రేషన్ షాపులు మూసేసినా రేషన్ పంపిణీ ఆగిపోదని ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. ఒకటవ తేదీ నుంచి రేషన్ యథావిధిగా పంపిణీ చేస్తామన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో 11 వేల వాహనాలతో ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తున్నామన్నారు. డీలర్లల తమ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని మంత్రి సూచించారు. రేషన్ డీలర్ల బెదిరింపులకు ప్రభుత్వం భయపడేదని తేల్చిచెప్పారు. గతంలో రేషన్ షాపుల పరిస్థితి వేరు, ప్రస్తుతం వేరు అని అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ఇప్పుడు ఇంటింటీ రేషన్ గా మారిందన్నారు. రేషన్ దుకాణాలు బంద్ చేస్తామని బెదిరింపులకు దిగితే  పౌరసరఫరాల శాఖ ద్వారా ప్రజలకు నేరుగా పంపిణీ చేస్తామన్నారు. రేషన్ దుకాణాలు కొనసాగాలంటే డీలర్ల భాష, పద్ధతి మార్చుకోవాలని మంత్రి కొడాలి నాని సూచించారు. లేదంటే డీలర్లను బైపాస్ చేసి వాహనాల ద్వారా ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తామన్నారు. ప్రజలకు నిత్యావసరాలు అందించడం ప్రభుత్వ బాధ్యతని, దానిని ఎవరూ అడ్డుకోలేరన్నారు.  


Also Read: విద్యాసంస్థల అప్పగింతలో బలవంతం లేదు... పారదర్శకంగా నియామకాలు చేపట్టండి... ఉన్నత విద్యపై సీఎం జగన్ సమీక్ష


రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళనలు


రేషన్ స్టాక్ గోనె సంచులు వెనక్కి తీసుకుని డబ్బులు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం తమను మోసం చేసిందంటూ రాష్ట్రవ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన చేపట్టారు. డివిజన్ కేంద్రాలలో డీలర్లు స్టాక్ పాయింట్ల వద్ద నిరసన చేశారు. రాష్ట్ర రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం పిలుపుతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా రేషన్ పంపిణీ నిలిపివేసి నిరసన చేపట్టారు. జీవో నెంబర్ 10ని రద్దు చేసి ఖాళీ గోతాలను డీలర్లకే ఇవ్వాలని కోరారు. ఇంటింటికీ సరకుల పంపిణీ వచ్చాక ఆదాయాన్ని కోల్పోయామని రేషన్ డీలర్లు అన్నారు. ఇంటింటికీ సరకులు అందించడానికి మొబైల్ డిస్పెన్సరీ యూనిట్ పేరుతో ఓ వాహనాన్ని ఏర్పాటు చేసి, ఎండీయూ ఆపరేటర్ ని కూడా నియమించారని తెలిపారు. వీరికి జీతాలు ఇస్తూ డీలర్లను డమ్మీలను చేశారని ఆరోపించారు. 


Also Read: ఏపీలో రేపట్నుంచి రేషన్ స్టాక్ దిగుమతి బంద్... బకాయిలు తక్షణమే చెల్లించాలని రేషన్ డీలర్లు డిమాండ్


ఓ దశలో రేషన్ డీలర్ వ్యవస్థ పూర్తిగా రద్దు చేస్తారని అనుకున్నా వారికి కమీషన్ ఇస్తామని చెప్పి ఎండీయూ ఆపరేటర్ల ద్వారానే పనిచేయిస్తున్నారన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత రేషన్ సరకులు మాత్రం డీలర్లు నేరుగా చౌకధరల దుకాణాల్లోనే అందిస్తున్నారని రేషన్ డీలర్ల సంఘం తెలిపింది. 2020 నుంచి డీలర్లకు కమీషన్లు కూడా సరిగా ఇవ్వడంలేదని ఆరోపించింది. దీంతో డీలర్లు ఎప్పటికప్పుడు తమ డిమాండ్లను ప్రభుత్వానికి తెలియజేస్తున్నా సమస్యలు పరిష్కారం కావడంలేదన్నారు. 


Also Read:  రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్ల ఆందోళన... గోనె సంచులను డీలర్లకే ఇవ్వాలని డిమాండ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి