ఆంధ్రప్రదేశ్‌లో సినిమా ధియేటర్లపై అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి పలు జిల్లాల్లో సోదాలు చేసి  అనేక ధియేటర్లను సీజ్ చేసిన అధికారులు శుక్రవారం కూడా సోదాలు కొనసాగించారు.  పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం  సినిమా ధియేటర్లలో సబ్ కలెక్టర్ విష్ణు చరణ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు.  బి ఫారం లైసెన్స్, టికెట్ రేట్లు, నిబంధనల అమలును పరిశీలించారు. నిబందనలు పాటించకపోవడంతో అప్పటికప్పుడు ఐదు ధియేటర్లను సీజ్ చేసారు. నర్సాపురం డివిజన్‌లో ఉన్న అన్ని ధియేటర్లలోనూ సోదాలు చేస్తామని అధికారులుప్రకటించారు. 


Also Read: హీరో నాని ఎవరో తెలీదు.. నాకు కొడాలి నానీనే తెలుసు, బైక్ అమ్మి పవన్ కల్యాణ్ కటౌట్లు కట్టా: మంత్రి అనిల్





మరో వైపు కర్నూల్ నగరంలోని ఆనంద్ సినీ కాంప్లెక్స్ థియేటర్స్ లోనూ ఆకస్మిక తనిఖీ చేశారు  జిల్లా  కలెక్టర్ కోటేశ్వరరావు.  ప్రేక్షకులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారో పరిశీలించారు. థియేటర్లో ఉన్న ప్రేక్షకులను వివరాలు అడిగితెలుసుకున్నారు.  రెండు రోజుల నుంచి జరుగుతున్న సోదాలతో కనీసం వంద ధియేటర్ల వరకూ సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. మరో వైపు గిట్టుబాటు కాని టిక్కెట్ ధరలు, అధికారుల తనిఖీల కారణంగా పలువురు సినిమా హాళ్ల యజమానాలు స్వచ్చందంగా ధియేటర్లను మూసివేస్తున్నారు. అదే సమయంలో అధికారులు నిబంధనలకు విరుద్ధంగా ధియేటర్లను సీజ్ చేస్తున్నాని ఎగ్జిబిటర్లు ఆరోపిస్తున్నారు. 


Also Read: ఏపీ పోలీసులపై కేంద్రం డేగకన్ను, త్వరలోనే అదంతా జరుగుతుంది.. సీఎం రమేశ్ సంచలనం


ధియేటర్‌ను సీజ్ చేసే అధికారం జాయింట్ కలెక్టర్‌కు మాత్రమే ఉంటుందని.. కానీ సబ్ కలెక్టర్లు వచ్చి సీజ్ చేస్తున్నారని.. అదే సమయంలో నిబంధనలు పాటించకపోతే.. షోకాజ్ నోటీసు ఇచ్చి.. పదిహేను రోజుల సమయం ఇవ్వాలనే నిబంధనలు ఉన్నాయన్నారు. ఈ నిబంధనలు పాటించకుండా అప్పటికప్పుడు ధియేటర్లను సీజ్ చేస్తూ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని యజమానులు ఆరోపిస్తున్నారు.  


Also Read: Ramana Deekshitulu : స్వామీ.. కోర్టుకెళ్లి తేల్చుకుందామా ? టీటీడీపై మళ్లీ ట్వీటెత్తిన రమణదీక్షితులు !


అయితే  అధికారులు మాత్రం తాము నిబంధనల ప్రకారమే సోదాలు చేస్తున్నామని... ఎవరైనా నిబంధనలు అతిక్రమించినట్లుగా తేలితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేస్తున్నారు. కొన్ని ధియేటర్లకు జరిమానాలు వేస్తున్నారు. అధిక టిక్కెట్ రేట్లను వసూలు  చేసిన ధియేటర్లను మాత్రం సీజ్ చేస్తున్నారు. పండగ సీజన్ ప్రారంభం కావడం.. పెద్ద సినిమాలు విడుదలకు సిద్దమయిన పరిస్థితుల్లో ఏపీలో ధియేటర్లను సీజ్ చేయడం.. టిక్కెట్ ధరలను తగ్గించడంతో టాలీవుడ్ పెద్దలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. 


Also Read: Prakasam: భార్యను తన దగ్గరికి పంపాలని భర్తకు ఫోన్, కామాంధుడిపై పోలీసులకు ఫిర్యాదు.. అది తెలిసి దాష్టీకం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి