కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై మరోసారి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరించింది. ఒమిక్రాన్ కారణంగా ప్రపంచం మరో కరోనా వేవ్ చూడాల్సి వస్తుందని పేర్కొంది. ఈ వేరియంట్‌ను ఏ మాత్రం లైట్ తీసుకోవద్దని సూచించింది. చాలా మంది ఒమిక్రాన్‌కు సాధారణ జలుబు లక్షణాలు మాత్రమే ఉన్నాయని భావిస్తున్నారని.. అయితే ఇది ఎంత మాత్రం నిజం కాదని తేల్చిచెప్పింది.
అవును నిజమే..
మరియా వాన్ కెర్‌కోవ్ చేసిన హెచ్చరికపై డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డా. సౌమ్య స్వామినాథన్ స్పందించారు. ఒమిక్రాన్ సాధారణ జలుబు కాదని.. దీని వల్ల ఆరోగ్య వ్యవస్థలు మరోసారి దెబ్బతినక తప్పదని ట్వీట్ చేశారు.
అమెరికా డిసీజ్ కంట్రోల్, ప్రివెన్షన్ చేసిన అధ్యయనంలో ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలో దగ్గు, ఆయాసం, రక్త గడ్డ కట్టడం, ముక్కు కారడం వంటి లక్షణాలు ఉన్నట్లు తేలింది.
అయితే దక్షిణాఫ్రికా, అమెరికా, యూకేకు చెందిన పలు అధ్యయనాల్లో ఒమిక్రాన్ తక్కువ లక్షణాలతో చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని తేలింది.
మరణాలు..
ఇప్పటివరకు యూకేలో 14 మంది ఒమిక్రాన్ వల్ల మరణించారు. అమెరికా, దక్షణి కొరియాలో ఒక్కొక్కరు మృతి చెందారు. అయితే మృతుల్లో ఎక్కువ మంది వ్యాక్సిన్ తీసుకోనివారే.
ప్రస్తుతం ఉన్న నివేదికల ప్రకారం ఒమిక్రాన్.. పై శ్వాస మార్గంపై ప్రభావం చూపుతుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే మునుపటి వేరియంట్ల కంటే ఈ ప్రభావం తక్కువేనని పేర్కొంది. కానీ ఒమిక్రాన్ కారణంగా ప్రపంచంలో మరికొన్ని కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదముందని వెల్లడించింది.
Also Read: Covid Cases: టాప్ గేరులో కరోనా వ్యాప్తి.. ఒక్కరోజులో ఏకంగా 90 వేల కేసులు.. బీ అలర్ట్!
Also Read: PM Modi Update: 'ప్రాణాలతో ఎయిర్‌పోర్ట్‌కు వచ్చా.. మీ సీఎంకు థ్యాంక్స్'.. పంజాబ్ అధికారులతో ప్రధాని