భారత్ ను కలవరపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా వ్యాపిస్తుంది. ఇప్పటికే కర్ణాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదవ్వగా.. తాజాగా గుజరాత్ లో ఓ వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లు వైద్యాధికారులు ప్రకటించారు. గుజరాత్ జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించినట్లు వెల్లడించారు. ఇటీవల జింబాబ్వే నుంచి రాష్ట్రానికి వచ్చిన వ్యక్తిలో ఒమిక్రాన్ వేరియంట్ గుర్తించినట్లు తెలిపారు. దీంతో అప్రమత్తమైన అధికారులు వైరస్ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ప్రైమరీ కాంటాక్స్ వివరాలు సేకరిస్తున్నారు. ఇతర దేశాల నుంచి భారత్‌కు వచ్చిన కొందరి ఆచూకీ అధికారులకు చిక్కకపోవడం సమస్యగా మారింది. వారు దేశంలోని ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడంతో వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు
గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 72 ఏళ్ల వ్యక్తికి కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. ఆఫ్రికాలోని జింబాబ్వే దేశం నుంచి వచ్చిన వ్యక్తిలో ఓమిక్రాన్ లక్షణాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. జింబాబ్వే 'ఎట్ రిస్క్' దేశాలలో ఒకటిగా భారత్ గుర్తించింది. జామ్‌నగర్ మునిసిపల్ కమిషనర్ విజయ్‌కుమార్ ఖరాడి తెలిపిన వివరాల ప్రకారం... ఒమిక్రాన్ నిర్థారించేందుకు జీనోమ్ సీక్వెన్స్ కోసం ఇతని నమూనాలు అహ్మదాబాద్‌కు పంపించామన్నారు. వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం అతడికి కోవిడ్-19 ఓమిక్రాన్ వేరియంట్ సోకిందని ఆయన తెలిపారు.
Also Read: కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదా.. బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ ... తమిళనాడు నగరంలో ఆంక్షలు
" గుజరాత్ జామ్‌నగర్‌కు చెందిన వ్యక్తి గత కొంత కాలంగా జింబాబ్వేలో నివసిస్తున్నారు. ఆయన నవంబర్ 28న తన మామగారిని కలవడానికి భారత్ కు వచ్చారు. అతనికి జ్వరం రావడంతో వైద్యులు అతనికి RT-PCR పరీక్ష చేయించుకోవాలని సలహా ఇచ్చారు. కోవిడ్ పరీక్షలో అతని పాజిటివ్ వచ్చింది.” అని గుజరాత్ వైద్యాధికారులు ఇచ్చిన నివేదికలో తెలుస్తోందని PTI పేర్కొంది.
భారత్ ఒమిక్రాన్ (Omicron) వేరియంట్ మూడో కేసు ఇది. మిగిలిన రెండు కేసులు బెంగళూరుకు చెందిన 46 ఏళ్ల వైద్యుడికి సోకింది. అతడు ఇటీవల ఎక్కడికీ ప్రయాణించలేదు. దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన 66 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ వేరియంట్ సోకింది.
Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి