ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. టీడీపీ శ్రేణులు పెట్రోల్ బంకుల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. అన్ని జిల్లాల్లో టీడీపీ నేతలు మంగళవారం ఉదయం నుంచే ఆందోళన చేపట్టాయి. నెల్లూరు(Nellore) జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు జరిగాయి. దాదాపు అన్ని మండల కేంద్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు నిరసనగా ర్యాలీలు నిర్వహించారు. పెట్రోల్ బంకుల వద్ద బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 


Also Read: గల్లీ బీజేపీ సిల్లీ రాజకీయాలు చేస్తుంది... 40 ఇయర్స్ ఇండస్ట్రీకి ఈ మాత్రం తెలియదా... మంత్రి కొడాలి నాని సైటర్లు


చెప్పుతో కొట్టుకున్న డ్రైవర్


నెల్లూరు జిల్లా రాపూరులో ఓ ఆటో డ్రైవర్ నిరసనలో భాగంగా తమకి బుద్ధి వచ్చిందంటూ చెప్పుతో తనని తానే కొట్టుకుని నిరసన తెలిపాడు. జగన్ ని నమ్మి ఓటేసినందుకు తమ చెప్పుతో తామే కొట్టుకునేలా చేశారన్నారు. భవిష్యత్తులో వైసీపీ ఓటు వేయబోమని చెప్పారు. పెట్రోల్, డీజిల్ రేట్లను(Petrol, Diesel Rates) తగ్గించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఆటో డ్రైవర్లు వీధిన పడ్డారని, డ్రైవర్లకు ఆర్థిక సాయం ఇచ్చినట్టే ఇచ్చి ఇలా పెంచిన ధరలతో వెనక్కి తీసుకోవడం సరికాదన్నారు. 


Also Read: ఎయిడెడ్‌ స్కూళ్ల నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత ! ఏపీ సర్కార్ ఏం చెబుతోంది ? ఏం జరుగుతోంది ?


అక్కడ మినహా అన్ని చోట్ల ఆందోళనలు


అటు కావలిలో కూడా పెట్రోల్ బంకుల వద్ద టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి. కావలి పెట్రోల్ బంకు వద్ద బ్యానర్లు పట్టుకుని టీడీపీ నేతలు ఆందోళనకు దిగారు. పెట్రోల్ పై 16, డీజిల్ పై 17 రూపాయలు వ్యాట్(VAT) తగ్గించాలని డిమాండ్ చేశారు టీడీపీ నేతలు. రేట్లు తగ్గించకపోతే సీఎం జగన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల టీడీపీ నేతలు ఆందోళనలు చేపట్టారు. 


Also Read: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల సందడి.. అధికార పార్టీ నేతలకు పదవుల పండుగ !


చిత్తూరు జిల్లా వ్యాప్తంగా


పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి వైసీపీ ప్రభుత్వం ప్రజలపై భారం మోపిందని టీడీపీ మంగళవారం చిత్తూరులో నిరసలు చేపట్టాయి. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు పంచారు. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ మేయర్ కటారి హేమలత మాట్లాడుతూ ప్రజలకు అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇచ్చి అధికారంలోకి రాగానే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధరలు పెంచి ప్రజలపై  భారాలు మోపడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వంలో సామాన్య నిరుపేదలు బతుకులు దుర్భరంగా మారిందన్నారు.  వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు(Diesel Rates) తగ్గించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు ఉద్ధృతం చేస్తామని చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలత హెచ్చరించారు.


Also Read: ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు... ఈ నెల 18 నుంచి సభాపర్వం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి