అయ్యప్ప సన్నిధిలో చిరు: 

మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు శబరిమల అయ్యప్పను దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేస్తూ.. కొన్ని ఫొటోలను షేర్ చేశారు. 'చాలాకాలం తర్వాత స్వామిని దర్శించుకున్నాను. అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణంగా కాలి నడకన కాకుండా డోలీలో సన్నిధికి వెళ్లాల్సి వచ్చింది. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం శ్రమ ధారపోస్తున్న అశ్రమైక డోలీ సోదరులకు నా హృదయాంజలి. ఈ ప్రయాణంలో చుక్కపల్లి సురేశ్‌, గోపీ కుటుంబాల తోడు మంచి అనుభూతినిచ్చింది' అని ట్వీట్‌ చేశారు.





 

దుమారం రేపుతోన్న ఆర్జీవీ పోస్ట్:


సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే రామ్ గోపాల్ వర్మ పలు విషయాలపై స్పందిస్తూ సంచలనం సృష్టిస్తుంటారు. రీసెంట్ గా చిరంజీవి అండ్ మహేష్ బాబులను టార్గెట్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్స్ వైరల్ అయ్యాయి. తాజాగా ఆయన పెట్టిన పోస్ట్ దుమారం రేపుతోంది. తెలంగాణలో సమ్మక్క సారలమ్మ జాతర ఎంత ఘనంగా చేస్తారో తెలిసిందే. సమ్మక్క సారలమ్మలను దేవతలుగా కొలుస్తుంటారు జనాలు. అలాంటిది దేవతకు వర్మ విస్కీ అఫర్ చేస్తున్నట్లుగా ఫొటో ముందు చూపించాడు. అది కూడా కొండా మురళి, సురేఖా ఇంట్లోనంటూ ఓ ఫొటోను షేర్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు వర్మపై ఫైర్ అవుతున్నారు.