Breaking News Live:  పిచ్చికుక్క దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 21 Nov 2021 08:23 PM
పిచ్చికుక్క దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలికపై పిచ్చి కుక్క దాడి చేసి దారుణంగా కరిచింది. ఒక్కసారిగా పాప కేకలు వేయడంతో తల్లిదండ్రులు, స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే కుక్క విచక్షణారహితంగా గాయపరిచింది. పిచ్చికుక్క కోసం గ్రామస్తులు వెదుకుతున్నారు. అదే గ్రామంలో ఓ లేగదూడను, నాలుగు పందెం కోడిపుంజులను పిచ్చి కుక్క గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయాల పాలైన చిన్నారిని అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుక్క దాడిలో  తీవ్రగాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. 

పిచ్చికుక్క దాడిలో చిన్నారికి తీవ్రగాయాలు

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలికపై పిచ్చి కుక్క దాడి చేసి దారుణంగా కరిచింది. ఒక్కసారిగా పాప కేకలు వేయడంతో తల్లిదండ్రులు, స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే కుక్క విచక్షణారహితంగా గాయపరిచింది. పిచ్చికుక్క కోసం గ్రామస్తులు వెదుకుతున్నారు. అదే గ్రామంలో ఓ లేగదూడను, నాలుగు పందెం కోడిపుంజులను పిచ్చి కుక్క గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయాల పాలైన చిన్నారిని అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుక్క దాడిలో  తీవ్రగాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. 

పిచ్చికుక్క దాడిలో చిన్నారి తీవ్రగాయాలు

తూర్పుగోదావరి జిల్లా అల్లవరం మండలం సామంతకుర్రు గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఆరుబయట ఆడుకుంటున్న ఓ బాలికపై పిచ్చి కుక్క దాడి చేసి దారుణంగా కరిచింది. ఒక్కసారిగా పాప కేకలు వేయడంతో తల్లిదండ్రులు, స్థానికులు వచ్చి చూసేసరికి అప్పటికే కుక్క విచక్షణారహితంగా గాయపరిచింది. పిచ్చికుక్క కోసం గ్రామస్తులు వెదుకుతున్నారు. అదే గ్రామంలో ఓ లేగదూడను, నాలుగు పందెం కోడిపుంజులను పిచ్చి కుక్క గాయపరిచినట్లు గ్రామస్తులు తెలిపారు. పిచ్చికుక్క దాడిలో తీవ్రంగా గాయాల పాలైన చిన్నారిని అమలాపురం ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాప ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని కుక్క దాడిలో  తీవ్రగాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. 

రామగుండంలో దారుణం... ట్రైన్ కు ఎదురెళ్లి యువకుడు ఆత్మహత్య

ప్రయాణీకులు చూస్తుండగానే ఓ యువకుడు రైలుకు ఎదురువెళ్లి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పెద్దపల్లి జిల్లా రామగుండం రైల్వేస్టేషన్ లో జరిగింది. ఒడిశా రాష్ట్రం కైరాకు చెందిన సంజయ్ కుమార్ తన తాతతో కలిసి హైదరాబాద్ లోని ఓ హార్డ్ వేర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా మతిస్థిమితం లేకుండా ప్రవర్తిస్తున్నా సంజయ్ కు కుటుంబ సభ్యులు వైద్య చికిత్స చేయిస్తున్నట్లు జీఆర్పీహెడ్ కానిస్టేబుల్ సురేశ్ తెలిపారు. గత కొన్ని రోజులుగా మతిస్థిమితం లేకుండా తిరుగుతున్న సంజయ్ రామగుండం రైల్వేస్టేషన్ కు వచ్చి న్యూ దిల్లీ నుంచి బెంగుళూరుకు వెళ్తున్న రాజధాని సూపర్‌ఫాస్ట్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. 

టీఆర్ఎస్ స్థానిక ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారు.!

తెలంగాణ స్థానిక కోటా ఎమ్మెల్సీలకు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. 12 మంది జాబితాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంకా టీఆర్ఎస్ ఈ జాబితాను అధికారికంగా ప్రకటించలేదు. 



  • వరంగల్- పోచంపల్లి శ్రీనివాస్,

  • కరీంనగర్- ఎల్ రమణ, భాను ప్రసాద్, 

  • ఆదిలాబాద్- దండె విఠల్,

  • మెదక్ - యాదవ్ రెడ్డి

  • ఖమ్మం -తాత మధు

  • మహబూబ్ నగర్- గాయకుడు సాయి చంద్ , కసిరెడ్డి నారాయణ రెడ్డి

  • నల్గొండ-సి కోటిరెడ్డి

  • రంగారెడ్డి - శంభీపూర్‌రాజు, పట్నం మహేందర్ రెడ్డి

  • నిజామాబాద్- కల్వకుంట్ల కవిత లేదా ఆకుల లలిత

గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా

ఖమ్మం జిల్లా వైరాలో గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు తగ్గుతున్నాయనుకున్నా సమయంలోనే మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కేసులు మళ్లీ నమోదు కావడంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో విద్యార్థులు 2 రోజులుగా కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీనిని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపాల్ కొంతమంది విద్యార్థులకు  కరోనా పరీక్షలు చేయించారు. వారికి 13 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గురుకులంలోని మిగతా విద్యార్థులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందని సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గురుకుల పాఠశాలకు చేరుకుంటున్నారు.

ప్రభుత్వ చిత్తశుద్ధితోనే తెలంగాణ మున్సిపాలిటీలకు అవార్డులు.. కేటీఆర్

మా ప్రభుత్వ చిత్తశుద్ధితోనే తెలంగాణ పురపాలికలకు  జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్న పురపాలక సంఘాల ప్రజాప్రతినిధులు, అధికారులకు మంత్రి కేటీఆర్ అభినందించారు. వీరితో ఢిల్లీలో మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ొ
స్వచ్ఛ సర్వేక్షన్ 2021 జాతీయస్థాయిలో అవార్డు సాధించిన పురపాలికల మేయర్లు, చైర్ పర్సన్లు,  కమిషనర్లు, పురపాలక శాఖ ఉన్నతాధికారులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్న అనంతరం వీరందరితో ఈ రోజు ఢిల్లీలోని గౌరవ ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నివాసంలో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ పట్టణాలకు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడం పట్ల చైర్ పర్సన్ లకు, పురపాలక శాఖ అధికారులకు మంత్రి అభినందనలు తెలిపారు. 

సీఎం కేసీఆర్ దిల్లీ టూర్...

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ పయనమయ్యారు. ప్రత్యేక విమానంలో ఆయన దిల్లీకి వెళ్తున్నారు. ఆయన వెంట మంత్రులు హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, ఎంపీలు కేకే, నామా నాగేశ్వరరావు, సంతోష్ కుమార్ ఉన్నారు. ధాన్యం కొలుగోలుపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్న సీఎం కేసీఆర్.. ఈ టూర్ లో కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది.  

 చంపావతి నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతు

విజయనగరం జిల్లా గజపతినగరం మండలం తుమ్మికాపల్లి గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. చంపావతి నదిలోకి స్నానాలకు వెళ్లిన ఆరుగురు విద్యార్థుల్లో ఇద్దరు గల్లంతయ్యారు. ఎమ్.కొత్తవలస గ్రామానికి చెందిన గెడ్డపు.భార్గవ్(15), గొర్లె లోకేష్(15) నదిలో గల్లంతు అయినట్లు తెలుస్తోంది. ఘటనాస్థలం వద్ద పోలీసులు, గ్రామస్తులు గాలింపు చర్యలు చేపట్టారు. విషయం తెలిసి కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. 

ఓ వివాహ వేడుకలో కలుసుకున్న కేసీఆర్, వైఎస్ జగన్

తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, వైఎస్ జగన్ ఓ వివాహ కార్యక్రమంలో కలిశారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి మనవరాలి పెళ్లి హైదరాబాద్ లో జరగగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ అదే సమయానికి అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు సీఎంలు కలిసి పక్కపక్కనే కూర్చుని నవ్వుతూ మాట్లాడుకున్నారు. అనంతరం కలిసి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదం నెలకొన్న సమయంలో ఇలా ఇద్దరు సీఎంలు వివాహ కార్యక్రమంలో కలవటం, సరదాగా గడపటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. బాయిలర్ పేలి మంటలు

యాడికి మండలం బోయరెడ్డి పల్లి వద్ద ఉన్న పెన్నా సిమెంట్ ఫ్యాక్టరీలోని కోల్ మిల్ బాయిలర్ పేలి మంటలు చెలరేగుతున్నాయి. ఈ సమయం కావడంతో అక్కడ ఎవరూ లేకపోవడం తో ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

కూలిన పాపాగ్ని నదిపై వంతెన

కడప జిల్లాలో విపరీతంగా కురుస్తున్న వర్షాలకు ఓ వంతెన కుప్పకూలింది. జిల్లాలోని కమలాపురంలో భారీగా ప్రవహిస్తున్న పాపాగ్ని నదిపై వంతెన కూలిపోయింది. అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన జరగడంతో రాకపోకలకు తీవ్రమైన అంతరాయం ఏర్పడుతోంది. దాదాపు ఏడు మీటర్లకు పైగా బ్రిడ్జి కూలడంతో అవతలే వాహనాలను నిలిపివేశారు. దీంతో వాహనాలను మరోవైపు నుంచి మళ్లిస్తున్నారు.

సీఎం కేసీఆర్ భార్యకు నేడు ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు

సీఎం కేసీఆర్‌ భార్య శోభ ఆదివారం ఢిల్లీ ఎయిమ్స్‌ ఆస్పత్రిలో నేడు వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. కేటీఆర్‌తో పాటు ఆమె ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఆదివారం సీఎం కేసీఆర్ కూడా ఢిల్లీ వెళ్లనున్న సంగతి తెలిసిందే. ధాన్యం కొనుగోలు, నీటి వాటాలు తేల్చాలంటూ కేంద్రంతో చర్చించేందుకు సీఎం కూడా ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. కోవిడ్‌–19 మహమ్మారి బారినపడిన తర్వాత శోభ ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గులేరియా నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్లు సమాచారం. కేసీఆర్‌ సైతం తన సతీమణితో కలిసి ఆస్పత్రికి వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

కడపలో కూలిన పాత భవనం

కడప నగరంలోని రమేష్ థియేటర్ సమీపంలో వర్షానికి పాత బిల్డింగ్ దెబ్బతింది. అర్ధరాత్రి సమయంలో మూడు అంతస్తుల భవనం పాక్షికంగా కూలింది. రెస్క్యూ సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేశారు. రెండో అంతస్తులో బయటకు రాలేక ఇరుక్కుపోయి తల్లి కూతురు ఇబ్బంది పడ్డారు. తంశ్రీ అనే చిన్నారితో పాటు తల్లి చంద్రికను సురక్షితంగా అగ్నిమాపక సిబ్బంది కాపాడారు. కిటికీని కట్ చేసి ఇద్దరిని క్షేమంగా అగ్నిమాపక సిబ్బంది బయటకు తెచ్చారు.

Background

టీడీపీ నేత కూన రవికుమార్‌ను అర్ధరాత్రి పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళంలోని ఆయన నివాసం వద్ద ఆయనను అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ నిరసనల సందర్భంగా నిన్న కూన రవికుమార్‌ను పోలీసులు గృహానిర్బంధం చేశారు. ఈ సందర్భంగా పోలీసులు, రవి మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో కూన రవికుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. 2 టౌన్ సీఐ ప్రసాదరావుపై దుర్భాశలాడారంటూ కేసు నమోదు చేశారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో పెద్ద ఎత్తున రవి నివాసానికి చేరుకున్న పోలీసులు, తలుపులు పగులగొట్టి లోనికి ప్రవేశించారు. అనంతరం భారీ బందోబస్తు మధ్య కూన రవికుమార్‌ను ఎచ్చెర్ల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.


వరదలో చిక్కుకున్న సినిమా టీమ్


నెల్లూరు జిల్లా కోవూరు సమీపంలో షుగర్ ఫ్యాక్టరీ వద్ద షూటింగ్ కోసం వచ్చిన సినిమా బృందం వరద నీటిలో చిక్కుకుంది. నటుడు నవీన్‌ కుమార్‌ ..  వరదల్లో  చిక్కుకున్న తమకు సహాయం అందించాలని కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. ‘3 నెలల షూటింగ్ కోసం కోవూరు వచ్చాం. కోవూరు  బ్రిడ్జి సమీపంలోని ఓ భవనంలో  నాతో పాటు  30 మంది వరకు ఉన్నాం. మేం ఉన్న ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుంది.  కనీసం తాగునీరు తెచ్చుకునేందుకు కూడా అవకాశం లేదు. దయచేసి సహాయం చేయండి’ అని విజ్ఞప్తి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


తెగిన జాతీయ రహదారి


భారీ వర్షాలకు పెన్నా నది పోటెత్తడంతో వరదనీరు నెల్లూరుపై ప్రతాపం చూపించింది. ఇప్పటికే నెల్లూరు నగరం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఈ క్రమంలో వరదనీరు రోడ్లపైకి పోటెత్తింది. ఈ ప్రవాహ ఉధృతికి ఏకంగా హైవేలు సైతం కొట్టుకుపోతున్నాయి. ఇప్పటికే నెల్లూరు-ముంబయి హైవే వరద నీటిలో మునిగిపోగా.. తాజాగా నెల్లూరు - విజయవాడ రహదారి మార్గానికి ఏకంగా గండి పడింది. 


పెన్నా నదిపై ఉన్న బ్రిడ్జ్ దాటిన తర్వాత కోవూరు సమీపంలో నెల్లూరు - విజయవాడ హైవే కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అటు నెల్లూరు - గూడూరు మధ్య కూడా వరద నీటికి రాకపోకలు ఆలస్యమవుతున్నాయి. ఎక్కడి వాహనాలు అక్కడే హైవేపై నిలిచిపోయాయి. ఇటు నెల్లూరు - విజయవాడ మార్గం కూడా ఇప్పుడు కొట్టుకుపోవడంతో వాహనాలు కిలో మీటర్ల మేర బారులు తీరి నిలిచిపోయాయి.


నెల్లూరు - కావలి - ఒంగోలు వైపు వెళ్లే 16వ నెంబర్ జాతీయ రహదారి పైకి శనివారం వరదనీరు వచ్చి చేరింది. రాత్రి ఒకటిన్నర గంటల సమయానికి నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రోడ్డుకి గండి పడింది. అప్పటికే అప్రమత్తమైన పోలీసులు ఎక్కడికక్కడ వాహనాలను నిలిపివేశారు. దీంతో రోడ్డుకి ఇరువైపులా వాహనాలు బారులు తీరాయి.


ప్రత్యామ్నాయం లేదు.. 
నెల్లూరు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు ఇప్పుడు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డారు అధికారులు. నెల్లూరు నగరం పైనుంచి కోవూరు చేరుకునే అవకాశం ఉంది. అయితే వాహనాలతో నెల్లూరు నగరంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే అధికారులు ఏం చేయాలా అని తలలు పట్టుకున్నారు. మరోవైపు పామూరు, వింజమూరు నుంటి ట్రాఫిక్ మళ్లించాలనుకుంటున్నా.. నెల్లూరు - ముంబయి హైవేపై వరదనీరు భారీగా ఉంది. నీటి మట్టం ఇంకా పూర్తి స్థాయిలో తగ్గలేదు. 


రహదారికి మరమ్మతులు చేయాలన్నా కూడా ఇప్పుడల్లా సాధ్యమయ్యేట్టు కనిపించడంలేదు. గండి పడిన చోట వరద తీవ్ర ఉధృతంగా ఉంది. దీంతో మరమ్మతులకు అవకాశం లేదు. మరమ్మతులకు కనీసం మరో 48 గంటలు సమయం పడుతుందని చెబుతున్నారు అధికారులు. అప్పటి వరకు హైవేపై ప్రయాణికులు అల్లాడిపోవాల్సిందే. 


ఇక సోమశిల నుంచి పెన్నా నదికి విడుదల చేసే నీటి పరిమాణం 3 లక్షల క్యూసెక్కులకు తగ్గడంతో క్రమక్రమంగా పెన్నా నది శాంతిస్తోంది. అయితే ఇప్పటికే నీరు నిలబడిపోయిన లోతట్టు ప్రాంతాల ప్రజలు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు రహదారులు సైతం తెగిపోవడంతో వాహనాలు ఆగిపోయి పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.