ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 24 గంటల వ్యవధిలో 17,940 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 54 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో మరణాలు సంభవించలేదు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,490కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 121 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,60,957 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 1099 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,546కి చేరింది. గడచిన 24 గంటల్లో 121 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 1099 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో మరణాలు సంభవించలేదు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,490కు చేరింది. 


Also Read:  ఏపీలో కొనసాగుతున్న సినిమా కష్టాలు... రేపు మంత్రి పేర్ని నానితో ఎగ్జిబిటర్ల భేటీ...


ఒమిక్రాన్  వ్యాప్తిపై సీఎం సమీక్ష


కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి కట్టడి కోసం సీఎం  జగన్ ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రులు సిద్ధంగా ఉండాలని  సమీక్షలో సీఎం జగన్ ఆదేశించారు.  ఈ సందర్భంగా వ్యాక్సినేషన్‌పై అధికారులు జగన్‌కు నివేదిక అందిచారు. 13 జిల్లాల్లో 98.96శాతం మొదటి డోస్‌ ..71.76శాతం రెండో డోస్‌ వేసినట్లుగా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.   కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ప్రకటించినందున దాని  అన్ని రకాలుగా సిద్ధంకావాలని అధికారులకు సీఎం ఆదేశించారు. 15 నుంచి 18 ఏళ్లవారితో కలుపుకుని దాదాపు 75 లక్షల మందికి బూస్టర్‌ డోస్‌ అవసరమని ప్రాథమిక అంచనావేశామని అధికారులు తెలిపారు. 


Also Read: టికెట్ రేట్స్ ఇష్యూ పరిష్కారానికి తొలి అడుగు... ఏపీ సీయం అపాయింట్మెంట్ కోసం టాలీవుడ్ వెయిటింగ్



రాష్ట్రంలో 6 ఒమిక్రాన్‌ కేసులున్నాయని వీరిలో ఎవ్వరూ  ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి రాలేదన్నారు. అధికారులు ఇచ్చిన వివరాలు ప్రకారం భయాందోళన అవసరంలేదని.. అదే సమయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.  రాష్ట్రంలో కేసులు తక్కువగా ఉన్నా.. ఇతర ప్రాంతాలనుంచి రాకపోకలు కొనసాగుతున్నందున పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ చర్యలు తీసుకోవాలని సూచించారు. టెస్ట్‌ ఎర్లీ, ట్రేస్‌ ఎర్లీ, ట్రీట్‌ ఎర్లీ పద్దతిలో అధికారులు ముందుకు వెళ్లాలన్నారు.  గ్రామ, వార్డు సచివాలయం స్థాయి నుంచి డేటాను తెప్పించుకోవాలని..వచ్చే వారం మరోసారి సమావేశమై పరిస్థితిని సమీక్షిద్దామని సీఎం  సూచించారు. 


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి