ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంట్‌లో తదుపరి కార్యాచరణ ఎలా ఉండాలన్నదానిపై సీఎం కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, కేంద్రంతో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రులు, ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం కేసీఆర్ ఎంపీలకు కీలక సూచనలు చేశారు. కొన్ని రోజులుగా తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపైనే రాజకీయాలు జరుగుతున్నాయి.
Also Read : విద్యాసంస్థల్లో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆందోళనలో విద్యార్థులు, తల్లిదండ్రులు
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుండి టీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేస్తున్నారు. ఎంపీలు చేస్తున్న ఆందోళనకు లోక్‌సభలో పలు పార్టీలు సైతం మద్దతు తెలిపాయి. అయితే.. ధాన్యం కొనుగోలు విషయంపై శుక్రవారం గోయల్ కూడా వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి పార్లమెంట్ ఉభయ సభల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ ఎంపీలకు సూచనలు చేశారు.
కేసీఆర్ ధాన్యాన్ని కేంద్రానికి ఇవ్వబోమని చెబుతూ లేఖ ఇచ్చారని పీయూష్ గోయల్ ఓ లేఖను పార్లమెంట్‌లో ప్రదర్శించారు. తెలంగాణ నుంచి ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన బియ్యం కూడా ఇవ్వడం లేదని అయినా ఎందుకు రాజకీయం ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదని పీయూష్ గోయల్ తెలిపారు. తెలంగాణలో వెరిఫికేషన్ కు వెళ్లినప్పుడు స్టాక్ లెక్కల్లో చాలా లోపాలు కనిపించాయన్నారు. యినా కూడా ప్రతినెలా మేం గడువును పొడిగిస్తూ వచ్చామన్నారు. ఏళ్ల తరబడి రాష్ట్రాలతో ఎంవోయూ చేసుకోవడం, దాని ప్రకారం కొనుగోలు చేయడం జరుగుతూనే వస్తోందని స్పష్టం చేశారు.
ఈ క్రమంలో నిన్న పార్లమెంట్ సమావేశంలో కేంద్ర మంత్రి స్పందించిన తీరుపై.. ఈ రోజు సీఎం కేసీఆర్ మంత్రులు, ఎంపీలతో కేసీఆర్ ప్రధానంగా చర్చించారు. ఆయన చెప్పిన విషయాల్లో ఎంత నిజాలు ఉన్నాయి. ఎన్ని అవాస్తవాలు ఉన్నాయన్న వాటిని పార్లమెంట్ వేదికగానే బయట పెట్టాలనే వ్యూహాన్ని టీఆర్ఎస్ అమలు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ధాన్యం కొనుగోళ్లపై జాతీయ విధానం ఉండేలా కేంద్రంపై ఎలా ఒత్తిడి తీసుకురావాలి? ఇతర రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్న వేళ వారితో ఎలా సమన్వయం చేసుకొని ముందుకెళ్లాలనే అంశంపై ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది.
Also Read: మాటల మాంత్రికుడు రోశయ్య .. ఆ పంచ్‌లకు ఎవరి దగ్గరా ఆన్సర్ ఉండదు !