఆస్ట్రేలియా క్రికెటర్లు జై రిచర్డ్‌సన్, రిలే మెరిడిత్ ఐపీఎల్ 14 మిగతా సీజన్ కు అందుబాటులో ఉండటం లేదని తమ నిర్ణయాన్ని ప్రకటించారు. యూఏఈకి వెళ్లడానికి తమకు ఇష్టం లేదని ఫ్రాంచైజీకి తెలిపారు.
Also Read: Rafael Nadal: దురదృష్టవశాత్తు ఈ సీజన్ ముగించాల్సి వస్తుంది.. టెన్నిస్ అభిమానులను నిరాశపరిచే ట్వీట్ చేసిన రఫెల్ నాదల్
ఇద్దరు విదేశీ క్రికెటర్లు జట్టుకు దూరమయ్యారనే విషయాన్ని పక్కనపెడితే.. రిచర్డ్‌సన్ కోసం పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రూ.14 కోట్లు వెచ్చించింది. మెరిడిత్ కోసం సైతం రూ.8 కోట్లు ఖర్చు చేసింది. భారీగా ఖర్చు చేసి కొనుగోలు చేసిన ఇద్దరు విదేశీ క్రికెటర్లు సీజన్ మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో ఉండటం లేదని ఫ్రాంచైజీ అధికార ప్రతినిథి వెల్లడించారు. నాథన్ ఇల్లీస్ జట్టులోకి రానున్నాడని తెలుస్తోంది. తన అరంగేట్ర మ్యాచ్‌లోనే హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టి వెలుగులోకి వచ్చాడు. మరో ఆటగాడికి ప్రత్యామ్నాయం కోసం పంజాబ్ కోసం వెతుకుతోంది.
Also Read: IND Vs ENG: ఇంగ్లాండ్ క్రికెటర్ బ్యాటింగ్‌కు వెళ్లకుండా భారత ఆటగాళ్లు అడ్డుకున్నారు.. ఓటమితో షాకింగ్ కథనాలు..
కాగా, ఐపీఎల్ 2021లో 8 మ్యాచ్‌లాడిన పంజాబ్ కింగ్స్ కేవలం 3 విజయాలు సాధించింది. ప్లే ఆఫ్స్ అవకాశాలు సైతం తక్కువగా ఉన్నాయి. మిగతా 6 మ్యాచ్‌లలో కచ్చితంగా 5 విజయాలు సాధిస్తే, తరువాతి దశకు చేరుకుంటుంది. సీఎస్కే ఇదివరకే క్వారంటైన్ ముగించుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. నేడు ఢిల్లీ క్యాపిటల్స్ యూఏఈ చేరుకుని క్వారంటైన్‌లో ఉండనుంది. మిగతా జట్లు సైతం త్వరలోనే యూఏఈ చేరుకుని.. క్వారంటైన్ తరువాత మైదానంలోకి దిగనున్నాయి.