ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై ఇంకా ఎండ్ కార్డు పడలేదు. మూవీ టికెట్ రేట్లను తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై తెలుగు రాష్ట్రాల్లో తీవ్రంగా చర్చ జరిగింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై కొందరు బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా సినీ పరిశ్రమ పెద్దలు ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. టికెట్ల వ్యవహారంపై సినీ పరిశ్రమ, రాజకీయ నాయకులు కూడా స్పందించారు. ఏపీలోని థియేటర్లపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. థియేటర్ల నిర్వహణ, ఎక్కువ ధరకు టికెట్ల విక్రయం, అనుమతులు లేవని అధికారులు సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో థియేటర్లు నడపలేమని పలు జిల్లాల్లో స్వచ్ఛందంగా సినిమా హాళ్లను మూసివేస్తున్నారు. 







Also Read: ఏపీలో సినిమా థియేటర్లపై కొనసాగుతున్న దాడులు.. నేడు కర్నూలు, ప.గో జిల్లాలో సినిమా హాళ్ల సీజ్ !


మంత్రి నానితో డిస్ట్రిబ్యూటర్ల భేటీ


ఈ సమయంలో ప్రభుత్వంతో చర్చలకు థియేటర్ యజమానులు, ఎగ్జిబిటర్లు సిద్ధమయ్యారు. టికెట్‌ రేట్లు తగ్గించడంతో యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి పేర్ని నాని చర్చించాలని సమయాత్తమయ్యారు. ఈ విషయంపై మంత్రిని కలిసేందుకు అనుమతి కోరారు. అయితే మంత్రి ఎగ్జిబిటర్లను మాత్రమే కలిసేందుకు ఒప్పుకున్నారు. మంగళవారం మధ్యాహ్నం ఎగ్జిబిటర్లు మంత్రిని కలిసేందుకు అపాయింట్ మెంట్ లభించింది. ఈ సమావేశంలో ఎగ్జిబిటర్లు తమ సమస్యలను మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్లనున్నారు. సినిమా టికెట్‌ ధరలపై పలువురు హీరోలు, నిర్మాతలు  చేసిన వ్యాఖ్యలతో ఇబ్బంది పడుతున్నామని థియేటర్‌ యజమానులు, ఎగ్జిబిటర్లు చెబుతున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన రేట్లతో థియేటర్లు నడపలేమని, టికెట్ల నిర్ణయంపై పునరాలోచించాలని మంత్రిని కోరనున్నారు. 


Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్


సినిమా టికెట్ల ధరలపై హీరో నాని కామెంట్స్


ఏపీ సినిమా టికెట్ల రేట్లపై నేచురల్ స్టార్ నాని ఇటీవల స్పందించారు. శ్యామ్ సింగరాయ్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఏపీలో టికెట్ రేట్ ఇష్యూ గురించి నాని మాట్లాడారు. థియేటర్లో కలెక్షన్స్ కంటే కిరాణా షాప్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయంటూ కామెంట్స్ చేశారు. ఈ విషయంలో చాలా మంది నానిని సపోర్ట్ చేయగా.. ఏపీ మంత్రులు మాత్రం నానిని విమర్శించారు. తాజాగా మరోసారి ఈ విషయంపై మాట్లాడారు నాని. తన అభిప్రాయం చెబితే.. దాన్ని చీల్చి పెద్ద ఇష్యూ చేశారని అన్నారు నాని. సమస్య అనేది నిజమని.. అది వచ్చినప్పుడు అందరూ ఒకటికావాల్సిన అవసరం ఉందని.. కానీ టాలీవుడ్ లో అలాంటి పరిస్థితి లేదని అన్నారు నాని. తన మాటలు తప్పయితే తనకు ఆనందమే అని కానీ టాలీవుడ్ లో మాత్రం యూనిటీ లేదని చెప్పారు. ఎవరినీ అవమానించడానికి ఈ మాటలు అనడం లేదని తెలిపారు. వకీల్ సాబ్ సినిమా సమయంలో ఈ సమస్య మొదలైనప్పుడు అందరూ అప్పుడే ఒక పేజ్ లోకి వచ్చి సమస్యను డీల్ చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు వచ్చి ఉండేవి కావని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. టాలీవుడ్ వాళ్లకు ఐక్యత లేదంటూ నాని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 


Also Read:  భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి