సామాజిక మాధ్యమాల్లో వచ్చే కొన్ని వైరల్ వీడియోలు దిమ్మతిరిగేలా ఉంటాయి. కొన్ని వీడియోలను చూస్తే బయట తిండి తినాలన్నా భయమేస్తుంటుంది. అయితే, వైరల్ అయ్యే కొన్ని ఫోటోలు ఫేక్ అయినా, ఇంకొన్ని వీడియోలు మాత్రం అబద్ధమని కొట్టిపారేయడానికి లేదు. మనం నమ్మలేని నిజంలో అందులో ఉంటుంది. రోజూ రోడ్డు పక్కన తినే తినుబండారాల విషయంలో ఎంతో జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలని చాటే ఒక వీడియో తాజాగా వైరల్ అవుతోంది. ఈ ఘటన అసోంలోని గువాహటిలో జరిగినట్లుగా సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటంటే..


అసోం రాష్ట్రంలోని గువహటి నగరంలో ఓ పానీ పూరీ బండి నిర్వహకుడు చేసిన పని చూస్తే అత్యంత అసహ్యంగా అనిపిస్తోంది. అతి జుగుప్సాకరమైన ఈ వీడియో చూసి నెటిజన్లు బాగా తిట్టుకుంటున్నారు. ఇకపై తాము కూడా బయటి ఆహార పదార్థాలు తినేటప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఆ పానీపూరీ బండి నిర్వహకుడు చేసిన ఘన కార్యం ఏంటో తెలుసా?


Also Read: Hyderabad: సెల్ఫీ తీసుకుంటూ లైవ్‌లో ఉరేసుకున్న వ్యక్తి.. కారణం తెలిసి పోలీసులు షాక్!


నీళ్లలో మూత్రం కలిపి..
గువహటిలో స్ట్రీట్ వెండర్ అయిన ఓ పానీపూరీ నిర్వహకుడు తన మూత్రాన్ని నీటిలో కలిపాడు. యాప్రాన్ వేసుకున్న అతను ఓ మగ్గుతో తన మూత్రాన్ని చాటుగా పట్టి దాన్ని ఏకంగా పానీపూరీ బకెట్‌లో కలిపాడు. ఈ వీడియోను ఎవరో చాటుగా తీసి సామాజిక మాధ్యమాల్లో ఉంచారు.


దీంతో ఈ వీడియో ఆహార శాఖ అధికారులను కూడా చేరింది. వెంటనే అధికారులు స్పందించి సదరు స్ట్రీట్ వెండర్ అయిన పానీపూరీ బండి నిర్వహకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ షాకింగ్ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయిపోతోంది. 






గతంలోనూ ఆహారాన్ని కల్తీ చేసే ఎన్నో వీడియోలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆకుకూరల్ని మురికి నీళ్లతో కడగడం, బ్రేడ్ పిండిని కాళ్లతో కలపడం, పాలలో గేదెలు తాగే కుడితి నీళ్లు కలపడం వంటి ఎన్నో వీడియోలు వచ్చాయి. ఈ వీడియోలు ప్రతిసారి బయటి ఆహారం విషయంలో తీసుకునే జాగ్రత్తల గురించి గట్టిగా మనల్ని హెచ్చరిస్తూనే ఉన్నాయి.


Also Read: Raksha Bandhan: ఆవు పేడతో అద్భుత రాఖీలు.. అబ్బో! వీటిని ట్రై చేస్తే నిజంగా ఎన్ని ఉపయోగాలో..