దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ భయాలు నెలకొన్న వేళ తమిళనాడులోని మధురై పాలనావర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఒక్క వ్యాక్సిన్ కూడా తీసుకోని వాళ్లను బహిరంగ ప్రదేశాల్లో అనుమతించమని ప్రకటించింది. మధురై నగరంలో ఆంక్షలకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకూ టీకా తీసుకోని వారికి వారం గడువు ఇచ్చింది. ఈ వారంలో ఒక్క వ్యాక్సిన్ అయినా తీసుకోవాలని సూచించింది. లేకుంటే వచ్చేవారం నుంచి బహిరంగ ప్రదేశాల్లో ప్రవేశించకుండా ఆంక్షలు విధించింది. షాఫింగ్ మాల్స్, మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్సులతో సహా 18 ప్రదేశాలకు అనుమతి ఉండదని ప్రకటించింది. ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేలోపు ప్రజలు కనీసం ఒక్క వ్యాక్సిన్ అయినా అయినా తీసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచించింది.
Also Read: ఒమిక్రాన్ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు
బహిరంగ ప్రదేశాల్లోకి నో ఎంట్రీ
జిల్లాలో ప్రజలు కనీసం ఒక్కడోసు వ్యాక్సిన్ అయినా వేయించుకునేందుకు ఒక వారం సమయం ఇచ్చాము. ఆ టైంలోగా వ్యాక్సిన్ తీసుకోని వారిని మాల్స్, షాపింగ్ కాంప్లెక్సులు, సహా ఇతర బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి ఉండదు’ అని మధురై కలెక్టర్ అనీశ్ శేఖర్ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. మధురై జిల్లాలో సుమారు 3 లక్షల మంది కనీసం ఒక్కడోసు టీకా కూడా తీసుకోలేదని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 71.6 శాతం మంది మొదటి డోసు, 32.8 శాతం మంది రెండో డోసు తీసుకున్నారని వెల్లడించారు. ఒమిక్రాన్ వేరియంట్ కేసులు కర్ణాటక రాష్ట్రంలో వెలుగుచూడడంతో ముందుజాగ్రత్తగా ఈ ఆంక్షలు పెడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మాల్స్, సినిమా హాల్స్, బహిరంగ ప్రదేశాల్లోకి ప్రవేశించడానికి ఒక్క డోసు టీకా అయినా తప్పనిసరి చేసింది.
Also Read: దేశంలోకి 'ఒమిక్రాన్' ఎంట్రీ.. అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిక
కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు వ్యాక్సినేషన్ తప్పనిసరి
తమిళనాడు వాణిజ్య పన్నుల శాఖ మంత్రి పి.మూర్తి మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ సోకకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తీసుకోవడం చాలా ముఖ్యమన్నారు. వ్యాక్సినేషన్ పై ప్రజలందరికీ అవగాహన కల్పింస్తామన్నారు. స్వచ్చంద సంస్థలు, నర్సులతో సహాయంతో వ్యాక్సినేషన్ లపై అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. కోవిడ్ వ్యాప్తిని నిర్మూలించేందుకు తమిళనాడు ప్రభుత్వం ఆంక్షల నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. టీకాలు తీసుకోని వారిని బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతించమన్నారు. ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి పి.మూర్తి అన్నారు. ఎయిర్ పోర్టుల్లో స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకోని వాళ్లకు బహిరంగ ప్రదేశాల్లోకి అనుమతి లేదని పేర్కొన్నారు. సింగపూర్, యూకే నుంచి తమిళనాడుకు వచ్చిన ముగ్గురు ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. వారిలో ఒక చిన్నారి కూడా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపినట్లు అధికారులు పేర్కొన్నారు.
Also Read: 'ఒమిక్రాన్'పై గుడ్ న్యూస్.. ప్రపంచమా ఊపిరి పీల్చుకో.. డెల్టా కంటే డేంజరస్ కాదట!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి