ఏపీలో కరోనా ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 22,785 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 749 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో 3గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,697కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 6,271 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,79,152 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 18,929 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,12,778కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,28,31,785 నిర్థారణ పరీక్షలు చేశారు.
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. కొత్తగా 44,877 కరోనా కేసులు నమోదయ్యాయి. 1,17,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 5,37,045కు చేరింది. డైలీ పాజిటివిటీ రేటు 3.17గా ఉంది. రికవరీ రేటు 97.55గా ఉంది. కరోనా కారణంగా ఒక్కరోజులో 684 మంది మృతి చెందారు. మరణాల రేటు 1.19గా ఉంది. దేశంలో ఇప్పటివరకు మొత్తం 172.81 కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Also Read: మళ్లీ తెరపైకి ప్రత్యేక హోదా, టీడీపీ-వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం
రాష్ట్రాల వారీగా
- కేరళలో కొత్తగా 15,184 కరోనా కేసులు నమోదయ్యాయి.
- మహారాష్ట్రలో కొత్తగా 4,359 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 32 మంది మృతి చెందారు. ముంబయిలో తాజాగా 349 కేసులు నమోదయ్యాయి.
- మధ్యాప్రదేశ్‌లో కొత్తగా 2,438 పైగా కేసులు నమోదయ్యాయి. ఏడుగురు కరోనాతో మృతి చెందారు.
- దిల్లీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. కొత్తగా 920 కరోనా కేసులు నమోదయ్యాయి. 13 మంది మృతి చెందారు.
Also Read: అయ్యప్ప సన్నిధిలో చిరు, దుమారం రేపుతోన్న ఆర్జీవీ పోస్ట్