ఏపీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గడచిన 24 గంటల వ్యవధిలో 37,849 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 840 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. గడచిన 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కోవిడ్‌ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,501కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 133 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 20,62,290 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 2972 యాక్టివ్‌ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.


Also Read: దేశంలో కరోనా డేంజర్ బెల్స్.. ఒక్కరోజులో అక్షరాల లక్ష కేసులు






రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,79,763కి చేరింది. గడచిన 24 గంటల్లో 133 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. ఇంకా రాష్ట్రంలో 2972 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఏపీలో గత 24 గంటల్లో కోవిడ్ తో ఒకరు మృతి చెందారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 14,501కు చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3,15,29,919 శాంపిల్స్ పరీక్షించారు.  


Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!


దేశంలో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఒక్కరోజులో కొత్తగా లక్షకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కొత్తగా 1,17,100 కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. 302 మంది కరోనా వల్ల ప్రాణాలు కోల్పోయారు. 30,836 మంది కరోనా నుంచి కోలుకున్నారు.





      • డైలీ పాజిటివిటీ రేటు: 7.74%.

      • యాక్టివ్ కేసులు: 3,71,363

      • మొత్తం రికవరీలు: 3,43,71,845

      • మొత్తం మరణాలు: 4,83,178 

      • మొత్తం వ్యాక్సినేషన్: 154.32 కోట్లు




Also Read: ఒమిక్రాన్.. సాధారణ జలుబు కాదు.. లైట్ తీసుకోవద్దు: WHO హెచ్చరిక


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి