Breaking News Live: కృష్ణా జిల్లా మున్నేరు ప్రాంతంలో ఐదుగురు పిల్లలు గల్లంతు....!
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.
కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామం వద్ద మున్నేరులో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసున్న ఐదుగురు పిల్లలు సోమవారం మధ్యాహ్నం మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పిల్లల బట్టలు, వారి సైకిళ్లు మున్నేరు ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్తుల కూడా మున్నేరు పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు. పోలీసులకు సమాచారం అందించగా... సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారు చరణ్, బాల యేసు, అజయ్, రాకేష్, సనిగా పోలీసులు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు ఘటనాస్థలికి చేరుకుని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. మరోవైపు ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు సైతం కరోనా బారిన పడుతున్నారు. కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. నీతిశ్ కుమార్ కు వైరస్ సోకినట్టు సీఎం ఆఫీస్ అధికారులు వెల్లడించారు.
రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. తనను కలిసిన వారు టెస్టులు చేయించుకోవాలని ఆయన ట్వీట్ చేశారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు.
సినిమా థియేటర్లలో టికెట్ల ధరలపై ఇటీవల ట్విట్టర్ లో ప్రశ్నించిన దర్శకుడు రాంగోపాల్‌వర్మ.. మంత్రి పేర్ని నానితో భేటీ అయ్యారు. సినిమా టికెట్ల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించారు. అయితే.. టికెట్ల ధరలపై తన అభిప్రాయం చెప్పడానికే తాను వచ్చానని ఆర్జీవీ ముందుగానే చెప్పారు. ఇతరులు చేసిన వ్యాఖ్యలపై తాను స్పందించనని స్పష్టం చేశారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. సినీ ఇండస్ట్రీ కోణంలో ప్రభుత్వం అర్తం చేసుకోలేదని వర్మ అన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు కొందరికీ నచ్చపోవచ్చని.. ప్రజల కోసం ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయన్నారు. సినీ ఇండస్ట్రీ విషయంలోనూ ఇలానే జరిగిందని.. అయితే.. ప్రభుత్వం ఇండస్ట్రీ కోణంలో ఆలోచించలేదని చెప్పారు.
ఖమ్మం జిల్లా..
ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్ సూసైడ్ చేసుకున్నాడు. 2020లో ఏ.ఆర్ కానిస్టేబుల్ గా నియమితుడయ్యాడు. తరువాత కొత్తగూడెం పోలీస్ స్పెషల్ పార్టీలోలో విధులు. పోలీస్ శాఖలో బదిలీలో ప్రక్రియలో భాగంగా ములుగు జిల్లా కు బదిలీ అయింది. ఈ నెల 8వ తారీఖు అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో ఖమ్మం పట్టణంలోని ఒక ప్రైవేట్ లాడ్జిలో రూమ్ తీసుకున్నాడు.
రూమ్ క్లీనింగ్ కోసం వచ్చిన సిబ్బంది డోర్ కొట్టడంతో ఎంతసేపటికి ఓపెన్ చేయకపోవడంతో పోలీసులకు సమాచారం అందించిన లాడ్జి యాజమాన్యం.
పోలీసులు డోర్ ఓపెన్ చేసి చూడక ఉరి వేసుకుని చనిపోయిన ఏఆర్ కానిస్టేబుల్ అశోక్ కుమార్..
సత్తుపల్లి నియోజకవర్గంలోని యజ్ఞనారాయణపురం అశోక్ కుమార్ సొంత గ్రామం..
ఈరోజు సొంత గ్రామంలో అశోక్ కుమార్ నిశ్చితార్థం జరగాల్సి ఉంది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన అశోక్ కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు..
317 జీవో కారణంగా మనస్థాపానికిలోనై ఆత్మహత్య చేసుకున్న బీంగల్ కు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సరస్వతి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కారును పోలీసులు ఛేజ్ చేసి కమ్మర్ పల్లి వద్ద అడ్డుకుని, అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. - రేవంత్ రెడ్డి
ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష నేతలు కేసీఆర్ కు దొంగల్లా కనిపిస్తున్నారా? పోలీసులు సైతం విపక్ష నేతలను వెంటాడి వెంటాడి అరెస్టు చేయడాన్ని ఎలా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడం ఏమైనా నేరమా!? ప్రతిపక్ష నేతలు ప్రభుత్వ తప్పులను ప్రశ్నించడం ప్రజలు, రాజ్యాంగం ఇచ్చిన హక్కు. కేసీఆర్ దుర్మార్గ పాలన హద్దులు మీరుతోంది. మూల్యం తప్పక చల్లించుకుంటారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సంచలనాలకు కేరాఫ్‌గా ఉండే రామ్‌గోపాల్ వర్మ మంత్రి పేర్ని నానితో సమావేశమయ్యారు. ఉదయం ఇండిగో విమానంలో గన్నవరం చేరుకున్నా ఆర్జీవీ రోడ్డు మార్గం ద్వారా పేర్ని నాని నివాసానికి చేరుకున్నారు. గత కొంత కాలంగా ఏపీలో టికెట్ అంశంపై రామ్‌గోపాల్ వర్మ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వం, ఆర్జీవీ మధ్య సోషల్ మీడియా వేదికగా పెద్ద వార్ నడిచింది. చివరకు ఆర్జీవీతో చర్చలకు మంత్రి పేర్ని నాని అంగీకరించి సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు స్టార్ట్ చేశారు.
పంజాబ్‌లో ప్రధాని మోదీ కాన్వాయ్‌ని అడ్డుకోవడంపై దేశవ్యాప్తంగా బీజేపీ నిరసనలు చేపట్టింది. ఇందులో భాగంగా చైతన్యపురిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మౌనదీక్షకు దిగారు. ముందుగా అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు బండి సంజయ్ నివాళులర్పించి దీక్షలో పాల్గొన్నారు. మరోవైపు బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు అంబేద్కర్ విగ్రహాల వద్ద మౌన దీక్ష చేయనున్నారు.
కొత్తగూడెం - కారుకొండ రామవరం రోడ్డు మార్గంమధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోరుకొండ గుట్ట దగ్గర కారుకొండ నుంచి అటుగా వెళ్తున్న ఆటోను కొత్తగూడెం నుండి అతి వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న కారుకొండ రామవరం వాసి ఎనగంటి ధనమ్మ మరో వ్యక్తి కొత్త గూడెం మేదర బస్తీకి చెందిన ఆటోడ్రైవర్ అక్కడికక్కడే చనిపోయారు.
ప్రొబేషనరీ ప్రకటనపై గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఉద్యోగ సంఘాల నేతలతో ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ సోమవారం మధ్యాహ్నం 3.30 గంటలకు విజయవాడలోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ కార్యాలయంలో కానీ, లేదంటే రాష్ట్ర సచివాలయంలో కానీ ఈ సమావేశం ఉంటుందని అధికారులు తెలిపారు.
* చిత్తూరు జిల్లా మొలకల చెరువు మండలంలో అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం..
* నిలిచి ఉన్న లారీని ఢీ కొన్న 108 వాహనం
* ఈ ప్రమాదంలో ఒకరి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు..
* మృతి చెందిన వ్యక్తి 108 లోని EMT రాజేష్ గా గుర్తించిన పోలీసులు..
* పైలట్ షామీర్ భాషాకు, వాహనంలోని ప్రయాణిస్తున్న రోగులకు గాయాలు..
* మొలకలచెరువు నుంచి మదనపల్లెకు వెళుతుండగా ఘటన..
* గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలింపు..
* కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మొలకలచెరువు పోలీసులు..
హైదరాబాద్ శివారులో కోకాపేటలో దారుణం వెలుగుచూసింది. కోకాపేటలోని సెవెన్ హిల్స్ వద్ద ఓ యువతి శవం కనిపించింది. నిర్మానుష్య ప్రాంతంలో నగ్నంగా ఆమె మృత దేహం పడి ఉన్నట్లుగా స్థానికులు గుర్తించారు. వెంటనే ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
* కర్నూలు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కరోనా కలకలం
* 50 మంది వైద్య విద్యార్థులకు కరోనా పరిక్షలు నిర్వహించిన సిబ్బంది
* ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న 11 మందికి, నలుగురు హౌస్ సర్జన్‌లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ
* జీజీహెచ్ పెయింగ్ బ్లాక్ లో చికిత్స పొందుతున్న బాధితులు
* మరో 40 మంది వైద్య విద్యార్థుల నుంచి శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపిన వైద్య సిబ్బంది
కామారెడ్డి జిల్లా బీర్కూర్ పోలీస్ స్టేషన్ లో కరోనా కలకలం రేపుతోంది. స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న 15 మంది పోలీసులకు ప్రభుత్వ ఆస్పత్రిలో ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా అందులో ఐదుగురికి పాజిటివ్ వచ్చినట్లు ఆస్పత్రి సిబ్బంది తెలిపారు. మరికొంత మంది సిబ్బంది పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది. ప్రజలు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి జాగ్రత్తగా ఉండాలని ఆస్పత్రి సిబ్బంది తెలిపారు.
Background
నేడు ఖమ్మం జిల్లాలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వారు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు నగరంలోని మామిళ్లగూడెం కూరగాయల మార్కెట్‌లో రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొంటారు. అనంతరం సత్తుపల్లి మండలం నారాయణపురంలో రైతుబంధు వారోత్సవాల్లో పాల్గొంటారు. ఆ తర్వాత కల్లూరు మండలం చెన్నూరులో ప్రాథమిక సహకార సంఘం భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం తల్లాడలో రైతు వేదికను ప్రారంభిస్తారు.
ఆ టికెట్లు ముందుగానే..
వైకుంఠ ఏకాదశి టోకెన్ల కోసం తిరుపతిలో స్థానికులు క్యూ కట్టారు. వందలాది మంది క్యూలైన్లలోకి ప్రవేశించడంతో టీటీడీ రేపు మంజూరు చేయాల్సిన టోకెన్లను ఈరోజే అందిస్తోంది. ప్రతి రోజు 5 వేల టోకెన్ల చొప్పున పది రోజుల టోకెన్లను ఒకేసారి మంజూరు చేస్తోంది. నగరంలోని ఐదు కేంద్రాల్లో టోకెన్లను అందిస్తున్నారు. తిరుపతిలోని రామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లే, బైరాగిపట్టేడ, మున్సిపల్ ఆఫీస్, సత్యనారాయణ పురం టీటీడీ సృవదర్శనం టోకెన్లు జారీ చేసింది. టిక్కెట్ల జారీ కేంద్రాల్లో స్ధానికులు మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలా, టీటీడీ అధికారులు పోలీసులు చర్యలు చేపట్టారు.
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల శ్రీవారిని తెలంగాణ ఎమ్మెల్యే మైనంపల్లె హనుమంతరావు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
పెట్రోల్, డీజిల్ ధరలు
హైదరాబాద్‌లో పెట్రోల్ డీజిల్ ధరలు గత కొద్ది రోజులుగా నిలకడగానే ఉంటున్నాయి. నేడు కూడా పెట్రోల్ ధర లీటరుకు రూ.108.20గా.. డీజిల్ ధర లీటరుకు రూ.94.62 గా నిలకడగానే కొనసాగుతోంది. ఇక వరంగల్‌లోనూ గత ఐదు రోజులుగా పెట్రోల్ ధరలు స్థిరంగానే ఉంటున్నాయి. నేడు (జనవరి 10) కూడా పాత ధరలే కొనసాగుతున్నాయి. పెట్రోల్ రూ.107.69 గా ఉండగా.. డీజిల్ ధర కూడా అలాగే రూ.94.14 గా కొనసాగుతోంది. వరంగల్ రూరల్ జిల్లాలో సైతం ఇవే ఇంధన ధరలు కొనసాగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన ధరలు ఇలా..
విజయవాడ మార్కెట్‌లో పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.0.19 పైసలు పెరిగి రూ.110.48గా ఉంది. డీజిల్ ధర బెజవాడలో రూ.0.20 పైసలు పెరిగి రూ.96.56 గా ఉంది.
బంగారం ధరలు
ఇవాళ హైదరాబాద్ మార్కెట్‌లో రూ.44,610 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.48,660 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో కిలో రూ.64,600గా ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఇక విశాఖపట్నం మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.44,610 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.48,660గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.64,600 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర తగ్గింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.44,610 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.48,660గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.64,600గా ఉంది.
- - - - - - - - - Advertisement - - - - - - - - -