ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల వ్యవధిలో 29,731 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 184 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. ఒకరు కోవిడ్ కారణంగా మరణించారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,432కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 214 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,55,603 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2,163 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






Also Read: 'రోడ్లు.. కత్రినా కైఫ్ బుగ్గల్లా ఉండాలి.. 'ఏంటి బాబు.. ఏమన్నావు?


రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,198కి చేరింది. గడిచిన 24 గంటల్లో 214 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2,163 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో ఒకరు మరణించారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,432కు చేరింది. 


Also Read: మోదీని గద్దె దించేందుకు దీదీ మాస్టర్ ప్లాన్.. మేఘాలయలో కాంగ్రెస్‌కు షాక్!


కరోనా కొత్త వేరియంట్


భారదేశంలో మళ్లీ హై అలర్ట్ ప్రకటించారు. దక్షిణాఫ్రికాలో బయటపడిన కోవిడ్‌ కొత్త వేరియంట్‌ అత్యంత ప్రమాదకరంగా గుర్తించడంతో  కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలను అప్రమత్తం చేసింది. దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్‌, బోట్స్‌వానాల నుంచి వచ్చే ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొత్త వేరియంట్‌ ప్రజారోగ్యానికి సవాల్‌ విసిరే ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల ఆ దేశాల నుంచి వచ్చే ప్రయాణికులందరినీ ముప్పు ఉన్నవారిగానే పరిగణించి వారికి కఠినమైన స్క్రీనింగ్‌ జరిపి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జన్యు పరిణామక్రమ విశ్లేషణ కోసం పంపాలని సూచించారు. 


Also Read: ఆసియాలోనే అతిపెద్ద విమానాశ్రయానికి మోదీ శ్రీకారం.. ఆ రికార్డ్ యూపీదే!


Also Read: మూడు రాజధానుల చట్టాల్ని ఉపసంహరించుకున్నాం... హైకోర్టులో ప్రభుత్వం అఫిడవిట్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి