Breaking News Live: గన్నవరం విమానాశ్రయానికి మెగాస్టార్ చిరంజీవి.. కాసేపట్లో సీఎంతో లంచ్ మీటింగ్

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

ABP Desam Last Updated: 13 Jan 2022 12:42 PM
గన్నవరం విమానాశ్రయానికి చిరంజీవి

* గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న మెగాస్టార్ చిరంజీవి


* తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయానికి బయల్దేరిన చిరు


* మరి కొద్దిసేపట్లో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో లంచ్ మీటింగ్


* సీఎం ఆహ్వానం మేరకు సినీ పరిశ్రమ పెద్దగా వచ్చాను: చిరంజీవి

శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం బారులు తీరిన జనం

కలియుగ దైవం,  సకల చరాచర సృష్టికర్త శ్రీమన్నారాయణుడి దర్శనం కోసం భక్తులు అన్ని ఆలయాల ముందు బారులు తీరారు. అనంతపురం జిల్లా గుంతకల్లు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వేకువజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తజనం తండోపతండాలుగా తరలివచ్చారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణలతోనూ , విశేష పుష్పాల అలంకరణతో సుందరంగా తీర్చిదిద్దారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాట్టును దేశం నలుమూలల నుంచి తెప్పించిన విశేష పుష్పాలతో అలంకరించి భక్తులకు ఉత్తర ద్వారం ద్వార దర్శనం కల్పిస్తున్నారు.

కాజీపేటలో నర్సింగ్ విద్యార్థుల నిరసన

* తరగతులు బహిష్కరించి రోడ్డుపై బైఠాయించిన నర్సింగ్ విద్యార్థులు


* కళాశాలలో విద్యార్థులకు కరోనా సోకుతున్న పట్టించుకోవడం లేదని ఆందోళన


* కొవిడ్ వచ్చిన విద్యార్థులను హాస్టళ్లలో క్వారంటైన్ చేస్తున్నారని ఆవేదన


* వైరస్ సోకిన విద్యార్థులకు సరైన పోషకాహారం అందించడం లేదు


* ఆందోళన చెందుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు


* ఫాతిమా నగర్ దర్గా రోడ్ నర్సింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు విద్యార్థుల ఆందోళన

భద్రాచలంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నిరడంబరంగా జరిగింది. కొవిడే నిబంధనల మేరకు భక్తులకి అనుమతి ఇవ్వకపోవడంతో  వీవీఐపీలు పోలీసు సిబ్బందితోనే, ఈ సంవత్సరం ఉత్తర ద్వారా దర్శనం జరిపారు. దక్షిణాది అయోధ్య భద్రాచలంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరగడం కోసం కొన్ని లక్షలు ఖర్చు చేసి కేసులు సంఖ్య పెరుగుతుంది అని షాకుతో ఎవరికీ అనుమతి ఇవ్వకపోవడంతో ప్రభుత్వంపై సామాన్య భక్తులు పెదవి విరిచారు. పక్క జిల్లాలో ఉన్నాం మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నా ఇక్కడ మాత్రం నిబంధనలు ఎందుకో అర్థం కావడం లేదని హిందూ సంఘాలు మండిపడ్డాయి. ఉత్తర ద్వార నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి ఈ సారి స్ధానిక భక్తులెవర్నీ కూడా అనుమతించకపోవడంతో వైదిక సిబ్బంది తోనే కార్యక్రమం నిర్వహించారు. ఉదయం ఆరుగంటల వరకు ఉత్తరద్వార దర్శనం కొనసాగింది. అనంతరం గరుడ వాహనంపై సీతాలక్ష్మణ సమేత రాములవారు గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిస్తున్నారు.

సింహాచలం: సింహాద్రి అప్పన్న వైకుంఠవాసునిగా భక్తులకు దర్శనం

సింహాచలం వైకుంఠ ఏకాదశి సందర్భంగా సింహాద్రి అప్పన్న గురువారం ఉత్తర ద్వారంలో వైకుంఠవాసునిగా భక్తులకు దర్శనమిచ్చారు.
అనువంశిక ధర్మకర్తకు తొలి దర్శనం కల్పించిన అనంతరం ఉదయం ఐదు నుంచి పది గంటల వరకూ సామాన్య భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించేందుకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ఉత్తర ద్వారాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ప్రత్యేక క్యూలైన్లు సిద్ధమయ్యాయి. ఉత్తర ద్వార దర్శనానికి సుమారు 15 వేల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేయగా.. ఆ సంఖ్య దాటింది. వైకుంఠ ఏకాదశి ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నిత్య కల్యాణంతో సహా ఇతర అన్ని రకాల ఆర్జిత సేవలు నిలివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

హన్మకొండలో ఘోర రోడ్డు ప్రమాదం

హన్మకొండలోని బాలసముద్రంలో రోడ్డు ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున బైక్ ను ఢీకొట్టి జీపు అదుపు తప్పి ప్రక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, పలువురికి తీవ్రగాయాలు కావడంతో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Background

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల క్షేత్రం గోవింద నామ స్మరణలతో మారుమ్రోగుతోంది. ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల నుంచే ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభమయ్యాయి. పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణతో పాటు ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, ఇతర న్యాయమూర్తులు స్వామివారిని దర్శించుకున్న వారిలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులు నారాయణ స్వామి, వెల్లంపల్లె శ్రీనివాస్, గౌతం రెడ్డి, గుమ్మనూరు జయరాం, అనిల్‌ కుమార్ యాదవ్, అవంతి శ్రీనివాస్, అప్పల రాజు, ఆదిమూలం సురేష్,‌ బాలినేని శ్రీనివాస్, వేణుగోపాల్ కృష్ణలు కుటుంబ సభ్యులతో కలిసి వైకుంఠ ద్వారం గుండా ఆలయ ప్రవేశం చేసి స్వామి వారి ఆశీస్సులు పొంది మొక్కులు చెల్లించుకున్నారు.


వైకుంఠ ఏకాదశి‌ పర్వదినం నాడు తిరుమల శ్రీవారిని‌ పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వేకువ జామున వైకుంఠ ద్వారం గుండా కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి టీఎస్. దినేష్ కుమార్, కర్ణాటక సీజే రూతూ రాజ్ అవస్ధీ, ఏపీ హైకోర్టు సీజే ప్రశాంత్ కుమార్ మిశ్రా, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, వైసీపి ఎమ్మెల్యే ‌చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, నగిరి ఎమ్మెల్యే ఆర్.కే.రోజా, బీజేపీ ఎంపీ సీఎం రమేష్, సినీ డైరెక్టర్లు మారుతీ, తిరుమల కిషోర్, లక్ష్మీ‌ పార్వతీ, ఎంవీవీ సత్యనారాయణ, వైసీపీ ఎంపీ‌ మార్గానీ భరత్,‌ గోరంట్ల మాధవ్ కుటుంబ సభ్యులతో కలిసి‌ స్వామి వారి‌ సేవలో పాల్గొని‌ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.


తెలంగాణ మంత్రులు కూడా..
వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు తెలంగాణ ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారు జామున రెండు గంటలకు ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కావడంతో తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్, బీజేపీ నేత డీకే అరుణ, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, బీజేపీ నేత లక్ష్మారెడ్డి, సునీత లక్ష్మీ రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే శంకర్ నాయక్, మల్లారెడ్డిలు వేర్వేరుగా వైకుంఠ ద్వార ప్రవేశం చేసి స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వదం అందించగా.. ఆలయ అధికారులు‌ పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.