ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 32,036 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 186 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,448కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 191 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,56,979 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,149 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






Also Read: దేశంలో నాలుగో ఒమిక్రాన్ కేసు... మహారాష్ట్రలో తొలి కేసు... దక్షిణాఫ్రికా నుంచి ముంబయి వచ్చిన వ్యక్తికి పాజిటివ్


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,576కి చేరింది. గడచిన 24 గంటల్లో 191 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,149 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,448కు చేరింది. 


Also Read:  దేశంలో మూడో ఒమిక్రాన్ కేసు... జింబాబ్వే నుంచి గుజరాత్ వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్ లక్షణాలు


తెలంగాణలో 213 కేసులు


తెలంగాణలో కోవిడ్ కేసులు స్వల్పంగా పెరిగాయి. గడచిన 24 గంటల్లో 39,495 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 213 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ వల్ల శుక్రవారం ఒకరు మరణించారు. దీంతో కరోనాతో ఇప్పటి వరకూ మృతి చెందిన వారి సంఖ్య 3,998కి చేరింది. కరోనా బారి నుంచి శుక్రవారం 156 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,779 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్య  ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. విదేశాల నుంచి శనివారం రాష్ట్రానికి వచ్చిన 70 మందికి పరీక్షలు నిర్వహించగా 70 మందికి నెగిటివ్‌ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు.


Also Read:  ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు


Also Read: Vinod Dua: సీనియర్ జర్నలిస్ట్ వినోద్ దువా కన్నుమూత...


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి